Take a fresh look at your lifestyle.

ఎన్నార్సీ, ఎన్‌పీఆర్‌ అవసరం లేదు

we dont need nrc and nrp
జామా మసీదు ఎదుట ఆందోళన
సేవ్‌ ఇం‌డియా అంటూ నినాదాలు

పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ ఢిల్లీలోని జామా మసీదు ఎదురుగా శుక్రవారం పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. శుక్రవారం ప్రార్థనలు ముగిసిన తర్వాత ఎన్నార్సీని, సీఏఏను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ దేశానికి ఎన్నార్సీ, ఎన్‌పీఆర్‌ అవసరం లేదు… ఈ దేశానికి ఉద్యోగాలు అవసరం. శాంతి, సౌభ్రాతృత్వం అవసరం అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అంతేకాకుండా ’దేశాన్ని విభజించవద్దు… సేవ్‌ ఇం‌డియా అంటూ రాసిన ప్లకార్డులను ప్రదర్శించారు. నిరసనకు కాంగ్రెస్‌ ‌నేత అల్కా లంబాతో పాటు ఆమ్‌ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే షోయబ్‌ ఇక్బాల్‌ ‌తమ మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్‌ ‌నేత అల్కా లంబా కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. నిరుద్యోగ సమస్య అనేది దేశంలో ఉందని, పెద్దనోట్ల రద్దు సమయంలో ఎలాగైతే ప్రజలు ఏటీఎంల ముందు ఎలాగైతే క్యూలో నిల్చున్నారో, అలాగే ఎన్నార్సీని వ్యతిరేకించడానికి కూడా ’క్యూ’ లో నిల్చున్నారని మండిపడ్డా?రు. ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేయడం చాలా ప్రధానమని, కేంద్రం బలవంతంగా సీఏఏను ప్రజలపై రుద్దడం తగదని లంబా మండిపడ్డారు. మరోవైపు బీమ్‌ ఆర్మీ చీఫ్‌ ‌చంద్రశేఖర్‌ ఆజాద్‌ను విడుదల చేయాలని, ఎన్నార్సీని, సీఏఏను వ్యతిరేకిస్తూ కొందరు ఆందోళనకారులు ప్రధాని ఇంటిని ముట్టడించడానికి బయల్దేరారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకున్నారు.

Tags: Opposing, Citizenship, Amendment Bill, Jama Masjid, Delhi

Leave a Reply

error: Content is protected !!