Take a fresh look at your lifestyle.

మా కొద్దీ ‘భగీరథ’ నీళ్లు

  • ఈ నీటితో చర్మ వ్యాధులు
  • రోడ్డుపై బైఠాయించిన గ్రామస్తులు
  • బావి నీళ్లు అందించాలంటు నిరసన
  • రోగాలతో ఇబ్బందులు పడుతున్న గ్రామస్థులు
  • గ్రామంలో పూర్తి గాని పైప్లైన్‌ ‌వ్యవస్థ

మిషన్‌ ‌భగీరథ పధకం ద్వారా ఇంటిటికి అంది స్తున్న నీటిని వాడుతండటంతో చర్మ సంబంధిత వ్యాధులు వ్యాపిస్తున్నాయని వరంగల్‌ ‌రూరల్‌ ‌జిల్లా నెక్కొండ మండలం గుండ్రపల్లి గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మంగళవారం భగీరథ నీళ్లు మాకొద్దు అంటూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.. భగీరథ నీరు తాగడం వల్ల గొంతులో దురద, నోరు బొంగురు పోవడం వంటి సమస్యలు రావడమే కాకుండా, చిన్న పిల్లలకు ఎక్కువగా చర్మ వ్యాధులు వస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో భగీరథ నీరు రాక ముందు రెండు బావుల ద్వారా తాగునీరు, నిత్య అవసరాల కు నీరు అందించే వారని, ఇప్పుడు ఆ నీటిని బందు చేసి భగీరథ నీరును అందిస్తున్నారని అన్నా రు. భగీరథ నీరు తాగడం వల్ల అనేక రోగాలు వ్యాప్తి చెందుతున్నాయని గ్రామంలో ఉన్న పాత వాటర్‌ ‌ట్యాంకుకు బాయిల ద్వారా నీళ్లను సరఫరా చేసి గ్రామానికి విడుదల చేయాలని వారు డిమాండ్‌ ‌చేశారు. మొదట్లో భగీరథ నీరు తాగిన గ్రామస్తులు వాతావరణం ఇతర కారణాల వల్ల చర్మ వ్యాధులు వస్తున్నాయని భావించామని, కానీ ఈ సమస్య నీటి వల్లనే ఉత్పన్నమైందని అన్నారు.

గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారన్న విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సంబంధిత అధికా రుల దృష్టికి సమస్యను వివారిస్తామని హామీ ఇవ్వ డంతో వారు నిరసనను విరమించుకున్నారు. విషయం తెలుసుకొని వచ్చిన మిషన్‌ ‌భగీరథ ఆఫీసర్లును చుట్టుముట్టి గ్రామస్థులు భగీరథ నీళ్లు మాకొద్దు అంటూ బావి నీళ్లను పైపులైన్ల ద్వారా అందించాలని కోరారు. అధికారులను వెంటబెట్టు కొని గ్రామంలోని ఇళ్లలో నిలవ ఉంచుకున్న నీటిని చూపించారు. నిల్వ ఉంచిన నీరు దుర్వాసన వస్తుందని ఆరోపిస్తున్నారు. నిటిని పరిశీలించిన ఆఫీసర్‌ ‌వాణి మాట్లాడుతూ పాలేరు నుంచి నీటి సరఫరా అవుతుందని ఆ నీటితో దద్దుర్లు వచ్చే అవకాశం లేదని అలాంటిది ఏమైనా ఉంటే నీటిని పరిశీలించి జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు.కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్‌ ‌తాటిపర్తి నాగేంద్రమ్మ, వార్డు సభ్యులు బోళ్ల శివ కుమార్‌, ‌పరకాల శేషయ్య, లాక లచ్చమ్మ, మనుబోతుల శ్రీనివాస్‌ ‌రెడ్డి, తక్కలపెల్లి మోహన్‌ ‌రావు, శివ పార్వతి, మాజీ సొసైటీ డైరెక్టర్‌ ‌కనపర్తి రమేష్‌, ‌మాజీ సర్పంచ్‌ ‌గుగులోతు నందా నాయ్రమస్తులు బొల్ల వీరస్వామి, వేణు, రామారావు, వెంకటేశ్వర్లు, సుబ్బారావు, రంజిత్‌, అనిల్‌, ‌మహిళలు పెండ్యాల అరుణ పాల్గొన్నారు.

Tags: Warangal Rural Zilla, Nekonda Mandalam, Gundrapalli Villagers

Leave a Reply