Take a fresh look at your lifestyle.

‘‌ప్రజాతంత్ర’ సంపాదకులు దేవులపల్లి అజయ్‌కు వస్తున్న బెదిరింపులను ఖండిస్తున్నాం

  • దుండగులను తక్షణమే గుర్తించి శిక్షించకపోతే ఆందోళనకు పూనుకుంటాం
  • -తెలంగాణ యూనియన్‌ ఆఫ్‌ ‌వర్కింగ్‌ ‌జర్నలిస్టస్-ఐజేయూ హెచ్చరిక

ప్రజాతంత్ర ప్రతినిధి, హైదరాబాద్‌/ ‌ప్రజాతంత్ర, ముషీరాబాద్‌ : ‌ప్రజాతంత్ర దినపత్రిక సంపాదకులు, సీనియర్‌ ‌పాత్రికేయులు దేవులపల్లి అజయ్‌ ‌కు గత ఐదు రోజులుగా ఆగంతకులు ఫోన్లలో చేస్తున్న బెదిరింపులను తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్‌ ‌జర్నలిస్టుల సంఘం(టీయూడబ్ల్యుజె) రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నగునూరి శేఖర్‌, ‌కె. విరాహత్‌ అలీ, ఉప ప్రధాన కార్యదర్శి విష్ణుదాస్‌ ‌శ్రీకాంత్‌, ఐజేయూ కార్యదర్శి వై. నరేందర్‌ ‌రెడ్డి, హెచ్‌.‌యు.జె కార్యదర్శి శిగ శంకర్‌ ‌గౌడ్‌ ‌లు గురువారం నాడు సంయుక్త ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో భావ ప్రకటన స్వేచ్ఛను, మీడియా స్వేచ్ఛను అడ్డుకునేందుకు కొన్ని అసాంఘిక శక్తులు కుట్రలు పన్నడం సహించారనిదన్నారు.

వినాయక చవితి సందర్భంలో హాస్యంగా కార్టూన్లు వేయడం పత్రికల్లో, మేగజైన్లలో ఆనవాయితీగా కొనసాగుతుందని, ఈ నేపథ్యంలోనే ప్రజాతంత్ర దినపత్రికలో ఆగస్టు 22న వేసిన కార్టూన్‌ ‌పై కొన్ని శక్తులు రాద్ధాంతం చేస్తూ దాని సంపాదకులు అజయ్‌ ‌ని ఫోన్లలో బెదిరింపులకు గురిచేయడం, అసభ్యకర పదజాలంతో దూషించడాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ విషయమై ఎల్బీనగర్‌ ‌పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశామని, డీజీపీ దృష్టికి తీసుకెళ్లామని వారు తెలిపారు. కాల్‌ ‌రికార్డస్ ఆధారంగా దుండగులను వెంటనే గుర్తించి చట్టపరంగా కఠినంగా శిక్షించాలని, లేని పక్షంలో తాము ఆందోళనకు పూనుకుంటామని వారు హెచ్చరించారు.

Leave a Reply