Take a fresh look at your lifestyle.

ప్రతీ ఇంటి నుంచి చెత్తను సేకరిస్తాం కమిషనర్‌ ‌దినేష్‌ ‌కుమార్‌

‌నెల్లూరు, ఆగస్ట్ 2 : ‌నగరపాలక సంస్థ పరిధిలోని ప్రతీ ఇంటినుంచి చెత్తను సేకరించేలా పటిష్టమైన ప్రణాళికలు సిద్ధం చేశామని, ఇళ్లతో పాటు అన్ని కమర్షియల్‌ ‌షాపులు, కార్యాలయాల నుంచి కూడా ప్రతిరోజూ సేకరించేలా చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్‌ ‌దినేష్‌ ‌కుమార్‌ ‌ప్రకటించారు. నగర పాలక సంస్థ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడారు. ప్రస్తుతం చెత్త సేకరణకు వినియోగిస్తున్న 54 వాహనాలకు తోడు మరో 125 నూతన వాహనాలను సంసిద్ధం చేశామని తెలిపారు. వాహనాలకు డ్రైవరు జీతం, డీజిల్‌, ‌రిపేర్లు వంటి ఖర్చులను యూజర్‌ ‌చార్జీల రూపంలో వినియోగించనున్నామని తెలిపారు. స్లమ్‌ ఏరియా లో రోజుకు రూపాయి వంతున నెలకు 30 రూపాయలు, నాన్‌ ‌స్లమ్‌ ఏరియాలో రోజుకు 4 రూ వంతున నెలకు 120 రూపాయలు విధించనున్నామని తెలిపారు.

డస్ట్ ‌బిన్స్ ‌వాడకుండా నేరుగా ఇంటి నుంచే చెత్తను సేకరించే విధానంతో నగరం స్వచ్ఛంగా ఉండటంతో పాటు, డస్ట్ ‌బిన్‌ ‌లేని కారణంగా రోడ్లపై పశువులు, పందులు, కుక్కల సంచారం పూర్తిగా తగ్గిపోతుందని కమిషనర్‌ ‌పేర్కొన్నారు. ఆగస్ట్ 19 ‌వ తేదీ నాటికి నూతన వాహనాలను ప్రభుత్వం అందజేయనుందని, అప్పటినుంచి ప్రతీ ఇంటి నుంచి ప్రతీ రోజు సేకరించే చెత్తను శాస్త్రీయ విధానంలో రీ సైకిల్‌ ‌చేయించి ఎరువుల తయారీ చేయనున్నామని తెలిపారు.

Leave a Reply