- అలాగే వెనక్కితగ్గే ప్రసక్తే లేదు
- ఎవరి పౌరసత్వం రద్దు కాదని పునరుద్ఘాటన
- సీఏఏకు మద్దతుగా లక్నో ర్యాలీలో అమిత్ షా
లక్నో : పౌరసత్వ సవరణచట్టాని(సీఏఏ)కి వ్యతిరేకంగా నిరసనకారులు ఎన్ని ఆందోళనలు చేసినా.. ఎట్టిపరిస్థితుల్లోను సీఏఏను వెనక్కి తీసుకునేదే లేదని కేంద్రంశాఖ మంత్రి అమిత్‌షా స్పష్టం చేశారు. మంగళవారం లఖ్‌నవూలో సీఏఏకి మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా రాహుల్‌గాంధీ, సీఎం మమతా బెనర్జీ, అఖిలేశ్ యాదవ్‌కు సవాలు విసిరారు. సీఏఏపై బహిరంగ చర్చకు సిద్ధమేనా అని సవాలు చేశారు. ‘‘సీఏఏ ద్వారా ఎవరి పౌరసత్వాన్ని రద్దు చేయము. పౌరసత్వం ఇచ్చేందుకు ఈ చట్టాన్ని తీసుకొచ్చాం. ప్రతిపక్షాలు అబద్దాలు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఆందోళనకారులకు నేను ఒకటే చెబుతున్నా.. రు ఆందోళనలు చేసుకోండి. మేం మాత్రం సీఏఏని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు.రాహుల్ జీ, అఖిలేశ్ జీ, మాయావతి జీ, మమతా జీ అందరికీ ఇదే నా సవాల్. దేశంలో ఎక్కడైన సీఏఏపై బహిరంగ చర్చకు రండి. ఓటుబ్యాంకు రాజకీయాలు ప్రతిపక్ష పార్టీల కళ్లను కప్పేశాయి’ అని ఎద్దేవా చేశారు. ‘పాకిస్థాన్ నుంచి ఎన్నో ఏళ్లుగా అక్రమ వలసదారులు, ఉగ్రవాదులు వస్తూ ఇక్కడ బాంబులు పేలుస్తుంటే మౌనముని బాబా మన్మోహన్ సింగ్ మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు’ అంటూ కాంగ్రెస్‌పై ఘాటు విమర్శలు చేశారు.
సీఏఏను వ్యతిరేకిస్తూ లక్నోలో ముస్లింలు గత వారం నుంచి ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. అటువంటి ప్రదేశంలో సీఏఏపై అవగాహన నిర్వహిస్తూ ఈ ర్యాలీ నిర్వహించారు. దేశంలోని పలు ప్రాంతాల్లో వ్యతిరేక, అనుకూల ప్రదర్శనలతో చర్చనీయాంశంగా మారిన పౌరసత్వ సవరణ చట్టం అమలుపై కేంద్ర •ం మంత్రి అమిత్‌షా విస్పష్ట ప్రకటన చేశారు. సీఏఏను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని కుండబద్ధలు కొట్టారు. అయోధ్యలో భవ్యమైన రామమందిర నిర్మాణాన్ని 3 నెలల్లో ప్రారంభిస్తామని కూడా ప్రకటించారు. దేశాన్ని ముక్కలు చేయండంటున్న ’టుకడే టుకడే’ గ్యాంగ్‌కు కాంగ్రెస్ మద్దతుగా నిలుస్తోందని విమర్శించారు. ఇండియాకు వ్యతిరేకంగా పనిచేస్తే జైలుకేనని ఘాటుగా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, పాక్ ప్రధాని ఇమ్రాన్ ఒకే స్వరంతో మాట్లాడుతున్నా రంటూ మండిపడ్డారు. దేశవ్యాప్తంగా అల్లర్లను కాంగ్రెస్ ప్రోత్సహిస్తోందని తప్పుపట్టారు. సీఏఏకు వ్యతిరేకంగా స్పష్టమైన కుట్ర జరుగుతోందని, సీఏఏపై రాహుల్, మమతా బెనర్జీ ఎక్కడ చర్చ కోరుకుంటే అక్కడ చర్చకు తాము సిద్ధమేనంటూ అమిత్‌షా ప్రతి సవాలు విసిరారు.
Tags: Concerns, CAA Amit Shah, modi govt, nrc and caa rally, lucknow rally