Take a fresh look at your lifestyle.

వైయస్‌ ‌పాలన ఎన్నటికీ మరువలేము

జయంతి ఉత్సవాల్లో భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ ‌వైయస్‌ ‌రాజశేఖర్‌ ‌రెడ్డి సేవలను మరువలేమని, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేద ప్రజలు, రైతన్నల కోసం ఎన్నో అభివృద్ధి పథకాలు తీసుకొచ్చారని భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య అన్నారు. బుధవారం వైయస్‌ ‌రాజశేఖర రెడ్డి 71 వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని చర్ల మండలంలో డివిజన్‌ ‌కాంగ్రెస్‌ ‌నాయకులు నల్లపు దుర్గా ప్రసాద్‌ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాజశేఖర్‌ ‌రెడ్డి హయాంలో తాను ములుగు ఎమ్మెల్యే గా పని చేశానని ములుగు నియోజకవర్గ అభివృద్ధి కోసం 12 వేల కోట్ల రూపాయలు వెచ్చించి పనులు చేశారని ఆయన గుర్తు చేశారు. వైఎస్‌ ‌లాంటి ధీరోదాత్త నాయకుడు ప్రజలకు కావాలని, రైతన్నల అభివృద్ధి కోసం పంట గిట్టుబాటు ధర ఆనాడే అమలు చేశారని, ప్రాజెక్టుల రూపకల్పన వైఎస్‌ ‌హయాంలోనే జరిగిందని,రాజశేఖరరెడ్డి జీవించి ఉంటే రాష్ట్రం ఉమ్మడిగానే ఉండేదని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. వృద్ధాప్య పెన్షన్ల పెంపు, ఫీజు రియంబర్స్మెంట్‌ ఒం‌టి సదుపాయాలన్నీ వైఎస్‌ ‌హయాంలోనే వచ్చాయని జ్ఞప్తికి తెచ్చారు. రాజకీయంగా రాజశేఖర్‌ ‌రెడ్డి శిష్యుడు గానే ఉంటూ ఆయన అడుగుజాడల్లోనే నడుస్తానని పొదెం వీరయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి ఇర్పా శాంత, ఎంపీపీ గీద కోదండ రామయ్య, ఎంపీటీసీలు మడకం పద్మజ, తాటి జ్యోతి, కాంగ్రెస్‌ ‌నాయకులు ఎర్రంకి .బాబ్జి, కాంగ్రెస్‌ ‌మండల అధ్యక్షుడు ఆవుల విజయభాస్కర్‌ ‌రెడ్డి, యూత్‌ ‌కాంగ్రెస్‌ ‌నాయకులు కె ఎస్‌ ‌కె విజయ్‌ ‌కుమార్‌ ‌నాయుడు, అలవాల బాలు, తాటి రామకృష్ణ, మణికంఠలు పాల్గొన్నారు.

•భద్రాచలంలో : దివంగతనేత వైఎస్‌ ‌రాజశేఖర్‌రెడ్డి జయంతి సందర్భంగా భద్రాచలం లోని పాత మార్కెట్‌ ‌వద్ద ఉన్న వైఎస్‌ఆర్‌ ‌విగ్రహానికి బుధవారం నాడు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర నాయకుడు ఎడమకంటి రోషిరెడ్డి , వైఎస్సార్సీపీ, గంటా కృష్ణలు మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర్‌రెడ్డి చేసిన సేవలు ప్రజలు ఇప్పటికీ మరువలేనివని అన్నారు.తెలుగుదేశం,టిఆర్‌ఎస్‌ ‌పార్టీలు చెప్పుకోవడానికి కూడా సంక్షేమ పధకాలు లేవని, రాజశేఖ ర్‌రెడ్డిచేసిన సంక్షేమపధకాలు రెండు రాష్ట్రాల ప్రజలు ఇప్పటికీ చెప్పుకుంటున్నారని గుర్తు చేసారు.ఈ కార్యక్రమంలో మాజీ వైఎస్‌ఆర్సీపీ రాష్ట్ర బీసీ కార్యదర్శి రామాచారి, మాజీ యూత్‌ ‌ప్రెసిడెంట్‌ ‌భద్రాచలం కొండా మహేష్‌, ‌నిమ్మల రామకృష్ణ, భవనం కృష్ణారెడ్డి, కోటా సుబ్బారెడ్డి, కౌశిక్‌ ‌రెడ్డి, సాయి కిరణ్‌ ‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మణుగూరులో : స్థానిక మణుగూరు కాంగ్రెస్‌ ‌పార్టీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ ‌రాజశేఖర్‌ ‌రెడ్డి గారి 71వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు రాజశేఖర్‌ ‌రెడ్డి గారి పరిపాలన బడుగు బలహీన వర్గాలు ఒక భరోసాతో జీవించారు పేద ప్రజల కోసం వైయస్‌ ‌రాజశేఖర్‌ ‌రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఈరోజు వరకు ప్రజలలో పేదవాడి గుండెల్లో స్థానం సంపాదిం చుకున్నాడు రాజశేఖర్‌ ‌రెడ్డి గారిని పేద ప్రజలు వారి గుండెల్లో గుడి కట్టుకొని ఇప్పటికీ పూజిస్తున్నారు వారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలలో ముఖ్యంగా ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్‌ ‌లాంటి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఆదర్శమూర్తి కానీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొనియాడారు ఈ కార్యక్రమము కాంగ్రెస్‌ ‌పార్టీ మండల ఇన్‌చార్జి గురజాల గోపి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ముత్యాల కృష్ణ ప్రసాద్‌, ‌సుధాకర్‌ ‌రెడ్డి, ఆనంద్‌ ‌బోగినేని వరలక్ష్మి, బి.ఆదిశేషు, బి ఆర్‌ ‌ప్రసాద్‌, ‌కె .ధర్మయ్య ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.

బూర్గంపాడులో : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక గ్రామంలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌ ‌మాజీ ముఖ్యమంత్రి ప్రజా నాయకుడు పేదల పెన్నిధి పేద ప్రజలకు నేనున్నానని భరోసా ఇచ్చే నాయకుడు దివంగత నేత పేద ప్రజల ప్రియతమ నాయకుడు డాక్టర్‌ ‌వైయస్‌ ‌రాజశేఖర్రెడ్డి 71 వ జయంతిని వైయస్సార్‌ ‌కాంగ్రెస్‌ ‌యూనియన్‌ ‌నాయకులు భూర్గంపహాడ్‌ ‌మండలం సారపాక గ్రామంలో ఉన్న వైఎస్‌ఆర్‌ ‌విగ్రహానికి పూలమాలలు వేసి కేకును కట్‌ ‌చేసి పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమంలో వై ఎస్‌ ఆర్‌ ‌టి సి నాయకులు గాదె రామకోటి రెడ్డి వైయస్సార్‌ ‌జిల్లా పార్టీ నాయకులు కొల్లు వెంకట్‌ ‌రెడ్డి జిల్లా కార్యదర్శి గాదె వెంకటరెడ్డి మండల అధ్యక్షుడు ఎస్‌ ‌కే సైదులు మరియునాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply