Take a fresh look at your lifestyle.

‌ప్రతి గింజను కొనుగోలు చేస్తాం

రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని నర్సంపేట ఏడీఏ శ్రీనివాసరావు అన్నారు. బుధవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మక్కల కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సంపేట నియోజకవర్గంలో అత్యధికంగా 55 వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగుబడి చేశారన్నారు. రైతులు పండించిన మక్కల కొనుగోలుకు డివిజన్‌ ‌పరిధిలో 27 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. రూ 1760 మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. 10,191 మెట్రిక్‌ ‌టన్నుల మక్కలను పౌల్ట్రీలకు నేరుగా ఎమ్మెల్యే సహకారంతో తరలించామన్నారు. నియోజకవర్గంలో 1.50 లక్షల మెట్రిక్‌ ‌టన్నుల మక్కలు నియోజకవర్గ పరిధిలో దిగుబడి వచ్చిందని పేర్కొన్నారు.

ఈ నెల 8లోపు మక్కలను కొనుగోలు కేంద్రాలకు మిగిలిన రైతులు తరలించాలని సూచించారు. నెక్కొండ మండలంలో 338 రైతుల నుండి మూడు లక్షల 45వేల180 బస్తాల మక్కలను కొనుగోలు చేశామన్నారు. వాటిలో 668 బస్తాలను గోదాములకు తరలించాల్సి ఉందని పేర్కొన్నారు. ఆయన వెంట మండల వ్యవసాయ శాఖ అధికారి అధికారి ఆడిదల సంపత్‌ ‌రెడ్డి, మార్కెట్‌ ‌కార్యదర్శి శ్రీధర్‌ ‌రైతులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!