Take a fresh look at your lifestyle.

‌ప్రతీ గింజను కొనుగోలు చేస్తాం: కలెక్టర్‌

ప్రభుత్వ కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన ప్రతి రైతు ధాన్యాన్ని చివరి గింజవరకు కొనుగోలు చేస్తామని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ ‌రైతులకు భరోసా ఇచ్చారు. మంగళవారం ఆమె మండలంలోని సిరిపురం, దుబ్బాక గ్రామాలలోని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను కలెక్టర్‌ ‌సందర్శించారు. రైతులు అదైర్యపడవద్దని ధాన్యం కొనుగోలు వేగవంతం చేస్తామని, కొనుగో లు చేసిన ధాన్యం డబ్బులు ఆలస్యం చేయకుండా రైతు ఖాతాలో జమచేస్తామన్నారు. అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు తమ ధాన్యం పై టార్పాలిన్లను కప్పుకొని భద్రపర్చుకోవాలని కోరారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం నిర్వాహకులు రైతుల పట్ల నిర్లక్ష్యం చేయరాదని, రైతులకు అవసరమైన సౌకర్యాలను కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌డిఓ ఉపేందర్‌ ‌రెడ్డి, తహశీల్దార్‌ ‌డి.శ్రీనివాస కుమార్‌, ఎం‌పిడిఓ జలెందర్‌ ‌రెడ్డి, ఏపి•ఎం అంజయ్య, సర్పంచ్‌ అప్పం లక్ష్మీనర్సు, ఎంపిటిసి సభ్యులు మడూరి జ్యోతిరామచందర్‌ ‌రావు, బడుగు రమేశ్‌ ‌బాబు, ఉప సర్పంచ్‌ ‌దాసిరెడ్డి శ్రవణ్‌ ‌కుమార్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

ఏరియా ఆస్పత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్‌
‌యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని జిల్లా కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ ‌మంగళవారం ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సిబ్బందితో సమీక్షా నిర్వహించి మాట్లాడారు. వైద్యులు విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేయాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. ఆసుపత్రిలోని పలు రికార్డులను పరిశీలించారు. రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని అన్నారు. కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్‌ ఆర్డిఓ సూరజ్‌ ‌కుమార్‌, ఆసుపత్రి సూపరిండేట్‌ ‌డాక్టర్‌ ‌విజయలక్ష్మి, వెంకటేశ్వర్లు, స్థానిక తహసిల్దార్‌ ‌శ్రీనివాస కుమార్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

బ్లడ్‌ ‌బ్యాంకు ఏర్పాటు చేయాలని వినతి
రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిలో బ్లడ్‌ ‌బ్యాంకు ఏర్పాటు చేయాలని స్థానిక సర్పంచ్‌ ‌గోదాసు శిరీషపృథ్వీరాజ్‌ ‌జిల్లా కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ ‌ను కోరారు. మంగళవారం మండల కేంద్రంలోని స్థానిక ఏరియా ఆసుప త్రిని తనిఖీకి వచ్చిన జిల్లా కలెక్టర్‌ ‌ను కోరినట్లు ఆమె తెలిపారు. ఆసుపత్రిలో బ్లడ్‌ ‌బ్యాంకు లేనందువల్ల గర్భిణీ స్త్రీలను ఇతర ఆసుపత్రులకు పంపిస్తు న్నారని దీంతో పేద కుటుంబాలకు చెందిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని తెలిపారు. 24 గంటలు గైనకాలజిస్ట్, అనిస్థీషీయా డాక్టర్లు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. కార్యక్రమంలో ఎంపిటిసి ఎండి రేహాన్‌, ‌పృద్విరాజ్‌ ‌పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply