Take a fresh look at your lifestyle.

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తున్నాం – రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్‌ ‌రెడ్డి

పటాన్‌ ‌చెరు,మే 25 (ప్రజాతంత్ర విలేఖరి):కొరోనా వైరస్‌ ‌నియంత్రణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ను రాష్ట్ర వ్యాప్తంగా కఠినంగా అమలు చేస్తున్నామని రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్‌ ‌రెడ్డి అన్నారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా  పటాన్‌ ‌చెరు సమీపంలోని ముత్తంగి ఓఆర్‌ఆర్‌ ‌వద్ద ఏర్పాటు చేసిన పోలీస్‌ ‌పికెట్‌ ‌ను జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌ ‌రెడ్డి తో కలిసి ఆయన సందర్శించి, లాక్‌డౌన్‌ను పర్యవేక్షించారు. పోలీస్‌ ‌పికెట్‌ ‌వద్ద వాహనదారులకు పోలీసులు నిర్వహిస్తున్న తనిఖీలను పరిశీలించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న లాక్‌డౌన్‌లో భాగంగా పటాన్‌ ‌చెరు పారిశ్రామిక ప్రాంతంలో పర్యవేక్షించడం జరిగిందన్నారు. రాష్ట్రం మొత్తంలో లాక్‌డౌన్‌ ‌కఠినంగా అమలు అవుతుందని తెలిపారు. కొంతమంది చిన్న చిన్న పనుల కొరకు రోడ్లపైకి వస్తుండడంతో కరోనా కట్టడికి ఇబ్బందులు వస్తున్నాయని పేర్కొన్నారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చే వాహనదారులకు జరిమానాలతో పాటు కేసులు నమోదు చేస్తున్నామన్నారు. ఇతర ప్రాంతాలకు వెళ్లే వాహనదారులు తప్పనిసరిగా ఈ పాస్‌ ‌తీసుకోవాలని సూచించారు. అంతర్‌ ‌రాష్ట్ర సరిహద్దుల్లో ప్రత్యేకంగా చెక్‌ ‌పోస్టులు ఏర్పాటు చేసి లాక్‌డౌన్‌ను నిర్వహిస్తున్నామని తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు వైద్య శాఖతో సమన్వయం చేసుకొని కరోనా కట్టడికి పని చేస్తున్నామని అన్నారు. పారిశ్రామిక ప్రాంతాలలో పని చేసే పరిశ్రమ కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. జిల్లా ఎస్పీతో పాటు పటాన్‌ ‌చెరు డీఎస్పీ భీమ్‌ ‌రెడ్డి, సీఐ వేణుగోపాల్‌ ‌రెడ్డి, క్రైమ్‌ ‌సీఐ శ్రీనివాసులు, సిబ్బంది ఉన్నారు.

Leave a Reply