Take a fresh look at your lifestyle.

రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తున్నాం

  • పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలకు దేశ వ్యాప్తంగా గుర్తింపు
  • పలు గ్రామాలకు అవార్డులే ఇందుకు నిదర్శనం
  • ఆజాదీకా అమృత్‌ ‌మహోత్సవాలు జరుపుకుంటున్నా తొలగని చీకట్లు
  • పల్లె, పట్టణ ప్రగతిపై అధికారులతో సిఎం కెసిఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష
  • గ్రామాలకు నేరుగా కేంద్రం నిధులపై అసహనం
  • రాష్ట్రాల సమస్యలు కేంద్రానికి ఎలా తెలుస్తాయని వ్యాఖ్య

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 18 : ధ్వంసమైన తెలంగాణను పునర్‌ ‌నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌స్పష్టం చేశారు. ఎన్నో కష్టాలు అధిగమించి దేశం గర్వించేలా తెలంగాణను అభివృద్ధి చేస్తున్నామంటూ..దీనిని తిరిగి బాగు చేసుకోవడానికి చాలా కష్టపడాల్సి వొస్తుందన్నారు. పల్లె, పట్టణ ప్రగతికి దేశ వ్యాప్తంగా గుర్తింపు లభించిందని కేసీఆర్‌ ‌పేర్కొన్నారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలపై మంత్రులు, మేయర్లు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ ‌కుమార్‌, ‌సంబంధిత శాఖల కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు, స్థానిక సంస్థల అడిషనల్‌ ‌కలెక్టర్లతో ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ ‌సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు సీఎం కేసీఆర్‌ ‌కార్యక్రమాల అమలుపై దిశానిర్దేశం చేసారు. మనం చేస్తున్న పనిని ఇతరులు గుర్తించడమే ప్రగతికి కొలమానమని అన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలకు దేశవ్యాప్తంగా విశేషమైన గుర్తింపు, ఆదరణ లభించడం పట్ల సీఎం కేసీఆర్‌ ‌హర్షం వ్యక్తం చేశారు. రెండు పర్యాయాలుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉత్తమ గ్రామాల్లో మొదటి దశలో పదికి పది గ్రామాలు, రెండవ దశలో 20కి 19 గ్రామాలు తెలంగాణ నుంచే ఎంపిక కావడం గొప్ప విషయమని అన్నారు. ఈ దిశగా కృషి చేసిన పంచాయతీరాజ్‌ ‌శాఖను, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ ‌రావును సీఎం కేసీఆర్‌ అభినందించారు. ప్రజల సంక్షేమం దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న కార్యాచరణలో అధికారులు శ్రద్దాసక్తులతో, చిత్తశుద్ధితో పాల్గొన్నప్పుడే ఫలితాలు సాధ్యమవుతాయని కేసీఆర్‌ ‌పేర్కొన్నారు. రాష్ట్రంలో నూతన పంచాయతీ రాజ్‌ ‌చట్టం తెచ్చినప్పుడు పలువురు పలు అనుమానాలను వ్యక్తం చేశారు. కానీ నేడు వారి అనుమానాలను పటాపంచలు చేసి తెలంగాణ పల్లెలను అభివృద్ధి పథాన నడిపించుకుంటున్నామన్నారు.

- Advertisement -

ప్రతి గ్రామానికి మౌలిక వసతులను ఏర్పాటు చేసుకొని ప్రగతి సాధిస్తున్నాం. ప్రతీ పల్లెలో ఇవ్వాల ఒక ట్రాక్టర్‌ను ఏర్పాటు చేసుకొని అభివృద్ధి చేసుకున్నాం. ప్రభుత్వం చేపట్టిన చర్యలు నేడు గ్రామాల్లో స్ఫూర్తిని నింపాయని సీఎం తెలిపారు. తాను గతంలో చెప్పినట్టు ఎస్‌కే డే ప్రారంభించిన పంచాయతీ రాజ్‌ ‌వ్యవస్థ ఒక ఉద్యమం. కానీ నేడు అందులో రాజకీయాలు ప్రవేశించి అవి అన్ని రకాలుగా పంచాయతీ రాజ్‌ ‌స్ఫూర్తి చంపివేయబడ్డదని కేసీఆర్‌ అన్నారు. దేశంలో ప్రారంభమైన సహకార ఉద్యమం కూడా కలుషితం చేయబడ్డది. ఇటువంటి అరాచకమైన, నిర్లక్ష్యమైన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. తెలంగాణ ప్రభుత్వం ప్రారంభ దశలో తీసుకున్న నిర్ణయాలు, ఎంచుకున్న ప్రాధాన్యతా క్రమాలు కొందరికి జోక్‌ ‌లాగా కనిపించాయి. తెలంగాణ వొచ్చిన ప్రారంభంలో తాను అటవీ శాఖ, అడవుల పరిరక్షణ మీద సమీక్ష సమావేశం నిర్వహిస్తే ఈ అడవులేంది అని కొందరు నవ్వుకున్నారు. కానీ నేడు దేశ పర్యావరణం, పచ్చదనంలో భాగస్వామ్యం పంచుకోవడంలో తెలంగాణ అగ్రభాగాన నిలిచింది. తెలంగాణ వొచ్చేనాటికి అస్తవ్యస్తంగా, యుద్ధవాతావరణంతో కూడుకొని ఉన్న గ్రావి•ణ మంచినీటి వ్యవస్థను ఇవాళ దేశం గర్వించేలా మిషన్‌ ‌భగీరథ ద్వారా తీర్చిదిద్దుకున్నాం. ఇంటింటికి స్వచ్ఛమైన త్రాగునీటిని అందిస్తున్న పరిస్థితి దేశంలోని మరే రాష్ట్రంలోనూ లేదని కేసీఆర్‌ ‌స్పష్టం చేశారు. అన్ని రంగాల్లో జరిగిన తెలంగాణ అభివృద్ధిని ఇటీవల కొన్ని జాతీయ వి•డియా చానెల్స్ ‌ప్రసారం చేశాయని కేసీఆర్‌ ‌గుర్తు చేశారు. ఇది చూసిన ఇతర రాష్ట్రాల వారికి ఆశ్చర్యం కలిగింది. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి గురించి తనకు ఫోన్లు చేసి అడుగుతన్నారని సిఎం తెలిపారు. అంటే మనం అనతికాలంలో అనితర సాధ్యమైన అభివృద్ధిని సాధించాం.

ఇందులో భాగస్వాములైన ప్రజా ప్రతినిధులను, ప్రభుత్వ యంత్రాంగాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని సీఎం పేర్కొన్నారు. ఇదిలావుంటే కేంద్రంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌మరోసారి మండిపడ్డారు. కేంద్రమే నేరుగా పల్లెలకు నిధులు పంపడం చాలా చిల్లర వ్యవహారమని నిప్పులు చెరిగారు. రాష్ట్రాలద్వారా కాకుండా కేంద్రమే నేరుగా ఢిల్లీ నుంచి అమలు చేయాలనుకోవడం సమర్థనీయం కాదని సీఎం అన్నారు. మీక్ష సందర్భంగా ఈ విషయాన్ని మంత్రులు, అధికారుల దృష్టికి సీఎం తీసుకొచ్చారు. పంచాయతీ రాజ్‌ ‌వ్యవస్థలో మూడంచెల విధానం వొచ్చిన తర్వాత నాటి రాజీవ్‌ ‌గాంధీ నుంచి నేటి వరకు ప్రధాని పదవిలో ఉన్నవారి వరకు రాష్ట్రాలను నమ్మకుండా, కేంద్రమే నేరుగా ప్లలెలకు నిధులు పంపడం చాలా చిల్లర వ్యవహారంగా ఉన్నదని సీఎం మండిపడ్డారు. జవహర్‌ ‌రోజ్‌ ‌గార్‌ ‌యోజన, ప్రధాని గ్రామ సడక్‌ ‌యోజన, నరేగా వంటి పథకాలను రాష్ట్రాల ద్వారా కాకుండా కేంద్రమే నేరుగా ఢిల్లీ నుంచి అమలు చేయాలనుకోవడం సమర్థనీయం కాదన్నారు. రాష్ట్రాల్లో నెలకొన్న స్థానిక పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వాలకే తెలుస్తాయని కేసీఆర్‌ ‌తెలిపారు. రోజువారి కూలీల డబ్బులు కూడా నేరుగా ఢిల్లీ నుంచి కేంద్రమే పంచాలనుకోవడం సరైన విధానం కాదు. 75 సంవత్సరాల అమృత మహోత్సవాల నేపథ్యంలో దేశంలో ఇంకా కరెంటు లేక పల్లెలు, పట్టణాలు చీకట్లలో మగ్గుతున్నాయి. త్రాగునీరు, సాగునీరు లేక ప్రజలు రోడ్ల వి•దకు ఎక్కుతున్నారు. విద్య, వైద్యం అనేక రంగాలల్లో రావాల్సినంత ప్రగతి రాలేదు. కేంద్ర ప్రభుత్వం ఇటువంటి అంశాల వి•ద దృష్టి పెట్టకుండా, రాష్ట్రాల విధులలో జోక్యం చేసుకోవాలనుకోవడం సమర్థనీయం కాదని సీఎం అన్నారు.

Leave a Reply