Take a fresh look at your lifestyle.

ఎన్ని కొరోనా కేసులు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం

  • 20న గచ్చిబౌలి ఆసుపత్రిని ప్రారంభిస్తాం
  • రాష్ట్రంలో మరో 50 పాజిటివ్‌ ‌కేసులు నమోదయ్యాయి
  • పది లక్షలకు తగ్గకుండా పీపీఈ కిట్లు, వైద్య పరికరాలు
  • గాంధీ ఆసుపత్రిలో చిన్నపిల్లలకు ప్రత్యేక వార్డు
  • హైదరాబాద్‌లో రెండు కొత్త ల్యాబ్‌లకు అనుమతి
  • వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల

తెలంగాణలో కొరోనా వ్యాప్తి నేపథ్యంలో చికిత్సల కోసం ఈనెల 20న గచ్చిబౌలిలో 1500 పడకల ఆసుపత్రిని ప్రారంభించనున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ‌తెలిపారు. రాష్ట్రంలో గురువారం మరో 50 పాజిటివ్‌ ‌కేసులు నమోదయ్యాయనీ, దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 700కు చేరిందని వెల్లడించారు. గురువారం 68 మంది కోలుకుని డిశ్చార్జి కాగా, ఎవరూ మరణించలేదని చెప్పారు. రాష్ట్రంలో పది లక్షలకు తగ్గకుండా పీపీఈ కిట్లు, ఎన్‌ 95 ‌మాస్కులు, వైద్య పరికరాలను సమకూర్చుకుని భద్రపరిచే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. గురువారం ఆయన కోఠిలోని కంట్రోల్‌ ‌కమాండ్‌ ‌సెంటర్‌లో నిర్వహించిన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ అందరి ఆరోగ్యం బాగానే ఉందన్నారు. చిన్న పిల్లల కోసం గాంధీ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డును సిద్ధం చేశామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న క్వారంటైన్‌ ‌సెంటర్లు, కోవిడ్‌ ఆసుపత్రులలో పనిచేస్తున్న వైద్యులు, వైద్య, రక్షణ సిబ్బందికి పీపీఈ కిట్లు, ఎన్‌ 95 ‌మాస్కులను త్వరలోనే అందజేసే విధంగా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. వీటికి సంబంధించి రాస్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆయా సంస్థలకు ఆర్డర్లను ఇవ్వడం జరిగిందన్నారు. తాజాగా హైదరాబాద్‌లో మరో రెండు కొవిడ్‌ ‌వైరస్‌ ‌నిర్ధారణ పరీక్షలు జరిపే ల్యాబ్‌లకు కూడా కేంద్రం నుంచి అనుమతి లభిచిందన్నారు. రాష్ట్రంలోని అన్ని ల్యాబ్‌ల్లో నిరంతరాయంగా పరీక్షలు జరుగుతున్నాయి. ఎన్ని కేసులు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కార్మిక శాఖ ఆధ్వర్యంలోని సనత్‌నగర్‌ ఆసుపత్రి ఆసుపత్రి, పోనెన్సిక్‌ ఆసుపత్రిలో ఈనెల 18 నుంచి ట్రయల్‌ ‌పరీక్షలు నిర్వహించి త్వరలోనే అందుబాటులోకి తీసుకు రానున్నట్లు వెల్లడించారు.

ఆటోమెటిక్‌ ‌మేషీన్లతో కూడిన ల్యాబ్‌ను మరో మూడు వారాల్లో హైదరాబాద్‌లో అందుబాటులోకి తీసుకు రానున్నామనీ, దీని ద్వారా నిత్యం 5 వేల మందికి పరీక్షలు జరిపే అవకాశం లభిస్తుందన్నారు. వేగంగా పరీక్షలు నిర్వహించేందుకు అన్ని ల్యాబ్‌ల సామర్థ్యం రెట్టింపు చేసేందుకు చర్యలు తీసుకుంటూనే ల్యాచ్‌లలో సిబ్బందిని కూడా పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు వివరించారు. దేశంలో ఏ రాష్ట్రం స్పందించకపోయినా లాక్‌డౌన్‌పై మొదట ప్రకటన చేసింది తెలంగాణ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. పేదలను ఆదుకోవాలన్నదే సీఎం కేసీఆర్‌ ‌లక్ష్యమనీ, ఈ పరిస్థితిలో కూడా ప్రతిపక్షాలు విమర్శలు చేయడం సరైంది కాదని వ్యాఖ్యానించారు. లాక్‌డౌన్‌ ‌సదలింపుపై క్యాబినెట్‌ ‌భేటీ తరువాత స్పష్టత వస్తుందన్నారు. ప్రజలు తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలనీ, బ్యాంకుల దగ్గర గుంపులు గుంపులుగా ప్రజలు ఉంటున్నారనీ, అకౌంట్‌లో పడిన డబ్బు ఎక్కడికీ పోదనీ, ప్రజలు సంయమనం పాటించాలని సూచించారు. ఆస్తి ఎక్కడికీ పోదు ప్రాణం పోతే మళ్లీ రాదని వ్యాఖ్యానించారు. మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారు, వారి కుటుంబ సభ్యులు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ఇండోనేషియా నుంచి ఓ మతానికి చెందిన ప్రబోధకులు కరీంనగర్‌కు రావడం, వారు రాష్ట్రమంతా తిరగడంతో సమస్య తీవ్రత ఎక్కువైందన్నారు. వెంటనే స్థానిక అధికార, పోలీసు యంత్రాంగం తీసుకున్న కఠిన చర్యలతో అక్కడ పరిస్థితి నియంత్రణలోని• •వచ్చిందని తెలిపారు. తెలిపారు. తె వచ్చిందన్నారు. జీహెచ్‌ఎం‌సి పరిధిలో రోజురోజుకూ ఎక్కువవుతున్న పాజిటివ్‌ ‌కేసులపై స్పందిస్తూ ఇక్కడ కూడా అంతే కఠిన చర్యలు చేపడితే ఇప్పటికైనా కేసుల సంఖ్య తగ్గుతుందని మంత్రి ఈటల వ్యాఖ్యానించారు.

Leave a Reply