Take a fresh look at your lifestyle.

మేమూ రెడీ..!

తేదీ..స్థలం నిర్ణయించాలని రైతు సంఘాలు ప్రకటన
‌కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) కొనసాగుతుందని రైతులకు భరోసా ఇచ్చి నెలరోజుల ప్రతిష్ఠంభనను అంతం చేయడానికి నిరసన వ్యక్తం చేస్తున్న రైతులను తదుపరి రౌండ్‌ ‌చర్చలకు ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానించారు. దాంతో ఆందోళన చేస్తున్న కిసాన్‌ ‌నాయకులు చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని తేల్చిచెప్పారు. తదుపరి చర్చకు తేదీని ఎన్నుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తిచేశారు. కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలపై ఆందోలన చేస్తున్న రైతులు, కేంద్ర ప్రభుత్వం మధ్య ఇప్పటివరకు 11 రౌండ్ల చర్చలు జరిగాయి.

కనీస మద్దతు ధర కొనసాగుతుందని ప్రధాని మోదీ భరోసా ఇచ్చారు. దీనిపై పలు రైతు సంఘాలు హర్షం వ్యక్తం చేయడమే కాకుండా ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమంటూ సంకేతాలిచ్చారు. తదుపరి రౌండ్‌ ‌చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని, సమావేశం జరిగే తేదీ, సమయాన్ని ప్రభుత్వం తెలియజేయాలని సంయుక్త కిసాన్‌ ‌మోర్చా సభ్యుడు, రైతు నాయకుడు శివ కుమార్‌ ‌కక్కా కోరారు. ’మేం ప్రభుత్వంతో చర్చలు జరపడానికి ఎప్పుడూ నిరాకరించలేదు. మమ్మల్ని సంభాషణల కోసం పిలిచినప్పుడల్లా కేంద్ర మంత్రులతో చర్చలు జరిపాం.

ప్రభుత్వంతో చర్చలకు సిద్ధంగా ఉన్నాం’ అని కక్కా చెప్పారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు ప్రధాని మోదీ రాజ్యసభలో సమాధానమిస్తూ.. కనీస మద్దతు ధర ఉన్నది.. ఇకముందు కూడా ఉంటుంది అని స్పష్టంచేశారు. రైతులతో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని, ఇదే విషయాన్ని గతంలోనూ స్పష్టం చేశామని చెప్పారు. భారతదేశానికి శత్రువులుగా ఉన్న విదేశీ సంస్థల పట్ల జాగ్రత్త వహించాలని ఆయన నిరసనకారులను కోరారు. ప్రధాని చేసిన సూచనకు సానుకూలంగా స్పందించిన రైతు సంఘాలు..ప్రభుత్వం చర్చలకు తేదీని నిర్ణయిస్తే ఆ రోజు రావడానికి సిద్ధమని ప్రకటించాయి.

Leave a Reply