ఉద్యోగులకు ఎల్టీసీ క్యాష్ వోచర్, పండుగ ప్రత్యేక అడ్వాన్స్ ప్రకటించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
కొరోనా వైరస్‌తో కుదేలైన ఆర్థిక వ్యవస్థలో ఉత్తేజం నింపేందుకు, డిమాండ్‌ను పెంచేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం పలు చర్యలు ప్రకటించారు. వినిమయాన్ని పెంచేందుకు ప్రభుత్వ ఉద్యోగులకు ఎల్టీసీ క్యాష్ వోచర్, పండుగ ప్రత్యేక అడ్వాన్స్ పథకాలను ప్రవేశపెడుతున్నామని చెప్పారు.
ఎల్టీసీ నగదును 12 శాతం ఆపై జీఎస్టీ విధించే వస్తువులపై ఖర్చు పెట్టాలని, డిజిటల్ మాధ్యమం ద్వారా వీటిని వెచ్చించాలని ఆమె స్పష్టం చేశారు. జీఎస్టీ ఇన్వాయిస్ను సమర్పించాల్సి ఉంటుందని చెప్పారు. కొరోనా వైరస్‌తో ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నదని, పేదలు, చిన్న పరిశ్రమలను ఆదుకునేందుకు ఆత్మనిర్భర్ ప్యాకేజ్ ప్రకటించగా తాజాగా వ్యవస్థలో డిమాండ్‌కు ఊతమిచ్చే చర్యలను ప్రకటించామని చెప్పారు.