Take a fresh look at your lifestyle.

కేసీఆర్‌ ‌చెబుతున్న నూతన వ్యవసాయ పాలసీని .. వ్యతిరేకిస్తున్నాం

  • ప్రభుత్వం చెప్పిన పంట వేయాలనడం తుగ్లక్‌ ‌చర్య : పిసిసి చీఫ్‌ ఉత్తమ్‌
  • ఎట్టి పరిస్థితుల్లో రాజీవ్‌ ‌విగ్రహానికి నివాళులర్పిస్తాం …: విహెచ్‌
  • ‌పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచితే దక్షిణ తెలంగాణ ఎడారి అవుతుంది :  రేవంత్‌రెడ్డి

సీఎం కేసీఆర్‌ ‌చెబుతున్న నూతన వ్యవసాయ పాలసీ ని కాంగ్రెస్‌ ‌పార్టీ వ్యతిరేకిస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి తెలిపారు .ఇప్పుడు ప్రభుత్వం చెప్పిన పంట వేయలనడం తుగ్లక్‌ ‌చర్యని విమర్శించారు. బుధవారం గాంధీభవన్‌ ‌లో ప్రభుత్వ వ్యవసాయ విధానంలో లోపాలు, సూచనలపై నేతలు చర్చించారు.ఈ సమావేశం లో టీపీసీసీ అధ్యక్షుడు  ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి ,ఎమ్యెల్యే జగ్గారెడ్డి,  కిసాన్‌ ‌కాంగ్రెస్‌ ‌జాతీయ ఉపాధ్యక్షులు కోదండ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు చిన్నారెడ్డి, వంశీ చందర్‌ ‌రెడ్డి, మర్రి శశిధర్‌ ‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఈ సమావేశం అనంతరం ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి మీడియా తో మాట్లాడుతూ ….కేసీఆర్‌ ‌సమగ్ర వ్యవసాయ విధానం లోప భూయిష్టంగా ఉందని దీని పై సమగ్రంగా సంప్రదింపులు జరపలేదని తెలిపారు.ఈ ఖరీఫ్‌ ‌లో దాన్ని అమలు చేయొద్దని కోరారు.నాలుగైదు రోజుల్లో విత్తనాలు వేయడానికి రైతులు సిద్ధమయ్యారని రైతులు, శాస్త్రవేత్తలు, ప్రతిపక్షాలతో చర్చిన తర్వాత వచ్చే ఏడు నుంచి కొత్త పాలసీ రూపొందించాలని డిమాండ్‌ ‌చేశారు.సర్కార్‌ ‌చెప్పిన పంట వేయకపోతే రైతుబందు ఇవ్వమనడం రైతులను అవమానించడమే అవుతుందన్నారు.రైతు వ్యతిరేక నిర్ణయాలుంతీసుకుంటే కాంగ్రెస్‌ ‌పార్టీ పోరాడుతుందన్నారు.దరిద్రపు టిఆర్‌ఎస్‌ ‌పాలనలో రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ రెండో స్థానం లో ఉందన్నారు. లక్ష రూపాయల రైతు రుణమాఫీ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.ధాన్యం కొనుగోలులో విఫలమైన కేసీఆర్‌ ‌రైతులకు క్షమాపణ చెప్పాలన్నారు.పత్తి విత్తనాలు, కొనుగోలు, ధర ఏదీ మీ చేతిలో లేదని మీరు పత్తి వేయాలని ఎందుకు చెబుతున్నారో చెప్పాలన్నారు .క్వింటాలుకు 7 వేలు మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వమే పత్తి కొంటామని హామీ ఇవ్వాలని అప్పుడే పత్తి వేయాలని సూచనలు చేయాలని సూచించారు .

వైఎస్‌ ‌కు మాటలు ,చంద్రబాబు చెప్పులు మోసింది కేసీఆరే…రేవంత్‌ ‌రెడ్డి
ప్రజాతంత్ర ,హైదరాబాద్: ‌శ్రీశైలం, నాగార్జున సాగర్‌, ‌పులిచింతల విద్యుత్‌ ‌ప్రాజెక్టులను చంపేసే కుట్ర చేస్తున్నారని కమిషన్లకు కక్కుర్తిపడి కొత్త విద్యుత్‌ ‌ప్రాజెక్టుల కోసం ప్లాన్‌ ‌చేస్తున్నారని అందుకే కేసీఆర్‌ ‌నీటి తరలింపుకు అంగీకరిస్తున్నారని ఎంపీ రేవంత్‌ ‌రెడ్డి ఆరోపించారు.విద్యుత్‌ ‌వినియోగం ప్రకారం ప్రాజెక్టుల విభజన చేయాలని దివంగత నేత కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌ ‌రెడ్డి ఆనాడు సూచించారని అప్పుడే  54 శాతం విద్యుత్‌ ‌వినియోగం తెలంగాణలో ఉండేదని ఎంపీ రేవంత్‌ ‌రెడ్డి తెలిపారు.దాని ప్రకారమే ప్రాజెక్టుల్లో తెలంగాణకు వాటా ఇచ్చారని ముచ్చుమర్రి, పోతిరెడ్డిపాడు వద్ద బొక్కపెట్టి జగన్‌ ‌నీళ్లు తీసుకువెళతా అంటున్నాడని అన్నారు.బుధవారం గాంధీభవన్‌ ‌లో రేవంత్‌ ‌రెడీ ప్రెస్‌ ‌మీట్‌ ‌నిర్వహించారు .ఈ  మేరకు ఆయన మాట్లాడుతూ …ఈ కుట్ర  వెనక ప్రైవేట్‌ ‌విద్యుత్‌ ఉత్పత్తి సంస్థల లాబీయింగ్‌ ఉం‌ది.

పోతిరెడ్డిపాడు సామర్ధ్యాన్ని పెంచితే దక్షిణ తెలంగాణ ఎడారి అవుతుందని కేర్‌ఎం‌బి కి ఫిర్యాదు చేశామని , 299టీఎంసీల ను కేర్‌ఎం‌బి తెలంగాణకు కేటాయించిందని , ఏపీకి కేటాయించిన నీటినే తరలిస్తామని జగన్‌ ‌జెబుతున్నాడు జగన్‌ ‌మాటలను కేసీఆర్‌ ‌సమర్దిస్తున్నాడని దీని వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని విమర్శించారు.శ్రీశైలం లో విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోతే తెలంగాణ చీకటి అవుతుందని అన్నారు..రోజా పెట్టిన రాగి సంకిటి తిని కేసీఆర్‌ ‌బలిసి మాట్లాడుతున్నాడని నీళ్లు జగన్‌ ‌కు,  నిధులు ఆంధ్ర కాంట్రాక్టర్లకు, నియామకాలు కేసీఆర్‌ ‌కుటుంబంలో చేసుకున్నాడని మండిపడ్డరు.పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచితే విద్యుత్‌ ‌ప్రాజెక్టులు సచ్చిపోతాయని ఇది అపర మేధావి కేసీఆర్‌, ‌బాల మేధావి కేటీఆర్‌ ‌కు తట్టడం లేదా?  అని ప్రశ్నించారు.దీని పై విద్యుత్‌ ‌రంగ నిపుణులు బయటకు వచ్చి మాట్లాడాలని కోరారు.జూన్‌ 2‌న ప్రాజెక్టుల వద్ద నిరసనలు తెలుపుతామని తెలిపారు.చంద్రబాబు చెప్పులు మోసింది , వైఎస్‌ ‌కు మూటలు మోసింది కూడా కేసీఆరే అని విమర్శించారు.అన్ని పార్టీలతో పొత్తుపెట్టుకున్నదే కేసీఆర్‌ అని అన్నారు.మాగం రంగారెడ్డి ఎమ్మెల్సీ కోసం ఎమ్మెల్యేలను అమ్ముకున్న చరిత్ర కేసీఆర్‌ ‌దని ఆరోపించారు.

రాజీవ్‌ ‌గాంధీ వర్ధంతి పై ఆంక్షల …..

ఎట్టి పరిస్థితుల్లో రాజీవ్‌ ‌విగ్రహానికి నివలర్పిస్తాం …విహెచ్‌
‌ప్రజాతంత్ర ,హైదరాబాద్‌ : ‌సినీస్టార్టస్ ‌మెగా బ్రదర్స్ ‌ముగ్గురువి మూడు దారులని మాజీ ఎంపీ విహెచ్‌ ‌విమర్శించారు .నటుడు నాగబాబు గాడ్సే దేశభక్తుడని చేసిన ట్విట్టర్‌ ‌పై విహెచ్‌ ‌స్పందించారు.బుధవారం గాంధీభవన్‌ ‌లో ఆయన మీడియా తో మాట్లాడుతూ …నాగబాబు మంచి నటుడని సడన్‌ ‌గా నాధురం గాడ్సే ఎలా మంచి వా డు అయ్యారని మండిపడ్డారు .అన్నయ్య చిరంజీవి శంకర్‌ ‌దాదా జిందాబాద్‌ ‌లో గాంధీ మార్గం లో నడుస్తూ సినిమా తీస్తారని ,తమ్ముడు విప్లవ మార్గం పై సినిమా తీసారని..కానీ నాగబాబు ఇప్పుడు వేరే పార్టీ గాలి తగిలక  గాడ్సే దేశ భక్తుడు అంటున్నారని నాగబాబు వ్యాక్యాలు బాధించాయని అన్నారు. కారోనో పేరుతో  రాజీవ్‌ ‌గాంధీ నీ కనుమరుగు చేసే ప్రయత్నం చేస్తున్నారని లాక్‌ ‌డౌన్‌ అయిపోయింది ప్రజలు ఇస్టానుసారం తిరుగుతున్నారని కానీ  రాజీవ్‌ ‌వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించేందుకు అనుమతి లేదు అంటూ ఇంటికి నోటీసు అంటించారని మండిపడ్డారు.సిటీ పోలీస్‌ ‌కమిషనర్‌ ఇది కేంద్ర ప్రభుత్వ ఆదేశం అంటున్నారని ఇది దుర్మార్గపు చర్యని ఆగ్రహం వ్యక్తం చేశారు.మేము నలుగురు వెళ్ళి పదిహేను నిమిషాలు మాత్రమే నివాళులు అర్పిస్తమని పీజికల్‌ ‌డిస్టెన్స్ ‌పాటించే కార్యక్రమం చేస్తామని అన్నారు.ఎట్టి పరిస్థితుల్లో రాజీవ్‌ ‌విగ్రహానికి నివలర్పిస్తామన్నారు.ఎంత మం దిని అరెస్ట్ ‌చేసిన భయపడేది లేదని హెచ్చరించారు.

Leave a Reply