Take a fresh look at your lifestyle.

సంసిద్ధంగా లేమన్నది స్పష్టంగా కనిపిస్తోంది

“కోవిడ్‌19 ‌గురించి ముందుగా వచ్చిన హెచ్చరికలను పట్టించుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు, అలా అనడం దేశభక్తికి వ్యతిరేకంగా కాదు. కోవిడ్‌ -19 ‌గురించిన హెచ్చరికలు గత డిసెంబర్‌లోనే వచ్చాయి. మన స్పందన చాలా విలక్షణంగా ఉంది. ఒకరినొకరు  కరచాలనాలు చేసుకోకుండా నమస్తే అని అంటే సరిపోతుందని భావించాం. మన దేశంలో ఆరోగ్య శాఖ చేసిన హెచ్చరికలను పట్టించుకోలేదు. లాక్‌ ‌డౌన్‌ ‌కు మానసికంగా ప్రజలను సిద్ధం చేసేందుకు మనం ప్రయత్నించలేదు”

కోవిడ్‌ -19 ‌కేసుల సంఖ్య రోజుకు నానాటికీ పెరుగుతోంది. దేశమంతటా ఇదే పరిస్థితి. మనం ఈ వైరస్‌ ‌వ్యాప్తి పట్ల నిర్లిప్తంగా  ఉండటమే కాకుండా, అది మన జోలికి రాదనే ధీమాతో ఉన్నాం.  కరోనా వ్యాప్తి నిరోధానికి లాక్‌ ‌డౌన్‌ ‌మంచి పరిష్కారం. అతివిశ్వాసంతో  మనం ఈ వైరస్‌ ‌వ్యాప్తి వల్ల వచ్చే ప్రమాదాన్ని గుర్తించలేకపోయాం, అంతేకాక, లాక్‌ ‌డౌన్‌ ‌వల్ల వ్యతిరేక పరిణామాలను ఎదుర్కోవడానికి మన దేశం సిద్ధంగా లేకపోవడానికి కూడా అదే కారణం. ముఖ్యంగా లాక్‌ ‌డౌన్‌ ‌వల్ల వలస కార్మికులు వెల్లువల వచ్చి పడుతున్నారు. వారికి పనులు లేకపోవడం వల్ల స్వస్థలాలకు వెళ్ళేందుకు క్యూ కడుతున్నారు. లాక్‌ ‌డౌన్‌ను అమలు జేస్తున్న తీరు విమర్శలకు గురి అవుతోంది. దీని వల్ల ఉత్పన్న మవుతున్నదుష్పరిణామాలు కోవిడ్‌ను ఎదుర్కోవడానికి   మనం  సిద్ధంగా లేమన్న వాస్తవాన్ని బహిర్గతం చేస్తున్నాయి. 21 రోజుల పాటు లాక్‌ ‌డౌన్‌ ‌కోవిడ్‌ను ఎదుర్కోవడానికి ముఖ్యమైన మార్గమన్న వాస్తవాన్ని ఎవరూ కాదనకపోవచ్చు. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో దానిని అమలు జరపడం ఎంత కష్టమో వేరే చెప్పనవసరం లేదు. ఇప్పటికే జనం ఇళ్ళల్లో ఉండలేక, బయటకు రాలేక అల్లాడుతున్నారు.
కోవిడ్‌19 ‌గురించి ముందుగా వచ్చిన హెచ్చరికలను పట్టించుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు, అలా అనడం దేశభక్తికి వ్యతిరేకంగా కాదు. కోవిడ్‌ -19 ‌గురించిన హెచ్చరికలు గత డిసెంబర్‌లోనే వచ్చాయి. మన స్పందన చాలా విలక్షణంగా ఉంది. ఒకరినొకరు  కరచాలనాలు చేసుకోకుండా నమస్తే అని అంటే సరిపోతుందని భావించాం. మన దేశంలో ఆరోగ్య శాఖ చేసిన హెచ్చరికలను పట్టించుకోలేదు. లాక్‌ ‌డౌన్‌ ‌కు మానసికంగా ప్రజలను సిద్ధం చేసేందుకు మనం ప్రయత్నించలేదు.  దీనికి కూడా అతివిశ్వాసమే కారణం. ఇది ఒక పెద్ద సవాల్‌ అవుతుందని మనం  అనుకోలేదు.

- Advertisement -

ఇప్పటి పరిస్థితి ఏమంటే మొత్తం జనాభాలో 35, 000 మందిని మాత్రమే పరీక్షలు జరపగల ఆరోగ్య వ్యవస్థ మనది. అందుకే కొరోనా సోకిన వారి వాస్తవ గణాంకాలను ఇవ్వలేకపోతున్నాం. ఇదెలా ఉందంటే,  మొత్తం 10 వేల మందిలో 500 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి పర్సంటేజ్‌లు ప్రకటించడంలా ఉంది. ఈ నాటికి కూడా ప్రభుత్వం వాస్తవంగా ఎంత మందికి ఈ వైరస్‌ ‌సోకిందో నిక్కచ్చిగా తేల్చలేకపోతున్నది.   పరీక్షలు జరిపిన వాటిలో చాలా మటుకు పొజిటివ్‌ అని ప్రకటిస్తోంది. వైరస్‌ ‌సోకినవారు ఎక్కడున్నారు. వారికి ఏమైంది. వారికి ఎలాంటి వైద్య సౌకర్యాలు అందుతున్నాయి. మొదలైన వివరాలు లేకపోతే గణాంకాల జాబితాల్లో కంతలు నిపిస్తాయి. అంటే సమస్య తీవ్రతకు మనం సరిగ్గా స్పందించడం లేదన్న మాట. లాక్‌ ‌డౌన్‌ అమలు ఎంత దారుణంగా ఉందో మీడియా వస్తున్న వార్తలే నిదర్శనం. లాక్‌ ‌డౌన్‌ ‌ప్రకటించడానికి ముందు ఎంత కసరత్తు జరగాలి. అదేమీ జరగలేదు. విదేశాల నుంచి వచ్చిన వారి వల్లే ఈ వైరస్‌ ‌సోకుతోందని తేల్చారు. అది అసత్యం కాకపోవచ్చు. కానీ, విదేశాల నుంచి వచ్చిన వారిని విమానాశ్రయాల్లోనే పరీక్షలు నిర్వహించి క్వారంటైన్‌ ‌జరిపించి ఉంటే పరిస్థితి ఇంత దారుణంగా ఉండేది కాదు. విదేశాల నుంచి వచ్చిన వారే ఈ వైరస్‌ను మోసుకొచ్చారు  ఆ సంగతి వారికి తెలియకపోవచ్చు. వారిని  గురించి పట్టించుకున్నవారులేరు. ఏయే నగరాలు, పట్టణాలకు విదేశాల నుంచి ఎక్కు వ మంది వచ్చారు. ఎవరికి  కొరోనా సోకింది. ప్రస్తుత పరిస్థుల నుంచి భారత్‌ ‌నేర్చుకోనున్నదేమిటి ఇవి వితండ ప్రశ్నలు కావు. మనం ఈ వైరస్‌ ‌వ్యాప్తి గురించి సరిగ్గా అంచనా వేయలేకపోయాం. అతి ధీమాని ప్రదర్శించాం.
ఇతరదేశాల మాదిరిగా భారత్‌ ‌కూడా దేశమంతటా లాక్‌ ‌డౌన్‌ ‌ప్రకటించకుండా ఎక్కడైతే ఈ వైరస్‌ ఎక్కువగా ఉందో అక్కడే అటువంటి కఠిన చర్యలను తీసుకుని ఉండాల్సింది. ఒక వేళ దేశమంతటా లాక్‌ ‌డౌన్‌ ‌ప్రకటించాలనుకున్నప్పుడు దానికి ముందుగా కసరత్తు చేసి ఉండాల్సింది.

ప్రజలు ఇబ్బందులకు గురి కాకుండా నిత్యావసరాలు నిరాటంకంగా సరఫరా అయ్యేట్టు తగిన ఏర్పాట్లు చేసి ఉండాల్సింది. ఇప్పుడు అమలు జేస్తున్న లాక్‌ ‌డౌన్‌ ‌వల్ల వైరస్‌ అదుపులోకి వచ్చి తిరిగి మామూలు పరిస్థితులు ఏర్పడినప్పుడు ఇప్పుడు ఏర్పడిన ఆర్థిక సంక్షోభం నుంచి ప్రజలు, దేశం బయటపడేందుకు చాలా కాలం పడుతుంది. అసలు సమస్య అప్పుడు ఎదురవుతుంది. ఇప్పటికే మన దేశంలో పేద, మధ్యతరగతి వర్గాలు పెద్ద నోట్ల రద్దు, జిఎస్‌టీ వంటి సంస్కరణల వల్ల ఎన్నో ఇబ్బందులకు లోనవుతున్నారు. వాటి నుంచి ఇంకా బయటపడటం లేదు. దురదృష్టమేమంటే ఇలాంటి లోటుపాట్లను ఎత్తి చూపాల్సిన మీడియా రాజకీయ రేటింగ్‌లు సుస్థిరంగా ఉండటంపై దృష్టిని కేంద్రీకరిస్తోంది. లాక్‌ ‌డౌన్‌ ఒక్కటే పరిష్కారమా అనే దానిపై దృష్టిని కేంద్రీకరించడం లేదు. లాక్‌ ‌డౌన్‌ ‌మంచిదే కావచ్చు, దానికి  జనాన్ని సన్నద్దం చేయలేకపోవడం, సరైన ప్రణాళిక లేకుండా, తగిన ఏర్పాట్లు చేయకుండా హడావుడిగా అమలు చేయడం వంటి లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Leave a Reply