రెండవ ప్రపంచ యుద్ధం తరవాత ఇంకా ప్రపంచానికి యుద్ధం వద్దని యునైటెడ్ నేషన్స్ ఏర్పాటు చేయటం జరిగింది.. దీనితో పాటే రెండవ ప్రపంచ యుద్ధంలో నాశనం అయిన యూరప్ ఫ్రాన్స్ లో యుద్ధ విమానాలు తయారు చేసే దాసాల్ట్ కంపెనీ పుట్టింది. అలా పుట్టిన కంపెనీ నుంచి భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ శీ•తీ•స్త్ర•అ యుద్ధవిమానాలు దీన్ని ఇంగ్లీష్ లో హురికేన్ అంటారు. నెహ్రు దీన్ని భారతీయ భాషలో తుఫాని అని చెప్పి ఇండియాకి తీసుకువచ్చారు. దసాల్ట్ కంపెనీ పుట్టిన తరవాత తన తొలి ఉత్పత్తిగా 567 యుద్ధ విమానాలు తయారు చేసింది. ఇందులోంచి అప్పటి కాలంలోనే భారత్ 104 విమానాలు కొనింది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత మళ్లీ ప్రపంచంలో యుద్ధం వద్దు అని ప్రపంచ దేశాలు అనుకున్నాక ఫ్రాన్స్ లో పుట్టిన దాసాల్ట్ కంపెనీ టర్నోవర్ అత్యధికంగా 61371కోట్ల యూరోలు వుంది.. గత ఏడాది దాసాల్ట్ కంపెనీ సంపాదన 7136 కోట్ల యూరోలు. ప్రపంచంలో ఉన్న టాప్ 20 ఆయుధ కంపెనీల పరిస్థితి కూడా ఇదే పరిస్థితి. భారత్ ఈ ఆయుధాల కంపెనీల నుంచి దిగుమతి చేసుకుంటున్న ఆయుధాల జాభితా చాలా పెద్దది..
ప్రస్తుతం దసాల్ట్ నుంచి ఐదు రఫెల్ యుద్ధవిమానాలు వచ్చాయి. మరో 31 రావాల్సి ఉంది. మిగ్29.. ఇరవై ఒక్క విమానాలు రష్యా నుంచి రావాల్సి ఉంది. సుఖోయ్ so 30 పన్నెండు ఫైటర్ విమానాలు రష్యా నుంచి రావాల్సి ఉంది. బ్రెజిల్ నుంచి ఆవేక్స్ మారన్ జువీదీ145 దిగుమతి కానున్నాయి. రాడార్ తోపాటుగా వాడే బారియర్emb50 ఎక్కుప్మెంట్స్ రెండు సెట్స్ రష్యా నుంచి రానున్నాయి. జర్మనీ నుంచి నాలుగు ట్రాన్స్ పోర్ట్ కోసం వాడే డోర్నియర్ రానున్నాయి. బోయింగ్A 64 అపాచే యూఏవీ సర్వ లెన్స్ కోసం పనికివచ్చే హెలికాప్టర్స్ ఇజ్రాయిల్ నుంచి దిగుమతి కానున్నాయి. ఇక నేవీ వింగ్ లోకి వెళ్లి చూసినట్లయితే, మేరీ టైం పెట్రోలింగ్ కోసం అమెరికా నుంచి నాలుగు బోయింగ్ పీ8 ప్లేన్స్ భారత్ కొన్నది. జర్మనీ నుంచి 12 డోర్నియర్ డీవో 228 రానున్నాయి. రష్యా నుంచి నాలుగు కామోవ్ హెలికాప్టర్లు రానున్నాయి. ఫ్రాన్స్ నుంచి హెల్త్ చేతక్ నాలుగు రానున్నాయి. అమెరికా నుంచి సూర్యోస్కి AH60 సి హాక్ 24 దిగుమతి కానుంది. ఇలా కొనసాగే ఈ జాబితా వలన మనకి స్పష్టం అయ్యేది ఒక్కటే.. భారత్ ప్రజలమైన మనం యుద్ధ ఆయుధాలు తయారుచేసే కంపెనీలకు ఓ పెద్ద కస్టమర్లం.. అంతే కాదు అతి ఎక్కువ ధర చెల్లించే కస్టమర్లం కూడా..ప్రస్తుతం దాసాల్ట్ నుంచి యుద్ధ విమానాలు భారతదేశం మాత్రమే కొనలేదు. ఈజిప్ట్ కూడా 36 కొన్నది.. అయితే మన కన్నా తక్కువ ధరకు కొన్నది. ఖతార్ కూడా దాసాల్ట్ నుంచి యుద్ధవిమానాలు కొన్నది. ఫ్రాన్స్ సైన్యం కూడా రఫెల్ కొనుక్కున్నది..ఈ అందరిలో అధిక ధర చెల్లించింది మనమే..
మన సైన్యాన్ని ఇలా ఆధునీకరించాల్సిన అవసరం ఏమంటే పాకిస్తాన్..చైనా పేర్లు ప్రభుత్వం చెబుతుంది. పొరుగు దేశం పాకిస్తాన్ దగ్గర ఉన్న అత్యాధునిక యుద్ధ విమానం ఎఫ్ 16.. 4 లేదా 4.5 జనరేషన్ విమానం ఇది. మనం కొన్న రఫెల్ 4.5 జనరేషన్ విమానం అని చెబుతున్నారు. ఇక చైనా విషయానికి వస్తే చైనా దగ్గర, చైనా సొంతంగా తయారు చేసుకున్నా జే20 యుద్ధ విమానం ఉంది. చైనా ప్రకారం ఇది 5వ జనరేషన్ యుద్ధవిమానం. అయితే జే 20 చైనా యుద్ధ విమానం ఇంతవరకు ఏ యుద్ధంలో కూడా వాడక పోవటం వలన దీని సామర్ధ్యంపై ఓ అంచనా లేదు.. చైనా జే 20లో రష్యాలో తయారైన సుకోయి ఎస్యూ 30 ఇంజన్ వాడి తయారు చేసుకుంది కనుక దీని సామర్ధ్యం అంచనా ఈ ఇంజిన్ ప్రకారం చేస్తున్నారు. మన దగ్గర వున్న రాఫెల్ యుద్ధ విమానాన్ని తీసుకుంటే ఇది ఆఫ్ఘనిస్థాన్.. సిరియా.. లిబియాలో ఉపయోగపడి అక్కడి ప్రజల జీవితాలతో ఆడుకుంది.. యుద్ధంలో ప్రజల ప్రాణాలు తీసిన అనుభవం వున్నా రఫెల్ ఇప్పుడు మన దేశములో పాగా వేసింది..మన ప్రజలు కోరుకుంటున్నట్టు ఇరుగు పొరుగు దేశాలతో చర్చ లతో దౌత్య సమస్యలను చక్కదిద్దుకుంటే.. అతి ప్రమాదకరమైన ఈ రఫెల్ మన దేశములో తెల్ల ఏనుగుగా మిగిలిపోతుంది.