- 24 గంటల వ్యవధిలో కొత్తగా 1,684 కేసులు నమోదు
- దేశంలో 23,077కు పెరిగిన కొరోనా కేసులు
- ఇప్పటివరకూ చనిపోయిన వారి సంఖ్య 718
- దేశంలో కొరోనా వ్యాప్తి చాలా తక్కువ
- రికవరీ రేటులోనూ ముందున్నాం
- అయినా మరింత కఠినంగా అమలు చేయాల్సిందే కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడి
ఇతర దేశాలతో పోల్చితే మనదేశంలో కరోనా వ్యాప్తి చాలా తక్కువగా ఉందని కేంద్రం తెలిపింది. కరోనా బారిన పడ్డ వారిలో రికవరీ రేటు మన దేశంలో బావుందని పేర్కొంది. అయితే, లాక్ డౌన్‌ని మరింత కట్టుదిట్టంగా అమలు చేయడమే దేశ ప్రజలందరి బాధ్యతని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. కరోనా వ్యాప్తి చెందుతున్న తరుణంలో భారత్ ముందుగానే స్పందించి లాక్‌డౌన్ విధించడంతో మనం చాలా సేఫ్ జోన్‌కు వచ్చామని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే మూడో దశ నుంచి భారత్ రక్షించబడిందని చెప్పింది. రాష్టాల్రు లాక్ డౌన్ అమలులో మరింత కఠినంగా వుండాలని సూచించింది.భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 24 గంటల వ్యవధిలో కొత్తగా 1,684 నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. శుక్రవారం మధ్యాహ్నం వరకు దేశంలో కరోనా కేసుల సంఖ్య 23,077కు పెరిగిందని వెల్లడించింది. భారత్‌లో కరోనా బాధితుల రికవరీ 20.57శాతంగా ఉందని పేర్కొంది. గడచిన 28 రోజుల్లో 15 జిల్లాల్లో జీరో పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
గత 14 రోజుల్లో దేశంలోని 80 జిల్లాల్లో ఒక్క పాజిటివ్ కేసు నిర్దారణ కాలేదు. ప్రస్తుతం దేశంలో 17,610 యాక్టివ్ కేసులున్నాయి. 24 గంటల్లో 491 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 4,078వేల మంది డిశ్చార్జ్ అయ్యారు. శుక్రవారం వరకు 5 లక్షలకు పైగా కరోనా టెస్టులు పూర్తి చేశామని’ కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ వివరించారు. ఇప్పటివరకూ 718 మంది చనిపోయారు. 4749 మంది కోలుకున్నారు. గత 28 రోజులుగా 15 జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదని అగర్వాల్ చెప్పారు. గత 14 రోజుల్లో 80 జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదన్నారు. మరోవైపు కేంద్ర అంతర్ మంత్రివర్గ బృందాలతో పాటు అహ్మదాబాద్, సూరత్, హైదరాబాద్, చెన్నైలో అడిషనల్ సెక్రటరీ నేతృత్వంలో అదనపు బృందాలను ఏర్పాటు చేసినట్లు కేంద్ర •ం శాఖ జాయింట్ సెక్రటరీ పుణ్య శ్రీవాస్తవ తెలిపారు.