Take a fresh look at your lifestyle.

బెంగాల్లో 200 సీట్లు సాధించబోతున్నాం

  • మమత ఎక్కడికెల్లినా ఓటమి తప్పదు
  • ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోడీ ధీమా

బెంగాల్‌ ‌లో బీజేపీకి 200 సీట్లు ఖాయమని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. కొన్ని వారాల క్రితం ప్రజల నోళ్లల్లో ఇదే మెదిలేదని, జనం గొంతుకకు దేవుడి ఆశీర్వాదం కూడా లభించిందన్నారు. తొలి దశ ఎన్నికల్లో బీజేపీకి మంచి ఊపు వచ్చిందని, ఈసారి 200 కన్నా ఎక్కువ సీట్లే వస్తాయని అన్నారు. ప్రధాని మోదీ గురువారం జయానగర్‌లో జరిగిన ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రెండో దశ పోలింగ్‌ ‌సందర్భంగా ఓటర్ల ఎక్కువ సంఖ్యలో పోలింగ్‌ ‌బూత్‌లకు చేరుకుంటున్నారని, ఎక్కడ చూసినా బీజేపీయే కనిపిస్తోందన్నారు. బెంగాల్‌లో బీజేపీ హవా స్పష్టంగా కనిపిస్తోందని మోదీ పేర్కొన్నారు.

సీఎం మమత ఎప్పుడూ ’కూల్‌ ‌కూల్‌’ అని అంటున్నారని, తృణమూల్‌ ‌మాత్రం కూల్‌గా లేదని శూలంగా పొడుస్తోందని ఎద్దేవా చేశారు. శూలం ప్రజలను తీవ్ర ఇబ్బందులు పెడుతోందని మోదీ విమర్శించారు. జైశ్రీరాం అన్న నినాదం చేస్తే మమత చిరాకు పడతారని, ఈ విషయం అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. అంతేకాకుండా దుర్గా పూజలు చేసినా అలాగే చికాకు పడతారని, తాజాగా బొట్టు పెట్టుకున్నా, కాషాయ వస్త్రాలు ధరించినా, చికాకు పడుతున్నారని మోదీ విమర్శించారు. దీదీ…. మికు ఎవర్నైనా ప్రసన్నం చేసుకునే హక్కు మికుంది. నన్ను తిట్టాలనుకుంటే… తిడుతూనే ఉండండి. కానీ… ప్రజల భక్తిశ్రద్ధల్ని కిం మిపరచడాన్ని అంగీకరించం అని మోదీ పేర్కొన్నారు. మొదటి దశ పోలింగ్‌ ‌పూర్తయిన తర్వాత మమత చికాకు మరింత పెరిగిపోయిందన్నారు.

సాయం కోసం అనేక మందికి లేఖలు రాస్తున్నారని, అవుట్‌ ‌సైడర్స్ ‌మద్దతు కోరుతున్నారని మోదీ ఎద్దేవా చేశారు. నందిగ్రామ్‌ ‌నుంచే కాకుండా మరో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కూడా మమతా బెనర్జీ పోటి చేయబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. కాగా, ఈ వార్తలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పందిస్తూ మమతపై సెటైర్లు వేశారు. ఇప్పటికే నందిగ్రామ్‌లో ఓటమి ఖాయమైందని, మరో చోటికి పోయినా అదే ఫలితం వస్తుందని ఆయన ఎద్దేవా చేశారు. గురువారం పశ్చిమ బెంగాల్‌లోని ఉలుబేరియాలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ‘దీదీ నేను విన్నది నిజమేనా? ఇంకో నియోజకవర్గం నుంచి కూడా మిరు నామినేషన్‌ ‌వేస్తున్నారట కదా.. మిరు ముందు నందిగ్రామ్‌ ‌వెళ్లారు. మికు ప్రజలు బుద్ధి చెప్పారు.

ఇప్పుడు మరో చోటుకి వెళ్లాలను కుంటున్నారు. మిరెక్కడికి వెళ్లినా మికు సమాధానం చెప్పడానికి బెంగాలీ ప్రజలు సిద్ధంగా ఉన్నారు‘ అని అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘కొన్ని రోజులు దీదీ నన్ను టూరిస్ట్ అం‌టారు, ఇంకొన్ని రోజులు బయటి వ్యక్తి అంటారు. చొరబాటుదారులను సొంత బిడ్డలుగా చూసే మిరు భారత మాత బిడ్డనైన నన్ను బయటి వ్యక్తి అనడం సబబేనా? ప్రజల్ని ఇలా విడదీయడం ఆపండి. ఇది రాజ్యాంగ నియమావళికి విరుద్ధం. పశ్చిమ బెంగాల్‌ ‌ప్రజలు మిమ్మల్ని ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. నందిగ్రామ్‌ ‌ప్రజలు ఈరోజు తమ కలను సాకారం చేసుకున్నారు. వాళ్ల భవిష్యత్‌ ‌కోసం, గుర్తింపు కోసం ఇంకా ఎదురు చూడడానికి వారు సిద్ధంగా లేరు. పోలింగ్‌ ‌బూతులకు ఓటర్లు పోటెత్తుతున్నారు. అది కేవలం ఓటింగ్‌ ‌కోసం మాత్రమే కాదు, బెంగాల్‌ ‌పునరుజ్జీవానికి వారు మార్గం సుగమం చేస్తున్నారని మోదీ అన్నారు.

Leave a Reply