బలమైన టీమ్‌తో ఆడబోతున్నాం

హైదరాబాద్, జనవరి 17 : న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు టీమిండియా సిద్ధమైంది. ఉప్పల్ వేదికగా నేడు తొలి మ్యాచ్ జరగనుంది. ఈ సందర్భంగా బలమైన టీంతో ఆడుతున్నామని కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పారు. తమ శక్తిసామర్ద్యాలను పరీక్షించుకోవడానికి ఇది మంచి అవకాశమన్నారు. ఎదుటి టీం ఎలా ఉందో ఆలోచించకుండా.. పూర్తిగా తమ టీం ఆటతీరుపై ఫోకస్ పెడతామన్నారు. హైదరాబాద్ ప్లేయర్ సిరాజ్ రెండేళ్లుగా బాగా ఆడుతున్నాడని.. అతని గ్రాఫ్ రోజురోజుకు పెరుగుతుందని చెప్పారు. మూడు ఫార్మట్స్‌లో అతను ముఖ్యమైన ప్లేయర్ అన్నారు. తొలిసారి హోం గ్రౌండ్లో ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడుతున్న సిరాజ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. గత సిరీస్ ఆడని ఇషాన్ కిషన్ ఈ సారి మిడిల్ ఆర్డర్లో ఆడతాడని తెలిపారు.
స్పిన్నర్లు చాహల్, అక్షర్, కుల్దిప్ అందుబాటులో ఉన్నారని.. ప్రస్తుతం తమ టీం మంచి ప్రదర్శన కనబరుస్తోందని స్పష్టం చేశారు. నేటి వన్డేకు శ్రేయస్ అయ్యర్ దూరం …జట్టులోకి రజత్ పటిదార్ న్యూజిలాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌కు శ్రేయాస్ అయ్యర్‌ను పక్కన పెట్టేశారు. అతని స్థానంలో టీమిండియా జట్టులోకి రజత్ పటిదార్‌ను తీసుకున్నారు. వెన్ను నొప్పి వల్ల అయ్యర్‌ను తప్పించినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఇటీవల శ్రీలంకతో ముగిసిన వన్డే సిరీస్‌లో అయ్యర్.. భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. మూడుసార్లు మంచి స్టార్ట్ తీసుకున్నా.. పెద్ద స్కోర్లు చేయలేకపోయాడు. బుధవారం హైదరాబాద్‌లో తొలి వన్డే జరగనున్నది. దీంతో అతని స్థానంలో పటిదార్ జట్టులోకి వచ్చాడు.