Take a fresh look at your lifestyle.

కొరోనా కట్టడికి అన్ని విధాలుగా పోరాడుతున్నాం

  • ఆత్మీయులను కోల్పియన వారి బాధలను అర్థం చేసుకోగలను
  • కనబడని శతృవు మన జీవితాలను కకావికలం చేసింది
  • భౌతికదూరం పాటిస్తూ రక్షణ చర్యలు తీసుకోండి
  • పిఎం కిసాన్‌ ‌స్కీమ్‌ ‌కింద రైతుల కాతాల్లోకి నగదు బదిలీ
  • కొరోనా కష్టంలోనూ నగదు జమచేశామన్న ప్రధాని మోడీ

కోవిడ్‌ ‌కారణంగా దేశ వ్యాప్తంగా ప్రజలు తమ అత్మీయులను కోల్పోయిన విచారం, బాధలో ఉన్నారని, ఒక ప్రధాన సేవక్‌గా వారి బాధను తాను పంచుకుంటున్నానని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ’పీఎం కిసాన్‌’ ‌స్కీమ్‌ ‌కింద రైతులకు ఎనిమిదో ఇన్‌స్టాల్‌మెంట్‌ను ప్రధాని శుక్రవారంనాడు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొరోనాను ’కనబడని శత్రువు’తో పోల్చారు. ప్రజలు తమను తాము కాపాడుకోవడంతో పాటు తమ కుటుంబ సభ్యులను కాపాడుకునేందుకు సామాజిక దూరం పాటించడం, మాస్క్‌లు ధరించడం వంటి ముందస్తు జాగ్రత్తగా తీసుకోవాలని కోరారు. కొరోనాపై పోరులో అన్ని రంగాలు పోరాడుతున్నాయని, దానిని అంతం చేసే పనిలో అలుపెరుగని పోరాటం చేస్తున్నామని అన్నారు.

వందేళ్ల తర్వాత ప్రపంచాన్ని భీకరమైన మహమ్మారి ఆవరించింది. కనిపించని శత్రువుగా మన ముందు నిలిచింది. అనేక మంది మన ప్రియతములను ఈ శత్రువు కారణంగా కోల్పోయాం. ప్రజలు బాధల్లో ఉన్నారు. వి• ప్రధాన సేవకునిగా వి• మనోభావాలను, బాధను నేను అర్ధం చేసుకోగలనని ప్రధాని అన్నారు. కోవిడ్‌ ‌నుంచి కాపాడుకునేందుకు వ్యాక్సిన్‌ ‌వేయించుకోవాలని, వ్యాక్సిన్‌ ‌సరఫరా పెంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేయగలిగనదంతా చేస్తున్నాయని చెప్పారు. స్వీయ రక్షణకు కోవిడ్‌ ‌వ్యాక్సిన్‌ ‌సరైన మార్గమని, ఇంతవరకూ దేశవ్యాప్తంగా 18 కోట్ల వ్యాక్సిన్‌ ‌డోసులు ఇవ్వడం జరిగిందని తెలిపారు. అన్ని ప్రభుత్వ హాస్పిటల్‌ ‌ల్లోనూ ఉచిత వ్యాక్సిన్‌ ఇస్తున్నారని, ప్రజలు తమ వంతు రాగానే వ్యాక్సిన్‌ ‌తీసుకోవాలని సూచించారు. ఇందువల్ల కోవిడ్‌ ‌నుంచి రక్షించుకోవడమే కాకుండా, పరిస్థి సీరియస్‌ ‌కాకుండా రిస్క్ ‌తగ్గుతుందని ప్రధాని చెప్పారు.

ప్రధాన మంత్రి కిసాన్‌ ‌సమ్మాన్‌ ‌నిధి కింద ఎనిమిదో విడతలో భాగంగా రూ. 20 వేల కోట్లను ప్రధాని మోడీ శుక్రవారం విడుదల చేశారు. ఈ మొత్తం 9.5 కోట్ల మంది అన్నదాతలు ఖాతాల్లో నేరుగా జమకానుంది. వీడియో కాన్ఫరెన్స్ ‌ద్వారా ఈ నిధులను విడుదల చేశారు. కరోనా వైరస్‌పై భారత్‌ ‌పోరాడుతున్న తరుణంలో ఈ విడత నిధులు విడుదల చేశామని మోడీ అన్నారు. ఈ సంక్షోభ సమయంలో కూడా రైతన్నలు వ్యవసాయంలో రికార్డులు సృష్టించారని, కనీస మద్దతు ధర పంటను సేకరించడంలో కేంద్రం కొత్త రికార్డులు సృష్టిస్తోందని అన్నారు.

గతంతో పోలిస్తే… ఎంఎస్‌పిపై 10 శాతం అదనంగా గోధుమలను కొనుగోలు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ ‌తోమర్‌ ‌మాట్లాడుతూ.. ఈ పథకంలో పశ్చిమ బెంగాల్‌ ‌చేరిందని, రాష్ట్రంలో 7 లక్షల మంది రైతులు ప్రయోజనం పొందారని తెలిపారు. పిఎం కిసాన్‌ ‌పథకం కింద ప్రభుత్వం ప్రతి ఏటా 14 కోట్ల మంది రైతులకు మూడు సమాన వాయిదా పద్ధతిలో రూ. 6 వేలను చెల్లిస్తోంది. 2019లో ఫిబ్రవరి 24న ప్రారంభించిన పిఎం-కిసాన్‌ ‌పథకం ఇప్పటి వరకు రూ. 1.15 లక్షల కోట్లను రైతలకు బదిలీ చేయబడ్డాయన్నారు.

Leave a Reply