Take a fresh look at your lifestyle.

మహారాష్ట్రలో కొరోనా చర్యలపై అందరితో చర్చిస్తున్నాం

  • ప్రజలకు ఇబ్బంది రాకుండా చర్యలు
  • పాక్షిక లాక్‌డౌన్‌ ‌ద్వారా కంట్రోల్‌ ‌చేసే ప్రయత్నం
  • తాజా పరిస్థితులపై శివసేన ఎంపి సంజయ్‌ ‌రౌత్‌ ‌వెల్లడి
  • వ్యాక్సిన్‌ ‌డోస్‌ ‌నిల్వలు పెంచాలని కేంద్రానికి మంత్రి లేఖ

మహారాష్ట్రలో కొవిడ్‌ ‌వ్యాప్తిని అరికట్టేందుకు విధించిన ఆంక్షలన్నీ ప్రభుత్వం ప్రతిపక్షాలు, ఇతర పార్టీలతో చర్చించినట్లు శివసేన ఎంపీ సంజయ్‌ ‌రౌత్‌ ‌తెలిపారు. సీఎం ఉద్ధవ్‌ ‌ఠాకే సహా అన్ని పార్టీల నాయకులతో చర్చలు జరిపారని, మహారాష్ట్ర ప్రభుత్వం ప్రజల మంచి కోసం నిర్ణయం తీసుకుందని.. లేకపోతే పరిస్థితి మరింత క్లిష్టంగా ఉంటుందన్నారు. ’కరోనా కేసుల పెరుగుదలపై ప్రధాని సైతం చాలా ఆందోళన చెందుతున్నారని నేను భావిస్తున్నానని  అన్నారు. వైరస్‌ ఉధృతి నేపథ్యంలో లాక్‌డౌన్‌ ‌విధించాలని గుజరాత్‌ ‌హైకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పరిస్థితిని అదుపు చేసేందుకు లాక్‌డౌన్‌ ‌సముచితమైందని హైకోర్టు సైతం గుర్తించిందని సంజయ్‌రౌత్‌ ‌పేర్కొన్నారు. రాష్ట్రంలో వైరస్‌ ‌వ్యాప్తిని అరికట్టేందుకు విధించిన ఆంక్షలు పునః పరిశీలించాలని విజ్ఞప్తి చేస్తూ మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్రసింగ్‌ ‌ఫడ్రవీస్‌ ‌సీఎం ఉద్ధవ్‌ ‌ఠాక్రేకు లేఖ రాశారు. అన్ని విషయాలపై సమాజంలోని అన్ని వర్గాలతో మళ్లీ చర్చించాలని, సామాన్యుల జీవితాలను ప్రభావితం చేయకుండా ఆంక్షలు విధించాలని ఫడ్నవీస్‌ ‌కోరారు. ఏప్రిల్‌ 30 ‌వరకు మహారాష్ట్ర ప్రభుత్వం ’బ్రేక్‌ ‌ది చైన్‌’ ‌కింద కొత్త మార్గదర్శకాలను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. మహారాష్ట్రలో మంగళవారం 55,469 కరోనా కేసులు నమోదవగా.. 297 మంది మృత్యువాతపడ్డారు. ఇదిలావుంటే దేశవ్యాప్తంగా వ్యాక్సిన్‌ ‌పక్రియ కొనసాగుతుండగా మహారాష్ట్రలో పలు చోట్ల కోవిడ్‌ ‌టీకా నిల్వలు అడుగంటనున్నాయి. కేవలం మరో మూడు రోజులకు సరిపడే టీకాలు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు మహా ప్రభుత్వం వెల్లడించింది.

టీకా సరఫరాను పెంచాలని కేంద్రాన్ని కోరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేశ్‌ ‌తోప్‌ ‌తెలిపారు. ముంబై లాంటి నగరాల్లో టీకా నిల్వలు శరవేగంగా తగ్గుతున్నాయని ఆయన చెప్పారు. వ్యాక్సిన్‌ ‌స్టాక్స్ ‌కేవలం మూడు రోజులకు సరిపడా ఉన్నాయని, మరిన్ని టీకాలు పంపాలని కేంద్రాన్ని కోరామని, ప్రతి రోజు ఇక్కడ అత్యధిక సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయని, ముంబైలో కూడా టీకా నిల్వలు కేవలం మూడు రోజులకు మాత్రమే ఉన్నాయని, ఈ పరిస్థితి గురించి కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్‌కు వివరించినట్లు ఆరోగ్య మంత్రి రాజేశ్‌ ‌తెలిపారు. చాలా వరకు వ్యాక్సిన్‌ ‌సెంటర్లలో డోసులు లేవని, వాటిని మూసివేశామని, డోసులు లేకపోవడం వల్ల చాలా మందిని వెనక్కి పంపేస్తున్నామని, అందుకే కొత్త డోసులు సరఫరా చేయాలని ఆయన కోరారు.

Leave a Reply