Take a fresh look at your lifestyle.

కొరోనా కట్టడికి .. నిరంతరం శ్రమిస్తున్నాం

  • అనేక వ్యాధులను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాం
  • వారియర్స్ ‌స్థయిర్యం దెబ్బతినేలా మాట్లాడవద్దు
  • ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లాలో కొరోనాపై మంత్రి ఈటల

కొరోనా కట్టడిలో నిరంతరం శ్రమిస్తున్నామని, అనేక చర్యలు తీసుకున్నామని రాష్ట్ర వైద్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. వైనస్‌పై పోరులో ముందున్న వైద్యులు, వైద్య సిబ్బందిపై అనవసర విమర్శులచేయడం సరికాదన్నారు. మహమ్మారిపై పోరాడుతున్న ఫ్రంట్‌లైన్‌ ‌వారియర్స్ ‌స్థయిర్యం దెబ్బతినేలా మాట్లాడరాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాల వ్యాధులను సమర్ధవంతంగా ఎదుర్కొంది. కొరోనాను కూడా ధైర్యంగా ఎదుర్కొంటుంది. ఎలాంటి అనుమానాలు లేవు. ఈ పోరాటంలో మనదే విజయమని ఈటల రాజేందర్‌ అన్నారు. వరంగల్‌లో పంచాయతీరాజ్‌ ‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి మంగళవారం ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లాల్లో కొరోనా పరిస్థితి, నివారణ చర్యలపై సక్షించారు. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ కరోనా నియంత్రణ పెను సవాలుగా మారిందని, వైద్యులు, నర్సులు తమ ప్రాణాలను పణంగాపెట్టి పనిచేస్తున్నారని పేర్కొన్నారు. కరోనా బాధితులకు ప్రతి ఒక్కరూ అండగా నిలిచి సేవలందించాలని సూచించారు. రోగులపట్ల వివక్ష చూపారాదని ఆయన అన్నారు. రాష్ట్రంలో 81శాతం మంది వైరస్‌ ‌లక్షణాలు లేకుండానే కోలుకుంటున్నారని వివరించారు. జ్వరం వచ్చిన వారందరిని వీలైనంత త్వరగా గుర్తించి పరీక్షలు చేయాలని సూచించారు. దీని ద్వారా వైరస్‌ ఉన్నట్లు నిర్దారణ అయినా ప్రాణనష్టం జరగకుండా కాపాడొచ్చని పేర్కొన్నారు.

ఇప్పటికే మసూచి, సార్స్ ‌వంటి అనేక రకాల వైరస్‌లను ఎదుర్కొన్నామని, ప్రస్తుతం కొరోనా వస్తే చావే అన్న భయాన్ని అధిగమించామన్నారు. వైద్య సిబ్బంది ప్రజల ప్రాణాలు కాపాడటానికి చాలా శ్రమిస్తున్నారని, ఊపిరితిత్తులు, శ్వాసకోస సంబంధిత సమస్యలు ఉన్నవారికే వైరస్‌ ఎక్కువ ప్రమాదకరంగా మారిందన్నారు. అయితే ప్రతీ ఒక్కరూ విధిగా భౌతికదూరం పాటించడం, మాస్కులు ధరించడం వంటి నిబంధనలు పాటిస్తే కొరోనా దరిచేరకుండా ఉండొచ్చని తెలిపారు. రాష్ట్రంలో రాపిడ్‌ ‌టెస్టులు అందుబాటులోకి వచ్చాక టెస్టింగ్‌ ‌కెపాసిటీ పెరిగిందిని మంత్రి ఈటల పేర్కొన్నారు. ముఖ్యమం త్రి కేసీఆర్‌ ‌ముందుచూపు నిర్ణయం వల్ల వైరస్‌ ‌వ్యాప్తి ఉన్నా బాధితులు అందరూ కోలుకొని సురక్షితంగా ఇళ్లకు వెళ్తున్నారని ఆయన గుర్తుచేశారు. వైద్యులు 24 గంటలు అందుబాటులో ఉన్నారని, సౌకర్యాల కల్పనలో ఆర్థిక పరమైన పరిమితి లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తున్న విషయాన్ని పేర్కొన్నారు. ప్రజలు పరిశుభ్రతను పాటించాలని, మాస్కులు ధరించాలని, అత్యవసరమైతేనే ఇళ్ల నుంచి బయటికి రావాలని సూచించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ..కరోనా వైద్యానికి నిధుల కొరత లేదని వెల్లడించారు.

కరోనా బాధి తులకు అన్ని విధాలుగా అండగా ఉండాలని వారు మానసికంగా కుంగిపోకుండా ప్రతి ఒక్కరూ వారికి స్టయిర్యాన్ని ఇవ్వాలని అన్నారు. కరోనా ను ద్వేషించాలి కానీ బాధితుడిని కాదని ఆయన అన్నారు. ప్రజలెవ్వరూ అధైర్యపడాల్సిన పనిలేదని, ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో కరోనా విషయంలో కొన్ని డియా సంస్థలు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నాయని, ఇటువంటి ఆపత్కాల సమయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవ హరించాలని ఆయన సూచించారు. అంతేకాకుండా వివిధ సామాజిక మాధ్యమాల్లో కొంతమంది కొరోనాపై తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టించడం సరికాదని ఆయన పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో కొరోనాపై దుష్పచ్రారాలు చేసే వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు. గ్రామాల్లో కొరోనా మృతుల అంతిమ సంస్కారాలు నిబంధనలకనుగుణంగా నిర్వహించాలని, ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ప్రభుత్వ చీఫ్‌ ‌విప్‌ ‌వినయ్‌భాస్కర్‌, ఎం‌పీలు బండ ప్రకాశ్‌, ‌కవిత, ఎమ్మెల్యేలు యాదగిరిరెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి, నన్నపనేని నరేందర్‌, ‌సీతక్క తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply