- రాజ్యసభలో మరోమారు స్పష్టం చేసిన కేంద్రం
- ఎంపి కనకమేడల ప్రశ్నకు మంత్రి భగవత్ కిషన్ రావు సమాధానం
న్యూఢిల్లీ,జూలై20 : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తప్పదని కేంద్రం మరోసారి తన వైఖరిని స్పష్టం చేసింది. వందశాతం ప్రైవేటీకరణకు కట్టుబడి ఉన్నామని తేల్చి చెప్పింది. ప్రైవేటీకరణపై రాజ్యసభలో టిడిపి ఎంపీ కనకమేడల ప్రశ్న లేవనెత్తగా కేంద్ర మంత్రి భగవత్ కిషన్ రావు కరాడ్ జవాబిచ్చారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తూ కేందప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కేందప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఏపీలో ఆందోళనలు ఉధృతమయ్యాయి. స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉన్నందున ప్రైవేటీకరిస్తున్నామని ఇప్పటికే కేంద్రనేతలు ప్రకటనలు చేశారు. దీంతో ఏపీలో నిరసనలు మరింత ఉధృతంగా కొనసాగుతున్నాయి.
ఈ నిరసనల్లో అన్ని పార్టీ నేతలు పాల్గొంటున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నారు. అటు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కూడా ఈ ధర్నాల్లో పాల్గొంటున్నారు. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తోంది. ఇప్పటికే ధర్నాలు కూడా నిర్వహించింది. తాజాగా టీడీపీ ఎంపీ కనమేడల విశాఖ స్టీల్ ప్రైవేటీకరణను ప్రస్తావించారు. మొత్తానికి ఇక విశాఖ ప్రైవేట్ పరం కానుందన్నది స్పస్టమయ్యింది. ఆందోళనలను కేంద్రం పట్టించుకోవడం లేదని స్పష్టం అయ్యింది.