Take a fresh look at your lifestyle.

దళిత, గిరిజనుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములను చేశాం
ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా చర్యలు
ఎస్సీ,ఎస్టీ కమిషన్‌ ‌కార్యాలయ ప్రారంభోత్సవంలో మంత్రి కెటిఆర్‌

‌ప్రభుత్వం దళిత, గిరిజనుల అభివృద్ధికి, సంక్షేమానికి కట్టుబడి ఉన్నదని మంత్రి కేటీఆర్‌ ‌స్పష్టం చేశారు. ఇప్పటికే అనేక రకాల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ఈ రెండు వర్గాలను భాగస్వాములను చేస్తూ ప్రభుత్వం ముందుకు పోతున్నదని తెలిపారు. ఒకవైపు వారి ప్రాథమిక అవసరాలైన విద్యా రంగంలో అనేక విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తూనే మరోవైపు వారి అభివృద్ధి కోసం వారిని పెద్ద ఎత్తున ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా కార్యక్రమాలు తీసుకుంటున్నామని తెలిపారు. దేశంలో మూలధనంతోనే కులాన్ని రూపుమాపే అవకాశం ఉన్నదని, ఆ దిశగా సాధ్యమైనంత ఎక్కువ మంది దళిత, గిరిజన వర్గాల నుంచి యువకులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే కార్యక్రమాలు చేపట్టాలన్నారు. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ‌నూతన కార్యాలయాన్ని మంత్రులు కేటీఆర్‌, ‌కొప్పుల ఈశ్వర్‌, ‌సత్యవతి రాథోడ్‌ ‌కలిసి ప్రారంభించారు. అనంతరం ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ‌వెబ్‌సైట్‌ను మంత్రి కేటీఆర్‌ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ‌చైర్మన్‌ ఎ‌ర్రోళ్ల శ్రీనివాస్‌, ఎమ్మెల్యే బాల్క సుమన్‌తో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ శాఖల సెక్రటరీలు, ఉన్నతాధికారులతో జరిగిన సవి•క్ష సమావేశంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్‌, ‌సత్యవతి రాథోడ్‌ ‌లతో కలిసి కేటీఆర్‌ ‌పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి కేటీఆర్‌ ‌తన ఆలోచనలను పంచుకున్నారు.

ఇప్పటికే టీ ప్రైడ్‌ ‌కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున ఈ రెండు వర్గాల యువకులకు అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. సుమారు ఈ రెండు వర్గాల్లో కలిపి ఇప్పటికే 36 వేల మందికి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా మార్చేందుకు యూనిట్లు ఇచ్చామని తెలిపారు. వీరందరికి త్వరలోనే సబ్సీడీలను అందిస్తామన్నారు. ఈరోజు సూమారు 2000 మందికి అవసరం అయిన 100 కోట్ల సబ్సీడీ మెత్తాన్ని పరిశ్రమల శాఖ తరపున విడుదల చేశారు. ఈ సందర్భంగా పలువురు లబ్దిదారులను మంత్రులు చెక్కులను అందించారు. సమాజంలో ఉన్న వాడు లేరు, లేనివారు అనే తేడా ప్రధానంగా మారిందని ఆర్థికంగా అవకాశాలు లేని వారికి అవకాశాలు కల్పించే విధంగా పని చేస్తామన్నారు. ఎడ్యుకేషన్‌, ఏం‌ట్రపిన్యూర్‌ ‌షిప్‌, ఎం‌ప్లాయిమెంట్‌ అనే 3 ఇ ఈ సూత్రాలతో నిమ్నవర్గాలను ప్రధాన స్రవంతిలోకి తీసుకువచ్చే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ప్రజల కోసం కల్పిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, చేపట్టిన భారీ ప్రాజెక్టులు, ఇతర పాలన సంస్కరణ కార్యక్రమాలతో దేశంలోనే అగ్రగామిగా ఉన్నదని తెలిపిన కేటీఆర్‌, ‌దళిత, గిరిజన యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేలా, పెట్టుబడి అవకాశాలు కల్పించే విషయంలోనూ అంతే ఆదర్శంగా ఉండాలన్నారు.

ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం అవలంబిస్తున్న కార్యక్రమాలు, చర్యలను పున సవి•క్షించి, దేశంలో ఇతర రాష్ట్రాలు అవలంబిస్తున్న కార్యక్రమాలన్నింటినీ పైన అధ్యయనం చేసి దేశంలోనే ఆదర్శవంతమైన విధానంతో ముందుకు రావాలని అధికారులకు మంత్రి కేటీఆర్‌ ‌సూచనలు చేశారు. తన పరిధిలో ఉన్న పరిశ్రమల శాఖ, స్టేట్‌ ‌ఫైనాన్స్ ‌కార్పొరేషన్‌, ఎస్సీ కార్పొరేషన్‌లు కలిసి ఈ దిశగా పని చేయాలన్నారు. త్వరలోనే మరోసారి సమావేశమవుతామని అధికారులకు సూచించారు. ఆలోగా వినూత్నమైన విధానాలతో ముందుకు వస్తే ముఖ్యమంత్రి అనుమతితో మరింత ప్రభావవంతమైన పాలసీలతో ముందుకు పోదామని సూచించారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న పథకాలు, కార్యక్రమాల ద్వారా దళిత, గిరిజన యువకులకున్న అవకాశాలపైన అన్ని జిల్లాల్లో అవగాహన మేలాలు నిర్వహించాలన్నారు. తమకు అప్పజెప్పిన బాధ్యతలను నిబద్ధతతో ముందుకు తీసుకుపోతున్న కమిషన్‌ ‌చైర్మన్‌, ‌సభ్యులను అభింనందించారు. ముఖ్యంగా ఈ విషయంలో కమిషన్‌ ‌మరియు కమిషన్‌ ‌సభ్యులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటించి చర్యలు తీసుకోవడాన్ని మంత్రి కేటీఆర్‌ అభినందించారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఏర్పడిన నాటి నుంచి చేపట్టిన చర్యలను మంత్రి కేటీఆర్‌ అభినందించారు. ముఖ్యంగా దళిత గిరిజనుల పైన జరుగుతున్న అట్రాసిటీ లను, వాటికి సంబంధించిన కేసులను పరిష్కరించి, వారికి తక్షణ సహకారం అందించడం వంటి చర్యలు ప్రశంసించారు.

Leave a Reply