Take a fresh look at your lifestyle.

కొరోనా కట్టడిలో అన్ని రాష్ట్రాల కన్నా ముందున్నాం

  • కలెక్టర్లు,ఎస్పీల కృషి ప్రశంసనీయం
  •  ప్రస్తుతం 11 జిల్లాల్లో అందుబాటులో పరీక్షలు చేసే ల్యాబ్‌లు
  • కరోనాతో కలసి జీవించాల్సిందే తప్పదన్న జగన్‌

అమరావతి,మే 5 : కరోనా వైరస్‌ను ఎదుర్కొనే విషయంలో ఇతర రాష్ట్రాల కంటే భిన్నంగా పనిచేయగలిగామని ఏపీ సీఎం వైఎస్‌ ‌జగన్‌ ‌మోహన్‌రెడ్డి అన్నారు. కొవిడ్‌ ‌పరీక్షల పరంగా చూస్తే దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో ఉందని.. ప్రతి 10లక్షల జనాభాకు 2500కి పైగా పరీక్షలు చేస్తున్నామని, ఇది ఒక రికార్డు అని చెప్పారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ ‌నిర్వహించారు. కరోనా నివారణ చర్యలతో పాటు ఖరీఫ్‌ ‌సీజన్‌లో వ్యవసాయం, తాగునీరు, నాడు-నేడు, గృహనిర్మాణం, ఉపాధి హా అంశాలపై జగన్‌ ‌సక్ష నిర్వహించారు. కరోనా నియంత్రణ విషయంలో కలెక్టర్లు, ఎస్పీలు చక్కటి పనితీరు కనబరిచారని సీఎం అభినందించారు. 35రోజుల క్రితం రాష్ట్రంలో స్విమ్స్ ‌తప్ప మరెక్కడా కరోనా పరీక్షలు చేసే సౌకర్యం లేదని.. అక్కడ కూడా రెండు రోజుల తర్వాత ఫలితాలు వచ్చేవని గుర్తు చేశారు. ప్రస్తుతం 11 జిల్లాల్లో పరీక్షలు చేసే ల్యాబ్‌లు అందుబాటులో ఉన్నాయన్నారు. ట్రూనాట్‌ ‌కిట్లు సైతం అన్ని ఆస్పత్రుల్లో ఉన్నాయని సీఎం వివరించారు. గ్రామ వాలంటీర్లు, ఆశా వర్కర్ల రూపంలో మనకు బలమైన నెట్‌వర్క్ ఉం‌దన్నారు. కరోనాను ఎంత కట్టడి చేయాలనుకుంటున్నా.. అది ఎక్కడో ఓ చోట కనిపిస్తోందకన్నారు. కరోనా జీవితంలో భాగమని.. దానితో కలిసి జీవించాల్సి ఉంటుందని జగన్‌ ‌పునరుద్ఘాటించారు. కరోనా మరణాల రేటు కేవలం శాతంలోపే ఉందన్నారు. వయసు పైబడిన వారు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారిపైనే ఇది ప్రభావం చూపుతోందని చెప్పారు. దేశంలోనో, రాష్ట్రంలోనో ఎక్కడో ఓ చోట ఇది కనిపిస్తుందని, దగ్గడమో, తుమ్మడమో చేస్తే అది పక్కవాళ్లకు వ్యాపిస్తుందని ఆయన వివరించారు. కరోనా వైరస్‌ ‌కారణంగా మరణాల రేటు కేవలం 2శాతంలోపే ఉందని, అధిక వయస్సు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారిపైనే ఎక్కువ ప్రభావం చూపుతోందని చెప్పారు. మన ఇంట్లో ఉన్న పెద్దవారిని రక్షించుకోవాల్సిన అవసరం ఉందని సీఎం జగన్‌ ‌తెలిపారు. ఇతర రాష్టాల్లో్ర ఉన్న వలస కార్మికులు తిరిగి వస్తున్నారని అదేవిధంగా ఇక్కడ నుంచి కూడా కొంత మంది వెళ్లడం ప్రారంభమైందని సీఎం జగన్‌ ‌తెలిపారు. లక్షకు మందికిపైగా రాష్ట్రానికి వలస కూలీలు వస్తారని, మరో లక్షమంది కూడా ఇతరులు ఉంటారని అంచనా వేస్తున్నామని ఆయన చెప్పారు. వివిధ దేశాల నుంచి కూడా మన రాష్టాన్రికి చెందిన వారిని ఆయా దేశాలు పంపుతున్నాయని వెల్లడించారు.

వీటన్నింటినీ మనం సమన్వయం చేయాల్సి ఉంటుందని, అందుకనే స్థిరంగా మనం జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు. ప్రతి గ్రామంలో 10 మందికైనా సరిపడే సదుపాయాల్ని కల్పించాల్సి ఉంటుందని, క్వారంటైన్‌లో మంచి బెడ్లు, బెడ్‌ ‌షీట్లు, దిండ్లు, టాయిలెట్లు, మంచి భోజనం కూడా పెట్టాలన్నారు. క్వారంటైన్‌ ‌వద్ద శానిటేషన్‌ ‌వర్కర్లను కూడా పెట్టాలన్నారు. ప్రతి గ్రామంలోనూ ఈ సదుపాయాలు ఉండాలని సీఎం జగన్‌ అధికారులకు ఆదేశించారు. దాదాపు 11వేలకుపైగా ఉన్న గ్రామసచివాలయాల్లో కనీసం లక్షమందికి క్వారంటైన్‌ ‌సదుపాయాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని సీఎం తెలిపారు.ప్రస్తుతం నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ క్వారంటైన్‌ ‌సదుపాయాలు ఉన్నాయని సీఎం జగన్‌ ‌తెలిపారు. 25 వేల సింగిల్‌ ‌రూమ్స్, 7500 ‌డబుల్‌ ‌రూమ్స్ ఉన్నాయని, ఇందులో 40 వేల మంది వరకూ ఉండవచ్చుని సీఎం జగన్‌ ‌వెల్లడించారు. ఇవి కాకుండా డార్మిటరీస్‌ ‌కూడా ఉన్నాయని సదుపాయాలు బాగున్నాయా? లేదా? అన్న విషయాన్ని అధికారులు ఎప్పటికప్పుడు సక్ష, పర్యవేక్షణ చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ పక్రియ అంతా మన జీవితంలో కొన్ని నెలలపాటు నిరంతరంగా కొనసాగుతుందని అందుకనే జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సీఎం జగన్‌ ‌సూచించారు. సదుపాయాలు బాగుంటేనే ప్రజలు అక్కడకు వెళ్లగలుగుతారని అందుకే సదుపాయాలు బాగుండేలా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లపైనే ఉంటుందని సీఎం జగన్‌ ‌తెలియజేశారు. సదుపాయాలు లేకపోతే కలెక్టర్‌ ‌ద మచ్చ పడుతుందని, సిబ్బందిని పెట్టుకుని క్వారంటైన్‌ ‌సదుపాయాలపై దృష్టిపెట్టి ప్రతిరోజూ సక్ష చేయాలని సీఎం జగన్‌ ‌కలెక్టర్లకు సూచనలు ఇచ్చారు.

Leave a Reply