-దూరదర్శన్ డీజీ నంబూద్రిప్రసాద్
దూరదర్శన్ ద్వారా సినిమా ప్రపంచానికి పరిచయం కావడం మా అదృష్టం
– నటుడు అనుపమ్ ఖేర్
– గోవా ఐఎఫ్‌ఎఫ్‌ఐలో ఇఫీస్టా సంగీత, సాంస్కృతిక యాత్ర
గోవా, నవంబర్ 22: ఉపగ్రహ విప్లవం ఫలితంగా ఏర్పడిన వంశపారంపర్య ఛానల్ కార్యక్రమాలను ప్రజలు ఎప్పుడైనా చూడగలిగేలా చేతిలో ఇమిడిపోయే పరికరాలతో డిజిటల్ విప్లవం వైపు పయనిస్తోందని, డిమాండ్‌కనుగుణంగా దూరదర్శన్ అభివృద్ధి చెందుతూ వేవ్స్ ఓటీటీతో కొత్త డిజిటల్ దశలోకి ప్రవేశించిందని దూరదర్శన్ డైరెక్టర్ జనరల్ కె.సతీష్ నంబూద్రిపాద్ తెలిపారు. గోవాలోని డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఇండోర్ స్టేడియంలో శుక్రవారం సాయంత్రం దూరదర్శన్, వేవ్స్ ఓటీటీలు ఇఫీస్టా ప్రారంభోత్సవం ద్వారా ఐఎఫ్‌ఎఫ్‌ఐ 56వ ఎడిషన్ సంగీతం, సంస్కృతి, లైవ్ ప్రదర్శనల ద్వారా మనస్సును ఆహ్లాదపరిచే అద్భుత సంప్రదాయాన్ని కొనసాగించింది. వేవ్స్ ఓటీటీ కుటుంబాలకు సురక్షితమైన, ఆరోగ్యకరమైన వినోదాన్ని అందిస్తుంది అని నంబూద్రిప్రసాద్ అన్నారు. డిజిటల్ పరికరాలకు అతుక్కుపోతున్న జనరేషన్ జీ యువతరం దూరదర్శన్ ప్రాతినిధ్యం వహించిన లేదా ప్రాతినిధ్యం వహించే వారసత్వ బలాన్ని చూడటానికి దూరదర్శన్‌కు రావాలని మేం అభ్యర్థిస్తున్నాం అని కోరారు. ఒక మామూలు చలనచిత్రోత్సవం స్థాయి నుంచి ఓ ఘనవైన వేడుకగా భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (ఇఫి) అభివృద్ధి చెందుతూనే ఉందని, సినిమా, సంగీతం, జీవితాల మాయాజాలాన్ని ఒకచోట చేర్చే ఒక అద్భుత వినోద ప్రయాణంగా ఇది ముందుకు సాగుతోందని అన్నారు. గత ఏడాది ఈ సాంస్కృతిక ప్రయాణానికి మార్గనిర్దేశం చేసే బాధ్యతను ఇఫీస్టా సగర్వంగా చేపట్టి సంగీతం, కళలను ఇఫి ప్రయాణంతో జత చేసిందన్నారు. చల్లని సాయంత్రం వేళ ప్రముఖ కళాకారులంతా తమ నైపుణ్యాల వెలుగులను పంచుతూ వేదికను అలంకరించిన వారిలో గౌరవనీయ నటుడు అనుపమ్ ఖేర్, ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం.ఎం.కీరవాణి, అస్సాంకు చెందిన జాతీయ అవార్డు గ్రహీత, నటి ఐమీ బారుప్‌ా, ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు రవి కొట్టారకర, దక్షిణ కొరియాకు చెందిన మనోహరమైన స్వరం ఎం.పి.జేవోన్ కిమ్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా అనుపమ్ ఖేర్ తన గత అనుభవాలను గుర్తుచేసుకున్నారు. మనమంతా దూరదర్శన్ ద్వారా సినీ జీవితాన్ని ప్రారంభించామని, దూరదర్శన్ మనల్ని సినిమా ప్రపంచానికి పరిచయం చేయడం మన అదృష్టమని అంటూ తాను దానిని ఎన్నటికీ మరిచిపోలేననన్నారు. దూరదర్శన్ మన జీవితాల్లో నిలిచి ఉండే పరిమళం.. ఎప్పటికీ మనల్ని కౌగిలితో పెనవేసుకుని ఉంటుంది అన్నారు. ఇరు దేశాల మధ్య స్వర వారధిగా నిలుస్తూ దక్షిణ కొరియాకు చెందిన జేవోన్ కిమ్ అద్భుత వందేమాతర గేయాలాపనతో వేడుక ప్రారంభమైంది. తాను ఇక్కడకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. హృదయపూర్వక స్వాగతం పలికినందుకు అందరికీ ధన్యవాదాలు. భారత్- కొరియా మధ్య సినిమాలు, కంటెంట్ సహకారం కోసం తాను హృదయపూర్వకంగా ఎదురు చూస్తున్నాను అని ఆమె వ్యాఖ్యానించారు.
ప్రముఖ గాయకుడు, గేయ రచయిత ఓషో జైన్ రెండు గంటలపాటు ప్రదర్శన ఇచ్చారు.
తర్వాత ఏమిటి:
మరో మూడు సాయంకాలాల వేడుకలు
’ ఇఫీస్టా-2025లో నవంబర్ 22-24 తేదీల్లో మిగిలిన మూడు సాయంత్రాలు ఉచిత ప్రవేశంతోపాటు పలు ఫీచర్లను అందిస్తాయి
2వ రోజు (నవంబర్ 22) -నీతూ చంద్ర, నిహారిక రైజాదా హోస్ట్ చేశారు. బ్యాటిల్ ఆఫ్ ది బ్యాండ్స్.. ది బాండిట్స్ (ఇండియా), బీట్స్ ఆఫ్ లవ్ (ఇంటర్నేషనల్), ఇషా మాల్వియా హోస్ట్ చేశారు. అతిథి సురోన్ కా ఏకలవ్య ప్రతిభా సింగ్ బఘెల్‌తోపాటు ప్రదర్శన కారులు జాక్ అస్లాం, సుప్రియా పాథక్, రాహుల్ సోనీ, ప్రతీక్షా దేఖా, పికోసా మొహర్కర్‌లతో సెగ్మెంట్ వాప్‌ా ఉస్తాద్ ‘ఫోక్ అండ్ ఫ్యూజన్ – మిట్టీ కీ ఆవాజ్’ని అందిస్తూ వుసత్ ఇక్బాల్ ఖాన్ ప్రదర్శన.
3వ రోజు (నవంబర్ 23)- నిహారిక రైజాదా హోస్ట్ చేస్తారు
బ్యాటిల్ ఆఫ్ ది బ్యాండ్స్ ఎంహెచ్ 43 (ఇండియా), స్వస్తిక్ (ఇంటర్నేషనల్)లతో హర్ష్ లింబాచియా హోస్ట్ చేస్తారు.
సురోన్ కా ఏకలవ్య ప్రతిభా సింగ్ బఘేల్, ప్రతీక్షా దేకా, సాగర్ తివారీ, సుప్రియా పాఠక్‌లతో వాప్‌ా ఉస్తాద్ ‘సూఫీ అండ్ భక్తి – ఇష్క్ ఔర్ భక్తీ కీ ఏక్ సుర్’’ ప్రదర్శన
4వ రోజు (నవంబర్ 24)- నిహారిక రైజాదా హోస్ట్ చేస్తారు. బ్యాటిల్ ఆఫ్ ది బ్యాండ్స్ వైరాగిస్ (ఇండియా విజేతలు), నైట్స్‌తో హుస్సేన్ కువజెర్వాలా హోస్ట్ చేస్తారు. సురోన్ కా ఏకలవ్య ప్రతిభా సింగ్ బఘేల్, జాక్ అస్లాం, పికోసా మొహర్కర్, రాహుల్ సోనీలతో
దేవాంచల్‌కి ప్రేమ్ కథ %-% రజా మురాద్, అథర్ హబీబ్, కీర్తి నాగ్‌పురే, దినేష్ వైద్య, మిలన్ సింగ్, అదితి శాస్త్రి వంటి తారాగణంతో హిమాచలీ జానపద నృత్యాన్ని ప్రదర్శించే ప్రత్యేక లైవ్ ప్రదర్శన. వాప్‌ా ఉస్తాద్ ఫినాలే ప్రదర్శన ‘రాగా అండ్ సినిమా ఫ్యూజన్ – సుర్ సే సినిమా తక్’. సురోం కా ఏకలవ్య విభాగాన్ని గజేంద్ర సింగ్ రూపొందించగా వాప్‌ా ఉస్తాద్ విభాగాన్ని దిల్లీ ఘరానా సమర్పిస్తున్నారు. ప్రత్యేక అతిథి గాయకులతో సారేగామా ప్రదర్శన సాగనుంది. ఈ నాలుగు సాయంత్రాల వేడుకలు డీడీ భారతిలో ప్రత్యక్ష ప్రసారం అవుతున్నాయి. వేవ్స్ ఓటీటీలోనూ ప్రసారం చేస్తున్నారు. డీడీ నేషనల్‌లో ప్రత్యేక హైలైట్స్ ప్రసారం చేస్తున్నారు.
కార్యక్రమ వివరాలు:
తేదీలు: నవంబర్ 21-24, 2025
వేదిక: డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఇండోర్ స్టేడియం, గోవా
వేళలు: ప్రతిరోజూ సాయంత్రం 6 గంటల నుండి
ప్రవేశం: నవంబర్ 22-24 ప్రదర్శనలకు ఉచితం
ప్రత్యక్ష ప్రసారం: డీడీ భారతి, వేవ్స్ ఓటీటీ, డీడీ నేషనల్ (హైలైట్స్)
ఇఫీస్టా గురించిన మరింత సమాచారం కోసం: https://www.iffigoa.org/iffi-esta
ప్రేక్షకులనుద్దేశించి దూరదర్శన్ డీజీ చేసిన ప్రసంగం కోసం ఇక్కడ చూడండి
IFFI Website: https://www.iffigoa.org/
మరింత సమాచారం కోసం, దీనిపై క్లిక్ చేయండి:
PIB’s IFFI Microsite: https://www.pib.gov.in/iffi/56new/
PIB IFFIWood Broadcast Channel: https://whatsapp.com/channel/0029VaEiBaML2AU6gnzWOm3F
X Post Link: https://x.com/PIB_Panaji/status/1991438887512850647?s=20
X Handles: @IFFIGoa, @PIB_India, @PIB_Panaji
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



