Take a fresh look at your lifestyle.

నీళ్లు లేక వెలవెలబోతున్న సింగాయి కుంట చెరువు

చెరువులో నీళ్లు లేక వరి పొలాలు ఎండిపోతున్నాయి. గోదావరి నీళ్లు రాక కురవి మండల కేంద్రం శివారు సింగాయకుంట చెరువు నీళ్లు లేక ఎండిపోయింది అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల్లోని చెరువులు నిండి జలకలతో ఉంటే సింగాయకుంట లో మాత్రం నీరు లేక భోసిపోతుంది. నియోజకవర్గంలో ని చెరువులన్నీ నిండి అలుగులు పోస్తున్నాయి. గోదావరి నీళ్లు పక్కనుండి పోతున్న చెరువు కి నీరు వచ్చేందుకు అవకాశం లేకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎస్సారెస్పీ అధికారులు స్పందించి చెరువుకు నీరు వచ్చే మార్గం చేయాలని కోరుతున్నారు. ప్రజా ప్రతినిధులు చెరువుల నిండే దాకా గోదావరి జలాలు వస్తాయని చెప్పినప్పటికీ మండల కేంద్రానికి రెండు కిలోమీటర్ల దూరంలో రామచంద్రాపురం గ్రామం వెళ్ళు మార్గంలో ఉన్న ఈ చెరువుకు నీరు తీసుకువచ్చేందుకు ఎవరు ముందుకు రాకపోవడంతో పొలాలు ఎండు తున్నట్లు తెలిపారు.

- Advertisement -

ఇప్పటికైనా అధికారులు ప్రజా ప్రతినిధులు స్పందించి సింగాయకుంట చెరువు కి గోదావరి జలాలు వచ్చేందుకు కృషి చేయాలని రైతులు కోరుతున్నారు. చెరువు కింద ఆయకట్టు 60 ఎకరాలు ఉన్నట్లు రైతులు తెలిపారు. స్థానిక శాసనసభ్యులు డీఎస్‌ ‌రెడ్యానాయక్‌ అధికారులకు మండలంలో అన్ని చెరువులు నింపాలని గతంలోనే అధికారులను ఆదేశిం చారు అయినప్పటికీ వారు పట్టించుకోకపోవడంతో చెరువు నీళ్లు లేక ఎండి పోయిందని రైతులు తెలిపారు. కాగా, ఈ విషయమై ఏఈ ని ఫోన్‌ ‌లో సంప్రదించగా చెరువు కింద పొలాలు ఉన్న రైతులు ఎవరు నా దగ్గరకు రాలేదు చెరువుకు నీళ్లు రాలేదని నాకు తెలవదు రేపు వచ్చి చూస్తాను అని తెలిపారు.

Leave a Reply