Take a fresh look at your lifestyle.

మండుతున్న ఎండలు – రోడ్లపైకి రాని జనాలు

వడగాలులతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి – ఉక్కపోతతో తల్లడిల్లుతున్న జనం

వనపర్తి,మే,26(ప్రజాతంత్ర విలేకరి) : ఎండల తీవ్రతతో రోడ్ల ప్రజలు కనిపించకపోవడం ఎండాకాలంతో ఎండల తీవ్రత పెరగడం వలన ఉదయం 8 గంటల నుంచే ప్రజలు రోడ్ల పైకి రాకపోవడం తో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగడం వలన వడగాలులు పెరగడఎ ఎండల తీవ్రతతో ప్రజలు బయటకు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. ప్రజలు రోడ్లపైకి రావాలంటేనే బయపడుతున్నారు. వృద్ధులు చిన్న పిల్లలు ఇంటికే పరిమితమవుతున్నారు. గత వారం రోజుల నుంచి వనపర్తి జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరగడంతో జనం బేజారవుతున్నారు. పెబ్బేరు కొత్తకోట ఆత్మకూరు గోపాల్‌పేట తదితర పట్టణ కేంద్రాల్లో ప్రాంతాల్లోని 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడం జిల్లా ప్రజలు బెంబేలెత్తుతు న్నారు. ఎండల తీవ్రతతో పిల్లలు వృద్దులు ఉక్కపోతకు అల్లాడుతున్నా రు. ఇదే సమయంలో ప్రజలు రోడ్లపైకి రావాలంటేనే జంకుతున్నారు. ఎండల తీవ్రత ఇంకా పెరుగుతుండడంతో ఎం జరుగుతుందేనని బయపడుతున్నారు. రాత్రి వేళల్లో కరెంటు పోతే ఉక్కపోతతో అల్లాడుతు జనాలు భయపడుతున్నారు.
వనపర్తిలో ఎండల తీవ్రతతో రక్తపోటు బారిన పడి పక్షవాతానికి గురౌవుతున్నారని అసలే కరోనా వ్యాధి తో ఆసుపత్రికి వెళ్లాంటేనే భయపడుతున్న జనం డాక్టర్లు ఓపిలు తీసుకోక ప్రజలు ఎంతో భయాందోళనకు రోహిణి కార్తి రావడంతో తీవ్రంగా ఎండలు ఒకేసారి పెరగడం వల్ల ఉక్కపోతలు పెరిగి తట్టుకోలేని పరిస్థితిలో వృద్దులు తమ పరిస్థితులను చెప్పుకోలేని ధీనావస్థలో ఉన్నారు.జిల్లాలో రెండు రోజుల క్రితం గోపాల్‌పేట మండల కేంద్రంలో వడదెబ్బ తగిలి ఇద్దరు మృతి చెందారు. దీంతో ఆసుపత్రుల్లో డాక్టర్లు ఎండ వేడికి తట్టుకోలేక కేసులు నమోదవుతున్నట్లు వాపోతున్నారు. ప్రజలు ఎండలకు వెళ్లడంతో బిపి లు షుగర్‌లు ఉన్నవారు ఈ ఎండల వేడిమికి తట్టుకోలేక ఆసుపత్రులపాలు అవుతున్నట్లు డాక్టర్లు సూచిస్తున్నారు. అందుకు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎండలకు వెళ్లకుండా పిల్లలను వృద్దులను కాపాడుకోవాలని ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని పనులకు వెళ్లాలని డాక్టర్లు ప్రజలకు సూచనలు ఇస్తున్నారు. అత్యవసర పరిస్థితిలో మాత్రమే ఇండ్ల నుండి బయటకు రావలిసిందిగా వడదెబ్బలు తగలకుండా నీటిని సమృద్దిగా తీసుకోవాలని సలహాలు ఇస్తున్నారు. ఎండల తీవ్రతనుండి అప్రమత్తం గా ఉండాలని అధికారులు డాక్టర్లు సూచనలు చేస్తున్నారు.

Leave a Reply