Take a fresh look at your lifestyle.

చెత్త అతిపెద్ద సమస్య

  • ఎక్కడపడితే అక్కడ పడేస్తే రూ. 500 జరిమానా
  • చెట్లను నరికేస్తే రూ. 10 వేల జరిమానా , జైలు
  • సిద్దిపేటలో గొప్ప మార్పు తెస్తాం : మంత్రి హరీష్‌రావు

సిద్ధిపేటలోని 14 వ వార్డులో మంగ ళవారం జరిగిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ..సిద్ధిపేట లో గొప్ప మార్పు వస్తున్నది.. గతంలో తాగునీరు లేక పిల్లనివ్వాలంటే భయపడే వారన్నారు.హోసింగ్‌ ‌బోర్డు కాలనీలో సమీకృత మార్కెట్‌ ‌ను నిర్మించుకోవడం సంతోషంగా ఉంది.పట్టణం లో అనేక సౌకర్యాలు కల్పించాం. మోడల్‌ ‌రైతు బజార్‌,ఇం‌టిగ్రేటెడ్‌ ‌మార్కెట్‌ ‌ను నిర్మించాం..సిద్ధిపే కోమటి చెరువును అద్భుతంగా తీర్చిదిద్దాం అన్నారు. రంగనాయక సాగర్‌ ‌ను పర్యాటక కేంద్రంగా మార్చుతాం అన్నారు. అన్ని బాగానే ఉన్నా చెత్త అతి పెద్ద సమస్యగా మారింది.దోమలు,ఈగలతో విషజ్వరాలు ప్రబలుతున్నాయి. మోరీల నీళ్లు బయట కనబడకుండా అండర్‌ ‌గ్రౌండ్‌ ‌డ్రైనేజీ ని ఏర్పాటు చేస్తున్నాం. మన ఇంట్లో ఉన్న చెత్తను బయట రోడ్డు మీద,ఇంటి పక్కన పడేస్తున్నారన్నారు. మన ఇల్లు ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో..మన గల్లీ ని కూడా అంత బాగా ఉంచుకోవాలి. ప్లాస్టిక్‌ ‌ను విచ్చల విడిగా వాడుతున్నారు. ప్రతిరోజు సిద్దిపేటలో 40 టన్నుల చెత్త వస్తున్నది. ఇంత చెత్తను ఎక్కడ వెయ్యాలన్నారు.

ఇంట్లో తడి చెత్తను,పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలి.తడి చెత్త వేరు చేసి ఇస్తే ఎరువులు తయారు చేసే అవకాశం ఉంది. పొడి చెత్తతో కరెంటు తయారు చేయడానికి వినియోగిస్తాం. రేపటి భవిషత్తు తరాలకు,పిల్లలకు గుట్టలు గుట్టలు చెత్తను,దోమలు, ఈగలు..అంటు రోగాలను ఇచ్చి వెల్దామా…ఆరోగ్య కరమైన వాతావరణం ఇద్దామా మీరే ఆలోచించుకోండన్నారు. కొత్త మున్సిపల్‌ ‌చట్టం ప్రకారం ప్రజా ప్రతినిధులు నడుచుకోక పోతే పదవులు ఊడుతాయి.చెత్త సేకరణకు మరిన్ని వాహనాలు కొనుగోలు చేస్తాం. చెత్తను పక్కకు వేస్తే 500 రూపాయల జరిమాన విధిస్తాం.ప్రజలు సహరించకపోతే క్షమించరాని నేరం అవుతుందన్నారు. చెట్లను కొట్టేస్తే 10 వేల రూపాయల జరిమానా విధిస్తాం..అవసరమైతే జైలుకు పంపుతామని హెచ్చరించారు.మనకు తెలియకుండానే మనం ప్లాస్టిక్‌ ‌ను ఆహారం లో భాగం చేసుకుంటున్నాం.  ప్లాస్టిక్‌ ‌ను నిషేధిద్దాం..సిద్ధిపేటను ప్లాస్టిక్‌ ‌రహిత సిద్ధిపేట గా మార్చుదాం అన్నారు. పెళ్లిళ్లలో,ఫంక్షన్‌ ‌లలో ప్లాస్టిక్‌ ‌ప్లేట్‌ ‌లను వాడడం బంధు చేద్దాం..వాడ వాడలా స్టీల్‌ ‌బ్యాంక్‌ ‌లను ఏర్పాటు చేద్దాం. ప్లాస్టిక్‌ ‌వాడని పెళ్లికి వెళ్తా …భోజనం చేస్తా అన్నారు.ప్లాస్టిక్‌ ‌రహిత,ఆరోగ్య సిద్ధిపేట ను నిర్మిద్దాం. అభివృద్ధి అంటే బిల్డింగులు కట్టడం..రోడ్లు వేయడమే కాదు..ప్రజలు విద్యా పరంగా,ఆరోగ్యం గా ఉన్నప్పుడే అభివృద్ధి జరిగినట్టు. సిద్ధిపేట ప్రజల కోసం ముల్టి ప్లక్స్ ‌నిర్మిస్తాం.బెంగుళూరు లోని హెచ్‌ఎస్బి కాలనీ లా సిద్ధిపేట మారాలి..అక్కడ మార్పు తెచ్చిన డాక్టర్‌ ‌శాంతి ని సిద్ధిపేట కు రప్పిస్తాం..మహిళలకు అవగాహన కల్పిస్తాం. సిద్ధిపేట ను చెత్త రహిత పట్టణం గా మార్చేందుకు ప్రజలంతా సహకరించాలి…ఆదర్శంగా తీర్చి దిద్దాలని హరీష్‌ ‌రావు అన్నారు.

Tags: waste, problem, minister harish rao, siddipet 14 ward

Leave a Reply