Take a fresh look at your lifestyle.

నేనున్నాను ‘‘అమ్మ’’లా ఆదరిస్తూ ‘‘నాన్న’’లా ధైర్యమిస్తున్న కలెక్టర్‌ ‌నిఖిల

‘‘అమ్మ’’లా ఆదరిస్తూ ‘‘నాన్న’’లా దైర్ఘ్యమిస్తూ మీ వెంట నేనున్నానంటూ అండగా నిలిచిన జిల్లా కలెక్టర్‌ ‌కె నిఖిల మంగళవారం నర్మెట మండలంలోని వెల్దండ గ్రామాన్ని సందర్శించా రు. వెల్దండ గ్రామానికి చెందిన ఖాజుద్దీన్‌ ‌ఢిల్లీలోని మర్ఖజ్‌కు వెళ్లిరావడంతో కరోనా పాజిటివ్‌ ‌వచ్చినవిషయం విధితమే. పల్లెటూర్లలో ఒకరికి ఒకరు తోడుగా నీడగా మనస్పూర్తి స్నేహంగా ఉంటున్న తరుణంలో ఆ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ ‌రావడంతో 75 మందిని కరోనా బాధి తులుగా అనుమానించి వైద్య పరీక్షల నిమిత్తం జిల్లా కేంద్రానికి తరలించి క్వారంటైన్‌లో ఉం చిన విషయం తెలిసిందే. వెల్దండ అంటేనే బంగా రు దండ, అందరికి శక్తినిచ్చే అండగా నిలిచే గ్రామానికి కరోనా భయం రావడంతో చిగురాకు గా వాడిపోయింది. పాజిటివ్‌ ‌వచ్చిన సదరు వ్యక్తితోపాటు 75 మందిని క్వారంటైన్‌కు తరలించి ఎప్పటికపుడు వారిపై జిల్లా కలెక్టర్‌ ‌పర్యవేక్షణ చేస్తూ, ప్రజల క్షేమమే ముఖ్యమనే సదుద్దేశంతో క్వారంటైన్‌ను సందర్శిస్తూ వైద్యుల ను, వివిధ శాఖల అధికారులను అప్రమత్తం చేస్తూ పాజిటివ్‌ ‌వచ్చిన వ్యక్తికి నెగిటివ్‌గా వచ్చేం దుకు సరైన వైద్య చికిత్స నిర్వహించి, క్వారం టైన్‌లో ఉన్న 75 మందిని ఎలాంటి కరోనా వైరస్‌ ‌వారి దరిచేరలేదనే లోకంనమ్మే విధంగా చర్యలు తీసుకొని వెల్దండ ప్రజలకు వెన్నుదన్నుగా నిలిచిన ఘనత జిల్లా కలెక్టర్‌కే దక్కిందనే విషయంలో సందేహమే లేదు.

వెల్దండ గ్రామా నికి చెందిన 75 మంది వ్యవసాయ పనులలో నిమగ్నమై ఉండేవారు. అంతేగాకుండా పాడి రైతులు పంటకోతకు వచ్చే సమయంలో వారిని క్వారంటైన్‌కు తరలించడంలో జిల్లా కలెక్టర్‌ ‌తీసుకున్న చర్య మామూల విషయం కాదని అంగీకరించక తప్పదు. అన్ని వదిలిపెట్టి జిల్లా కలెక్టర్‌ ఆదేశాలను పాటించి క్వారంటైన్‌కు తరలిరావడం, తిరిగి వెళ్లడంతో పూర్తి కాలేదని ఆ గ్రామానికి నేను అండగా ఉన్నాననే దైర్ఘ్యం అందించేందుకు గ్రామాన్ని సందర్శించడంతో మరొకసారి జిల్లా కలెక్టర్‌ ‌ప్రత్యేకతను చాటుకు న్నారు. వెల్దండ గ్రామానికి రాకూడని ఆపద వచ్చిందని జిల్లా కలెక్టర్‌ ‌బాధ్యతతో వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ తిరిగి కరోనా వైరస్‌ ‌రాకుండా జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు అవగాహన కల్పించడంలో జిల్లా కలెక్టర్‌ ‌సఫలీకృతులయ్యారు. మీరు అదైర్ఘ్యపడవద్దని మీ వెంట మేమున్నామంటూ, ఆపదలో ఆదుకోవ డంలో వెనుకంజ వేయమంటూ ప్రజలకు భరోసాను ఇవ్వడంలో జిల్లా కలెక్టర్‌ ‌సఫలీకృ తులయ్యారు. అంతేగాకుండా అధికారులందరిని అప్రమత్తం చేస్తూ వెల్దండ గ్రామానికి పట్టిన కరోనా వైరస్‌ ‌మహమ్మారిని తరిమికొట్టాల్సిన సమయం ఆసన్నమైందని దశదిశ నిర్దేశించారు. జిల్లా కలెక్టర్‌ ‌వెంట ఆర్డీవో మధుమోహన్‌, ‌డిప్యూ టీ డీఎంహెచ్‌వో అశోక్‌ ‌కుమార్‌, ‌డీపీఆర్‌వో ప్రేమలత, తహశిల్దార్‌ ‌మురళీధర్‌ ‌రావు, ఎస్‌ఐ ‌పరమేశ్వర్‌, ‌పీఏసీఎస్‌ ‌చైర్మన్‌, ‌వరంగల్‌ ‌డీసీసీబీ డైరక్టర్‌ ‌కేసిరెడ్డి ఉపేందర్‌ ‌రెడ్డి, గ్రామ సర్పంచ్‌ ‌నర్ర వెంకటరమణారెడ్డి, వైస్‌ ఎం‌పీపీ మంకెన ఆగారెడ్డి, మాజీ ఎంపీటీసీ జొన్నగోని కిష్టయ్యతో పాటు వివిధ శాఖల అధికారులున్నారు.

- Advertisement -

అదైర్ఘ్యపడవద్దు…ప్రతిగింజను కొనుగోలు చేస్తాం
వరిధాన్యం విషయంలో దేశానికి అన్నంపెట్టే రైతన్న అదైర్ఘ్యపడవద్దని, పండించిన ప్రతి గింజను మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని జిల్లా కలెక్టర్‌ ‌కె నిఖిల అన్నారు. మంగళవారం జిల్లాలోని జనగామ, నర్మెట మండలాలలోని వివిధ గ్రామాలలో జిల్లా కలెక్టర్‌ ఆకస్మిక పర్యటన చేశారు. కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న వరిదాన్యాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తెజావత్‌ ‌గోవర్థన్‌, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, తహశిల్దార్లు పాల్గొన్నారు.

ఆపత్కాలంలో ఆదుకోవడం ఆదర్శనీయం
కరోనా కష్టకాలంలో ఆదుకోవడం ఆదర్శనీయ మని జిల్లా కలెక్టర్‌ ‌కె.నిఖిల అన్నారు. మంగళ వారం జిల్లా కలెక్టర్‌ ‌క్యాంపు కార్యాలయంలో నర్మెట పీఏసీఎస్‌ ‌చైర్మన్‌, ‌డీసీసీబీ జిల్లా డైరక్టర్‌ ‌కేసిరెడ్డి ఉపేందర్‌రెడ్డి కరోనా సహాయనిధికి రూ.10వేల విలువగల చెక్కును విరాళంగా జిల్లా కలెక్టర్‌ ‌కె నిఖిలకు అందించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో మధుమోహన్‌, ‌డీసీవో మద్దిలేటి, నర్మెట పీఏసీఎస్‌ ‌సీఈవో వెంకటే శ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply