Take a fresh look at your lifestyle.

యుద్ధం..శాంతి..

యుద్ధం ఎప్పుడూ ….
ఒక కఠినమైన
చేదు నిజం
యుద్ధం ఎప్పుడూ దుఃఖకారకం
యుద్ధం ఎప్పుడూ….
ఒక విధ్వంసహేతువు
యుద్ధం ఎప్పుడూ వినాశకరం!
యుద్ధం కారకులను విడిచిపెట్టి
అమాయకులను నిర్జిస్తుంది
యుద్ధం కుటుంబాలను
కకావికలం గావిస్తుంది!
యుద్ధం ఒకరికి గెలుపైతే..
మరొకరికి ఓటమి
యుద్ధం ఒకరికి విజయ గర్వాన్నిస్తే ఇంకొకరికి వీరమరణాన్ని ప్రసాదిస్తుంది!
యుద్ధం ఒకరికి వరమాల
ఇంకొకరికి శవమాల!
కానీ కొన్ని యుద్ధాలు మంచివి..
నీ లోపలి అరిషడ్వర్గాలతో నిత్యం యుద్ధం నీకు మహాత్మతను ప్రసాదిస్తుంది!
యుద్ధం సామాజిక దౌర్భల్యాలపై చేస్తే..
నీ తోటి వారికి శ్రేయస్కరం!
యుద్ధం నీలోని అహంకారంతో చేస్తే అది అవుతుంది నీ మనుగడకే మూలధనం !
యుద్ధం అన్యాయాక్రమాలపై చేస్తే అవుతావు
నువ్వో సంఘసంస్కర్త
యుద్ధాన్ని ఎప్పుడూ ఆహ్వానించరాదు!
శాంతి యే ధనం
శాంతి యే వృద్ది
శాంతి యే లోక కల్యాణం
శాంతి యే మనఃశాంతి
శాంతి యే కోటి వీణాతంత్రుల వాదన
శాంతి యే దైవత్వం
శాంతియే సమృద్ధి
శాంతి యే సజీవత..
ప్రపంచం శాంతి దిక్కున పయనిస్తే
ఆ శుభాగమనానికై ఎదుచూసే చక్రవాన్నే నేను!
ఓం శాంతి శాంతి శాంతిః!

– డా.స్రవంతి ఐతరాజు,
సైకాలజిస్ట్ ,‌తిరుపతి

Leave a Reply