Take a fresh look at your lifestyle.

కొరోనా మహమ్మారిపై పోరు..

“ప్రభుత్వ పరంగా తీసుకునే చర్యల కంటే ప్రజలే స్వయం నియంత్రణ పాటించాల్సిన అవసరం ఎక్కువగా ఉంది. భౌతిక దూరం పాటించడం, బయటకు వెళ్లేటప్పుడు మాస్కు ధరించడం వటి చర్యలు కచ్చితంగా పాటించాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉంది. త్వరలో ప్రజారవాణా ప్రారంభం కానుంది.. లాక్‌ ‌డౌన్‌ ‌దశ నుంచి దేశం ఇప్పడు అన్‌ ‌లాక్‌ ‌దశలోకి ప్రవేశిస్తున్నది. తెలంగాణ రాష్ట్రం కూడా ఆ దిశగానే అడుగులు వేస్తున్నది. మహమ్మారితో పోరాటం…అదే సమయంలో సాధారణ కార్యకలాపాలకు అవరోధం లేకుండా చూడటం అనే రెండంచుల పదునైన ఆయుధంలో జరుగుతున్న పోరాటం ఇది. ఈ పోరాటంలో ప్రతి పౌరుడూ బాధ్యతాయుతంగా భాగస్వామి కావలసిన అవసరం ఉంది.”

కొరోనా మహమ్మారి ప్రప ంచాన్ని గడగడ లాడి స్తోంది. ప్రపంచ దేశాలన్నీ దాదాపుగా కరోనా కోరల్లో చిక్కి విలవిలలాడుతున్నాయి. భారత్‌ అం‌దుకు మినహాయింపు కాదు. అలాగే తెలంగాణ రాష్ట్రం కూడా..! కరోనా విస్తరణ భారత్‌ ‌లో పెరుగుతున్న తీరు చూస్తుంటే…మహమ్మారి జన సాంద్రత అధికంగా ఉండే మహానగరాలపై (మెట్రోపొలిటిన్‌) ఎక్కువ ప్రభావం చూపుతున్నదని అర్ధమౌతుంది. భారత్‌ ‌లో మెట్రోపొలిటిన్‌ ‌నగరాలలో కరోనా తీవ్రత భయం గొల్పే రీతిలో ఉంది. ముంబై, పూణె,చెన్నై, కోల్‌ ‌కతాలలో కరోనా వ్యాప్తి వేగం చూస్తుంటే ఇది అవగతమౌతుంది. అయితే తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ ‌లో మాత్రం ఆ తీవ్రతకు అడ్డుకట్ట వేయడంలో కేసీఆర్‌ ‌ప్రభుత్వం సఫలీకృతమైంది. మహమ్మారి వైరస్‌ ‌వ్యాప్తి విషయంలో భవిష్యత్‌ ‌లో అది సృష్టించే విలయాన్ని, వ్యాప్తి తీవ్రతను ముందుగానే గుర్తించిన కేసీఆర్‌ ‌దేశంలో మరే ఇతర రాష్ట్రం కంటే తొలి రెండు దశల లాక్‌ ‌డౌన్‌ ‌ను రాష్ట్రంలో అత్యంత కఠినంగా అమలు చేశారు. పరీక్షల సంఖ్య విషయంలో తెరాస సర్కార్‌ ‌పై వస్తున్న విమర్శలలో కూడా పస లేదు. దేశ వ్యాప్తంగా ఒకటి రెండు రాష్ట్రాలు వినా అన్ని రాష్ట్రాల సగటు కరోనా నిర్ధరణ పరీక్షల రేటుకు తెలంగాణ ఎన్నడూ తగ్గలేదు. సహజంగానే లాక్‌ ‌డౌన్‌ ‌నిబంధనల సడలింపులతో…వలస కార్మికుల రాక, విదేశాల నుంచి రాకతో దేశంలో కరోనా వ్యాప్తి వేగం పుంజుకుంది. అందుకు తెలంగాణ కచ్చితంగా మినహాయింపు. గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌ను మినహాయిస్తే రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలలో కరోనా వ్యాప్తి కట్టడి సంతృప్తికరంగా ఉంది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ స్వయంగా ప్రకటించింది. కేంద్ర బృందం తెలంగాణలో పర్యటించి కూడా తెలంగాణ కరోనా కట్టడి విషయంలో అనుసరిస్తున్న విధానాలను ఇతర రాష్ట్రాలు కూడా అనుసరించాల్సిందిగా సిఫారసు చేసింది. కరోనా కట్టడి కోసం లాక్‌ ‌డౌన్‌ ‌విధిస్తూ కేంద్రం ప్రకటన చేసిన వెంటనే కేసీఆర్‌ ‌పేదల కష్టాలపై స్పందించారు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఆహారం లేక ఇబ్బంది పడకూదన్న లక్ష్యంతో వేగంగా నిర్ణయాలు తీసుకున్నారు. పేదలకు బియ్యం పంపిణీ, నగదు బదలీ వంటి చర్యలతో రాష్ట్రంలో పేదలను ఆదుకోవడానికి చర్యలు తీసుకున్నారు. కరోనా ఆసుపత్రులు, బాధితులకు మెరుగైన వైద్య చికిత్స వంటి విషయాలలో ఎక్కడా రాజీ పడలేదు. ఇప్పటికీ దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే భాగ్య నగరంలో కరోనా కట్టడిలోనే ఉందంటే అందుకు కారణం ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ ‌ముందు చూపుతో తీసుకున్న నిర్ణయాలే కారణం. అయితే కేంద్రం సడలింపుల బాట పట్టడం….లాక్‌ ‌డౌన్‌ ‌కారణంగా రాష్ట్రాలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను సరిదిద్దేందుకు చర్యలు తీసుకోకపోవడం వంచి చర్యలతో కేంద్రమే తెలంగాణ పోరాటాన్ని నీరుగార్చే విధంగా వ్యవహరించిందని చెప్పాలి.

బతికుంటే బలుసాకు తిని బతకొచ్చు అంటూ కేసీఆర్‌ ‌రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన భరోసా వారిలో స్థైర్యాన్నీ ధైర్యాన్నీ నింపింది. లాక్‌ ‌డౌన్‌ ‌నాలుగు పూర్తి అయిన తరువాత కేంద్రం ఇచ్చిన సడలింపులు కరోనా కట్టడిలో భారత పోరాటాన్ని నీరు గార్చాయనడంలో సందేహం లేదు. హైదరాబాద్‌ ‌మహానగరం వినా మిగిలిన రాష్ట్ర మంతా దాదాపు కరోనా ఫ్రీ అన్న స్థాయికి చేరుకుంది. హైదరాబాద్‌ ‌నగరంలో కరోనా కట్టడిలోకి రాలేదు సరికదా రోజు రోజుకూ విజృంభిస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది.ఒక్క హైదరాబాద్‌ అని మాత్రమే కాదు…దేశంలో మెట్రోపాలిటిన్‌ ‌నగరాలలో కరోనా కట్టడికి ప్రత్యేక వ్యూహాలు అవలంబించాల్సిన అవసరం ఉంది. కేసీఆర్‌ అం‌దరి కంటే ముందుగానే కఠినమైన చర్యలతో… కట్టుదిట్టంగా లాక డౌన్‌ ‌ను జూన్‌ 5‌వ తేదీ వరకూ కొనసాగిస్తేనే మేలని చెప్పారు. లాక్‌ ‌డౌన్‌ ‌కొనసాగించక తప్పదని మొదటి నుంచీ చెబుతూ వస్తున్నారు. అదే జరుగుతోంది. అయితే కేంద్రం రాష్ట్రాలను ఇతోధికంగా ఆదుకుంటే మాత్రమే రాష్ట్రాలు లాక్‌ ‌డౌన్‌ ‌ను సమర్ధంగా అమలు చేయగలుగుతాయని కూడా ఆయన కుండబద్దలు కొట్టారు. అయితే కేంద్రం రాష్ట్రాలను ఆదుకునే విషయంలో రాజకీయ లాభ నష్టాల బేరీజులో మునిగి తేలడం వల్లనే లాక డౌన్‌ ‌సడలింపులు అనివార్యమయ్యాయని అమర్త్య సేన్‌ ‌వంటి నిపుణులు చెప్పారు. కేసీఆర్‌ ‌స్వరమే అది. రాష్ట్రంలో రైతాంగం ఇబ్బందులు పడకుండా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల వ్యవసాయ రంగం కరోనా కల్లోల పరిస్థితుల్లో సైతం పచ్చగా ఉంది. వలస కార్మికులను ఆదుకునే విషయంలో కూడా కేసీఆర్‌ ‌సర్కార్‌ ‌ముందు చూపుతో వ్యవహరించడం వల్లనే ఇక్కడ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆందోళనలు తక్కువగా ఉన్నాయి. కరోనా కల్లోలం నుంచి గట్టెక్కాలంటే కేంద్రం సహకారం అవసరమనీ కేసీఆర్‌ ఇప్పటికే పలుమార్లు చెప్పారు. కరోనా విజృంభన పరిస్థితుల్లో కేంద్రం కేసీఆర్‌ ‌సూచనలను పట్టించు కోవలసిన అవసరం ఎంతైనా ఉంది. రాష్ట్రంలో కరోనా కట్టడి విషయంలో కేసీఆర్‌ ‌ముందు నుంచీ సీరియస్‌గా వ్యవహ రించారు. బతికుంటే బలుసాకు తినొచ్చు.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి తరు వాత ఆలో చిద్దాం.. కరోనా మహమ్మారిని తరిమి కొట్టడమే ప్రథమ లక్ష్య అంటూ ఆయన తీసు కున్న నిర్ణయం సత్ఫలితాలను ఇచ్చింది..

అయితే సడలింపుల నేపథ్యంలో తెలంగాణలో ముఖ్యంగా జీహెచ్‌ఎం‌సీ పరిధిలో కరోనా వ్యాప్తి అనూహ్య వేగంతో పెరుగుతున్నది. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు చెందిన వలసకూలీల రాక, వందే భారత్‌ ‌మిషన్‌ ‌లో భాగంగా విదేశాల నుంచి రాష్ట్రానికి రాకలు పెరిగిన నేపథ్యంలో కేసుల పెరుగుదల సాధారణమేనని భావించినా…వ్యాప్తి కట్టడికి కొన్ని కఠిన చర్యలు అనివార్యం. అయితే ప్రభుత్వ పరంగా తీసుకునే చర్యల కంటే ప్రజలే స్వయం నియంత్రణ పాటించాల్సిన అవసరం ఎక్కువగా ఉంది. భౌతిక దూరం పాటించడం, బయటకు వెళ్లేటప్పుడు మాస్కు ధరించడం వటి చర్యలు కచ్చితంగా పాటించాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉంది. త్వరలో ప్రజారవాణా ప్రారంభం కానుంది.. లాక్‌ ‌డౌన్‌ ‌దశ నుంచి దేశం ఇప్పడు అన్‌ ‌లాక్‌ ‌దశలోకి ప్రవేశిస్తున్నది. తెలంగాణ రాష్ట్రం కూడా ఆ దిశగానే అడుగులు వేస్తున్నది. మహమ్మారితో పోరాటం…అదే సమయంలో సాధారణ కార్యకలాపాలకు అవరోధం లేకుండా చూడటం అనే రెండంచుల పదునైన ఆయుధంలో జరుగుతున్న పోరాటం ఇది. ఈ పోరాటంలో ప్రతి పౌరుడూ బాధ్యతాయుతంగా భాగస్వామి కావలసిన అవసరం ఉంది. కరోనా ఒక రియాలిటీ. సాధ్యమైనంత తక్కువ ప్రాణనష్టంతో ఈ పోరాటంలో గెలవాల్సిన అవసరం ఉంది. కనుకనే జనం స్వయం కట్టడి విదానాలను అనుసరించాల్సి ఉంటుంది. క్వారంటైన్‌ ‌ప్రాంతాలలో నిబంధనలు కఠినంగా ఉంటాయని ప్రభుత్వం ఇప్పటికే చెబుతోంది. మానవాళి గతంలో ఎన్నడూ ఇటువంటి పరిస్థితి ఎదుర్కొన్నది లేదు. కంటికి కనిపించని మహమ్మారితో జరుగుతున్న ఈ పోరాటంలో విజయం సాధించి తీరాలి. మానవాళి మనుగడకు పెనుముప్పుగా పరిణమించిన ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు సమష్టి వ్యూహం అవసరం.

తెలంగాణ సర్కార్‌ ‌కరోనా కట్టడి విషయంలో రాజీలేని విధానాన్నే అవలంబిస్తోంది. ఇందుకు ప్రజా సహకారం కూడా అవసరం. జనం స్వచ్ఛందంగా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. కరోనా పరీక్షల విషయంలో కూడా జనం స్వచ్ఛందంగా ముందుకు రావాల్సి ఉంటుంది. లక్షణాలు కనిపించగానే…ఎవరంతట వారే ముందుకు వచ్చి పరీక్షలు చేసుకోవలసి ఉంటుంది. కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య, వేగం పెరిగితేనే మహమ్మారిని కట్టడి చేయడానికి అవకాశం ఉంటుందన్నది ప్రతి ఒక్కరూ గుర్తెరగాల్సిన తరుణమిఃది. కరోనా నిరోధక వ్యాక్సిన్‌ ‌కోసం ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు నిర్విరామంగా కృషి చేస్తున్నారు. వారిపై ఒత్తిడి తగ్గించాల్సిన బాధ్యత ప్రజలే స్వచ్ఛందంగా స్వీకరించాలి. కేసుల సంఖ్యను పరిమితం చేసే విధంగా స్వయం నియంత్రణ పాటించాలి. వ్యాక్సిన్‌ ‌వచ్చే వరకూ గతంలోలా సామూహిక సామాజిక కార్యక్రమాలకు అవకాశం ఉండదని తెలుసుకోవాలి. ఒక్కడిగా నిలవ డమంటే…పోరాటంలో సామూహిక శక్తిగా మారడమేనని అందరూ గుర్తించాల్సిన అవసరం ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రపంచమంతా ఒక్కటై ఒక మహమ్మారితో పోరాడుతోంది. ఈ పోరాటంలో ప్రతి వ్యక్తీ సైనికుడే. అందుకే సరిహద్దుల్లో దేశ రక్షణ విధులు నిర్వర్తించే జవాన్‌ ఎం‌త అప్రమత్తంగా ఉంటాడో…ప్రతి పౌరుడూ అలాగే కరోనా వ్యాప్తి నిరోధక యుద్ధంలో అంతే అప్రమత్తంగా ఉండాలి. అంది సామాజిక బాధ్యతగా గుర్తించాలి. మానవాళి మనుగడకు ఏర్పడిన ముప్పును తప్పించే ఈ మహత్తర యుద్ధంలో ప్రతి ఒక్కరూ ఒక సైనికుడై ముందుకు సాగాలి.

malleswar sangaani
డా।। మల్లేశ్వర్‌ ‌సంగాని
జర్నలిస్టు డిపార్ట్‌మెంట్‌ ‌హెడ్‌, ‌కాకతీయ యూనివర్సీటీ, వరంగల్‌, 9866255355

Leave a Reply