Take a fresh look at your lifestyle.

మహమ్మారిపై యుద్ధభేరి

అతి స్వల్పకాలంలో ప్రపంచాన్ని చుట్టివేసిన మహమ్మారిగా కొరొనా వైద్యశాస్త్ర చరిత్రలో నమోదు చేసుకున్నది. ఒక్కసారి సునామీలా విరుచుకపడిన కొరోనా బారి నుండి ప్రజలను కాపాడుకోవడంలో ఇటలీ, స్పెయిన్‌, ఇం‌గ్లండ్‌, అమెరికా లాంటి ధనవంత దేశాలు చతికిలబడిపోయాయి. టెస్టింగ్‌ ‌కిట్స్, ‌వైద్యపరికరాలు, రక్షణ కవచాలు సరిపడనంతగా ఆయా దేశాలలో లేకపోవడం వల్ల సంక్షోభం దాపురించింది. భారత్‌లాంటి అధిక జనాభా, జనసాంద్ర, సానిటేషన్‌, ఆరోగ్య అవస్థాపనా సౌకర్యాల లేమి ఉన్న దేశంలో కొరానా కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌ ‌దశలోకి చేరితే ఊహించనంత జననష్టం సంభవించే అవకాశమున్నది.”

కొరోనా వైరస్‌ ‌మహమ్మారి గత మూడు నెలలుగా హైపర్‌ ‌సోనిక్‌ ‌వేగంతో ప్రపంచాన్ని చుట్టివేస్తున్నది. ఒక కణం సహజ పరిమాణంను ఇరవైవేల రెట్లు విస్తరించి చూపెట్టే శక్తివంత ఎలక్ట్రాన్‌ ‌సూక్ష్మదర్శిని ద్వారా మాత్రమే ఈ అతి సూక్ష్మజీవి కోవిడ్‌-19‌ని చూడగలము. గతంలో జరిగిన రెండు ప్రపంచయుద్ధాలలో జరిగిన నష్టం కంటే అనేక రెట్లు జీవన విధ్వంసం కొరోనా మహమ్మారి వలన జరుగుతున్నదని సామాజిక శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాస్త ఆలస్యంగానైనా ఆధిపత్య, ప్రచ్ఛన్న యుద్ధాలను పక్కకు పెట్టి జి-8, జి-20 అగ్రరాజ్యాల కూటమి వర్చువల్‌గా సమావేశమయ్యి కుదేలవుతున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్త ఉద్దీపనకు ఐదు ట్రిలియన్‌ ‌డాలర్లను సహాయాన్ని ప్రకటించింది. అయితే కొరోనా కట్టడికి నిర్దిష్టమైన కార్యాచరణను ప్రకటించలేదు. కొరోనా వ్యాధి తీవ్రతను గుర్తించడంలో చైనా నిర్లక్ష్యం, ఇటలీ, అమెరికాలు ప్రదర్శించిన అలసత్వం వల్ల ఇది మహమ్మారిగా మారి జనజీవనాన్ని భయానకస్థితికి నెట్టివేసింది. విపత్తులో ఐక్యరాజ్యసమితి సభ్యదేశాలను సమన్వయపరిచి హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించి యుద్ధప్రాతిక చర్యలను చేపట్టడంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ విఫలమవుతున్నట్లు కనిపిస్తున్నది.
కొరానా వైరస్‌ ‌ప్రకృతిలో సహజసిద్ధంగా రూపొందినది అనే జీవ శాస్త్రవేత్తల అభిప్రాయాన్ని గౌరవించి వైరస్‌ ‌రాజకీయాలు మానుకుని చైనా, అమెరికా, యూరోపియన్‌ ‌దేశాలు సమష్టిగా నియంత్రణ, నివారణ చర్యలు తక్షణమే చేపట్టాల్సిన అవసరముంది. ప్రపంచయుద్ధం రెండులో ప్రపంచానికి ప్రమాదకారిగా మారిన హిట్లర్‌ ‌నాజీలను ఓడించటానికి అమెరికా నేత రూజ్‌వెల్డ్, ‌రష్యా నేత స్టాలిన్‌, ఇం‌గ్లండ్‌ ‌నేత విన్‌స్టన్‌ ‌చర్చిల్‌ ఏర్పాటు చేసిన ఐక్య సంఘటన మళ్లీ ఇప్పుడు క్రిమి విసిరిన మూడవ ప్రపంచయుద్ధం అంతానికి పనిచేయాల్సిన చారిత్రక సన్నివేశం మన ముందు ఉన్నది. చరిత్రలో వైరస్‌ల వలన కలిగే విపత్తులలో కొరోనా మొదటిది కాదు, చివరిదిగా కూడా ఉండబోదు. ఎబోలా, జికా, నిఫా, సార్స్, ‌మెర్స్ ‌వంటి వైరల్‌ ‌వ్యాధుల వలన అనేక దేశాలలో, కొన్ని ఖండాలలో లక్షలాదిగా మృత్యువాత పడ్డారు. మ్యాడ్‌కే, స్క్రాపీ వైరస్‌ల వలన యూరప్‌, ఆ‌స్ట్రేలియాలో కనీవిని ఎరుగని పశుసంపదకు నష్టం వాటిల్లింది. వైరస్‌లు కణరహిత జీవులు. కేవలం జీవకణాలలో మాత్రమే పరాన్నజీవిగా నివసిస్తుంది. ఆర్‌ఎన్‌ఏ ‌లేదా డిఎన్‌ఏ ‌ను, జీనోమ్‌ను కల్గి ఉండి చుట్టూ ప్రొటీన్‌, ‌కొవ్వు పొరలచే ఆవరించి ఉంటాయి. వీటిలోని జీనోమ్‌లో కలిగే మార్పుల వలన నష్ట తీవ్రత ఆధారపడి ఉంటుంది. ఇప్పటి వరకు వైరస్‌ ‌సంక్రమిక వ్యాధుల నియంత్రణ, నివారణపై జీవ వైజ్ఞానిక శాస్త్రవేత్తలు అప్రతిహత విజయాలను సొంతం చేసుకున్నారు.
అతి స్వల్పకాలంలో ప్రపంచాన్ని చుట్టివేసిన మహమ్మారిగా కొరొనా వైద్యశాస్త్ర చరిత్రలో నమోదు చేసుకున్నది. ఒక్కసారి సునామీలా విరుచుకపడిన కొరానా బారి నుండి ప్రజలను కాపాడుకోవడంలో ఇటలీ, స్పెయిన్‌, ఇం‌గ్లండ్‌, అమెరికా లాంటి ధనవంత దేశాలు చతికిలబడిపోయాయి. టెస్టింగ్‌ ‌కిట్స్, ‌వైద్యపరికరాలు, రక్షణ కవచాలు సరిపడనంతగా ఆయా దేశాలలో లేకపోవడం వల్ల సంక్షోభం దాపురించింది. భారత్‌లాంటి అధిక జనాభా, జనసాంద్ర, సానిటేషన్‌, ఆరోగ్య అవస్థాపనా సౌకర్యాల లేమి ఉన్న దేశంలో కొరానా కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌ ‌దశలోకి చేరితే ఊహించనంత జననష్టం సంభవించే అవకాశమున్నది. ప్రపంచవ్యాప్తంగా తొలి లక్ష కేసులు నమోదుకావడానికి 67 రోజులు పడి••, రెండవ లక్ష కేవలం 11 రోజులలో నమోదయింది. మూడో లక్షకేసులకు నాలుగురోజులు సరిపోతుంది, ఇదే వేగంతో వ్యాపిస్తే 30కోట్ల మందికి వచ్చే అవకాశముంది. తక్కువలో తక్కువ 25లక్షల మంది చనిపోవచ్చు, కనీసం 50 )క్షల కొరోనా రోగులకు వెంటిలేటర్ల సౌకర్యం అవసరముంటుంది. కానీ భారత్‌లో ప్రజారోగ్య వ్యవస్థలో 35వేల ఇంటెన్సివ్‌ ‌కేర్‌ ‌యూనిట్‌ ‌మంచాలు, 20వేల వెంటిలేటర్లు మాత్రమే ఉన్నాయి. దేశంలో 7లక్షల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. కానీ సగటున వెయ్యి మందికి 0.11 మంచం మాత్రమే ఉంది. నియంత్రణ చర్యలలో పాల్గొంటున్నా సానిటేషన్‌, ‌వైద్య, రక్షణ సిబ్బందికి ప్రామాణికమైన గ్లౌవ్స్, ‌రక్షణ కవచాల సరఫరా అంతంత మాత్రంగానే ఉంది. ప్రజాబాహుళ్యంలో ‘‘సత్యవంతత’’ తగ్గిపోయి క్వారంటైన్‌ల నుండి తప్పించుకునే ధోరణులు కనిపిస్తున్నాయి. ప్రజల వ్యక్తిత్వ నిర్మాణంలో నైతికత, నిజాయితీ కొరవడం వలన చాలా మంది కొరోనా రోగులు స్వచ్ఛందంగా ముందుకు రావడం లేదు. సర్వే చేస్తున్న సిబ్బందిపై భౌతికదాడులకు దిగుతున్న వైనం కనిపిస్తున్నది. కొరోనా గొలుసు తెంచడానికి విధించిన సుధీర్ఘ లాక్‌డౌన్‌ ‌సామాజిక సంక్షోభానికి, అస్థిరతకు దారి తీస్తున్నది. డిటెన్షన్‌ ‌సెంటర్‌ల నిర్మాణం ఆపి తక్షణమే వలస జీవులకు, శ్రామికులకు ఆహారం, నీరు, విద్యుత్‌, ‌వైద్యం ఉండే శిబిరాలను నిర్మించాలి. లేకపోతే ఆహార కొరత, పోషకాహార లేమితో మరింత జన నష్టం కల్గుతుంది.

- Advertisement -

ఇంతటి విపత్కర ప•రిస్థితులలో భారత్‌కు ఉన్న సానుకూల అంశం ఏమిటంటే కొరోనా త్వరిత వ్యాప్తికి అధిక ఉష్ణోగ్రత ఒక అవరోధంగా ఉండడం, దాడి చేసే శక్తి తీవ్రత తక్కువ జినోమ్‌ ఉన్న వైరస్‌ ‌కావడం. వ్యాధి వ్యాపార వస్తువుగా అమితమైన సంపదను కూడబెట్టుకున్న ప్రైవేట్‌ ‌కార్పొరేట్‌ ‌దవాఖానాలను, ఫార్మా కంపెనీలను కనీసం పరిమిత సమయం ప్రాతిపదికగానైనా జాతీయం చేసి నియంత్రణ నివారణ చర్యలలో పాల్గొనే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపించాలి. స్పెయిన్‌, ఇం‌గ్లండ్‌ ‌దేశాలు వైద్యవ్యవస్థను జాతీయం చేసాయి. చైనా, క్యూబా మరియు లాటిన్‌ అమెరికా దేశాలలో పరిపూర్ణమైన ప్రజారోగ్య వ్యవస్థ ఉండడం వల్లనే అవి మహమ్మారుల నియంత్రణలో అగ్రగాములుగా ఉన్నాయి. అనంతకోటి దరిద్రాలు ఉన్న భారత్‌లో రక్షణ, అంతరిక్ష రంగాలకు బడ్జెట్‌లో కోత విధించి ప్రజారోగ్య వ్యవస్థను పటిష్టం చెయ్యాలి. జిడిపిలో వైద్యరంగానికి 3 శాతం కేటాయించాల్సి ఉండగా గత ఆరు సంవత్సరాల నుండి 0.80 శాతం మాత్రమే కేటాయిస్తున్నారు. కొరోనా టెస్టింగ్‌ ‌కిట్‌ ‌ధర 4500 రూపాయలుగా ఉంది. దీనిని ప్రజలందరికి అందుబాటులో ఉండేలా చేసి అనుమానిత లక్షణాలున్న వారంతా నిర్ధారణ పరిక్షలు చేసుకునే విధంగా చర్యలు చేపట్టాలి. ప్రభుత్వ, ప్రైవేట్‌ ‌రంగంలోని లక్షలాది, ఉపాధ్యాయ వర్గం సేవలను ఇందుకు ఉపయోగించుకోవాలి.
హెల్త్ ఎమర్జెన్సీని విధించి, అత్యధిక నిధులను మళ్ళించి నియంత్రణ చర్యలతో పాటు చికిత్స ఔషధాలను, నివారణ వాక్సిన్‌ల ఉత్పత్తికి భారత్‌ ‌ప్రత్యేక శ్రద్ధ వహించాలి. సెంటర్‌ ‌ఫర్‌ ‌సెల్యులార్‌ ‌మాలిక్యూలర్‌ ‌బయాలజి, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ‌వైరాలజి, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ‌సైన్స్‌ల సమన్వయంతో కోవిడ్‌-19 ‌వైరస్‌లో ఆర్‌ఎన్‌ఏ ‌లోని జన్యు అక్షరాల క్రమం(జినోమిక్స్) ‌నిర్ధారించే పరిశోధనలను నిర్వహించాలి. జన్యు అక్షరాల నిర్ధారణ ఆధారంగానే ఔషధాల, వాక్సిన్‌ల తయారీ ఆధారపడి ఉంటుంది. మనకు విద్వత గల జీవశాస్త్రవేత్తల బృందం ఉంది. నిధులు, ప్రొత్సాహంతో మనం 3 నుండి 6 నెలల్లో సొంతంగా వ్యాక్సిన్‌ ‌తయారీ సామర్థ్యం సమకూరుతుంది. భవిష్యత్‌ ‌సవాళ్ళను ఎదుర్కోవడానికి ప్రభుత్వ రంగంలో వైద్య శిక్షణ సంస్థలను అధికంగా స్థాపించి సుశిక్షిత, సామాజిక బాధ్యత గల వైద్య సైన్యాన్ని సిద్ధంగా ఉండేలా చేసుకోవాలి. విజ్ఞతతో పౌరసమాజం విపత్కర పరిస్థితులను అధిగమించడానికి క్రియాశీలంగా పని చేస్తూ ప్రభుత్వాలను ఆ దిశగా వేగవంతంగా పనిచేయడానికి మళ్ళింపచేయాలి.
Asnala srinivas
 అస్నాల శ్రీనివాస్‌,
‌తెలంగాణ  గెజిటెడ్‌ అధికారుల  సంఘం
9652275560

Leave a Reply