తమ మానాన తాము జీవిస్తూ ఉంటే
సరిహద్దు భూతం దృష్టి తమపై పడటం
తమ దేశ ప్రజల దుర దృష్టం
కాలు దువ్విందిలేదు
కవ్వించింది అసలే లేదు
కండకావరం విసుమంత లేదు
సభ్యత్వం అడగొద్దన్ని హెచ్చరిక
పెడచెవిన పెట్టిన పాపం ఇదే
వద్దన్నా వలదన్నా చట్టుకున్న
దూరిపోయి పెద్దన్న పాత్ర పోషించే
అగ్రరాజ్యం మిన్నకుండి పోయింది
నిన్న మొన్నటి వరకు ఏకాకి
నాటో దేశాలు రంగ ప్రవేశం
ఆత్మభిమానికి ఊపిరి పోశాయి
కమ్ముకున్న యుద్ద మేఘాలు
సామాన్యులమీద బ్రహ్మాస్త్రం
సడలని ఆత్మవిశ్వాసం
చావో రేవో తేల్చుకుంటాం
తగ్గేదేలే అంటూ సమరంలో
వెన్ను చూపని దేశభక్తి వాళ్ళది
పంతానికి పోవటం
పతనానికి చేరుకోవటమే
అమాయకుల ఉసురు తీయటం
అవివేకమే అవుతుంది
శాంతి పావురం ఎగరాలి
ఇరుదేశాలు రాజీ అనుసరించాలి
అగ్రరాజ్యాలు జ్యోక్యం చేసుకోవాలి
యుద్ధ మేఘాలు అదృశ్యం కావాలి
గాయపడిన వారిని అక్కున చేర్చుకోవాలి
మానవత్వం పరిమళ్లించాలి
– గాదిరాజు రంగరాజు
8790122275