Take a fresh look at your lifestyle.

వార్‌ ‌వన్‌ ‌సైడే…దుబ్బాక, జిహెచ్‌ఎం‌సిలోనూ నిజామాబాద్‌ ‌ఫలితమే

కవిత గెలుపు పట్ల మంత్రి హరీష్‌రావు హర్షం..టిఆర్‌ఎస్‌లో చేరిన వివిధ పార్టీల నేతలు

దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలపు టిఆర్‌ఎస్‌దేనని, నిజామాబాద్‌ ‌స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఏదైతే ఫలితం వచ్చిందో అదే ఫలితం దుబ్బాక ఉప ఎన్నికల్లో, జిహెచ్‌ఎం‌సి ఎన్నికల్లో పునరావృతం కావడం తథ్యమనీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. సోమవారం సిద్ధిపేట జిల్లా దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంలోని చేగుంట మండలానికి చెందిన వివిధ పార్టీల నేతలు, ప్రజాప్రతినిధులు మంత్రి హరీష్‌రావు సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరారు.
టిఆర్‌ఎస్‌లో చేరిన వారందరికీ మంత్రి హరీష్‌రావు గులాబీ జెండాను కప్పి టిఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ…దుబ్బాక ఉప ఎన్నికల్లో వార్‌ ‌వన్‌ ‌సైడేననీ, నిజామాబాద్‌ ‌మాదిరిగానే దుబ్బాక ఉప ఎన్నికల్లోనూ బిజెపి, కాంగ్రెస్‌ ‌పార్టీల అభ్యర్థులకు డిపాజిట్‌ ‌గల్లంతు కావడం ఖాయమన్నారు.  నిజామాబాద్‌ ‌స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ అద్భుతమైన విజయం సాధించిందనీ అన్నారు. కల్వకుంట్ల కవిత  ఘన విజయం సాధించడం పట్ల మంత్రి హరీష్‌రావు హర్షం వ్యక్తం చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply