వలిగొండ, జేయూఎన్17 (ప్రజాతంత్ర విలేకరి) మండల పరిధిలోని సుంకిశాల గ్రామం నుండి నూతనంగా వేస్తున్న మెగా గ్యాస్ పైప్ లైన్ ను నిలిపివేయాలని టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ గ్రామపంచాయతీ పర్మిషన్ లేకుండా గ్రామంలో నుంచి అక్రమంగా తవ్వకాలు నిర్వహిస్తున్న మెగా గ్యాస్ పైపులైను నిలిపివేయాలన్నారు. ఈ విషయంపై స్థానిక సర్పంచ్ మొగిలిపాక నరసింహ డిపివో దృష్టికి తీసుకెళ్లగా పర్మిషన్ గురించి మీకు సంబంధం లేదు మేము చూసుకుంటామని సమాధానం ఇచ్చారని, ఇప్పటికే గ్రామ పక్కన రిలయన్స్ గ్యాస్ జంక్షన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
మెగా జంక్షన్ ఏర్పాటుతో గ్రామానికి ఇరువైపులా రెండు జంక్షన్లు అవుతుండడంతో గ్రామ ప్రజలు భయభ్రాంతులకు గురి అవుతున్నారని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పైళ్ల రాజవర్ధన్, రెడ్డి జిల్లా నాయకులు చెరుకు శివయ్యగౌడ్, ఉపసర్పంచ్ మెట్టు కొండల్ రెడ్డి, ఈతప మల్లేశం, బుచ్చిరెడ్డి, రమేష్, రాగిర్ మల్లేశం, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.