Take a fresh look at your lifestyle.

పర్యాటక కేంద్రంగా పీవీ స్వగ్రామం వంగర

‌మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి సందర్బంగా.ఆయన స్వగ్రామం వంగరలో చేపట్టే కార్యక్రమాల గురించి హుస్నాబాద్‌ ఎమ్మెల్యే వొడితల సతీష్‌ ‌కుమార్‌ ‌శుక్రవారం రాష్ట్ర పర్యాటక, ఎక్సయిజ్‌, ‌యువజన సర్వీసుల మంత్రి వి శ్రీనివాస్‌ ‌గౌడ్‌ని హైదరాబాద్‌లో  అయన నివాసంలో కలిసారు. మాజీ ప్రధాని పాములపర్తి వెంకట నరసింహారావు(పీవీ) శత జయంతిని పురస్కరించుకుని అయన సొంత గ్రామమైన భీమదేవరపల్లి మండలం వంగరను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో హుస్నాబాద్‌ ఎమ్మెల్యే వొడితల సతీష్‌ ‌కుమార్‌ ‌టూరిజం మంత్రి వి శ్రీనివాస్‌ ‌గౌడ్‌ని కలుసుకుని వంగర గ్రామంలో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాల గురించి సమగ్రంగా చర్చించారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే వొడితల సతీష్‌ ‌కుమార్‌ ‌మాట్లాడుతూ స్వర్గీయ పీవీ నరసింహారావు యావత్‌ ‌తెలుగువారితో పాటు దేశం, ప్రపంచం గర్వించదగిన మహనీయుడని, ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించారని, ఆధునిక భారతావనికి పితామహుడని  కొనియాడారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply