అభివృద్ధి చేసేవారినే సర్పంచ్‌లుగా ఎన్నుకోవాలి

– ‘వాక్‌ ది టాక్‌ విత్‌ జర్నలిస్ట్‌’లో ప్రజలకు మంత్రి ఉత్తమ్‌ పిలుపు

హుజూర్‌నగర్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 15: గ్రామాలను ప్రభుత్వంతో కలిసి అభివృద్ధి చేసే అభ్యర్థులను సర్పంచ్‌లుగా ఎన్నుకోవాలని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖల మంత్రి ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి స్థానిక ప్రజలకు పిలుపునిచ్చారు. తన రోజువారీ దినచర్యలో భాగంగా సోమవారం తెల్లవారుజామున హుజూర్‌నగర్‌ నియోజకవర్గ కేంద్రంలో స్థానిక జర్నలిస్టులతో వాక్‌ ది టాక్‌ విత్‌ జర్నలిస్ట్‌ కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలో నడుస్తూ విలేకరులతో కలిసి మాట్లాడారు. ఈ క్రమంలో దారిలో ఉన్న ఒక చిన్న టీ దుకాణం వద్ద మంత్రి విలేకరులతో కలిసి టీ తాగుతూ ముచ్చటించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ ఎన్నికలపై ప్రధానంగా చర్చ జరిగింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *