Take a fresh look at your lifestyle.

వాకపల్లి ఆదివాసి మహిళలు.. న్యాయం కోసం 13 ఏళ్ళుగా పోరాటం

Wakapalli Adivasi Womens 13 years of struggle for justice

విశాఖ జిల్లా వాకపల్లి ఆదివాసి గ్రామంలో కొండ తెగకు చెందిన 11 మంది మహిళలు పదమూడేళ్ళ క్రితం 2007 ఆగస్టు 10వ తేదీన యాంటీ నక్సల్‌ ‌స్క్వాడ్‌ (‌నక్సలైట్ల ఏరివేత దళం) జవాన్ల ప్రమేయం ఉన్న అత్యాచార యత్నం ఘటనలో బాధితులు. అప్పటి నుంచి ఈ మహిళలు న్యాయం కోసం పోరాటం సాగిస్తున్నారు. కాళ్ళరిగేలా న్యాయస్థానాల చుట్టూ తిరుగుతున్నారు. వారిలో ఇద్దరు కన్నుమూశారు. ఇంతవరకూ న్యాయం మాత్రం జరగలేదు. ఆ మహిళల ఆరోపణలను పోలీసులు తేలిగ్గా కొట్టివేస్తున్నారు. ఆ మహిళలపై సమాజపరమైన మచ్చ పడింది. వారిని భర్తలు వదిలివేశారు. పిల్లలు దూరంగా ఉంటున్నారు. సామాజికంగా లెక్కలేనన్ని అవమానాలకు గురవుతున్నారు. వాకపల్లి విశాఖ జిల్లా జి మాడుగుల మండలంలోని నుర్మతి పంచాయితీ గ్రామ శివారు గ్రామం. ఈ గ్రామ జనాభా 250. ఆంధ్రప్రదేశ్‌, ఒడిషా సరిహద్దుల్లో నక్సల్స్ ‌ప్రాబల్య ప్రాంతంలో ఈ గ్రామం ఉంది. 2007 ఆగస్టు 10వ తేదీ తెల్లవారు జామున గ్రేహౌండ్స్ ‌జవాన్లు దాడి చేసిన రీతిలో గ్రామంలో ప్రవేశించారు. ఆ తర్వాత రెండు రోజులు ఆ గ్రామ ప్రజలు కాళరాత్రిని అనుభవించారు. నక్సలైట్ల ఆచూకీ తెలుపమని ఆ గ్రామంలో పురుషులు, మహిళలను వేధించారు. 11 మంది మహిళలపై అత్యాచారం జరిపారు. దాడి జరిపిన 13 మంది గ్రేహౌండ్స్ ‌జవాన్లపై విచారణను వీలైనంత త్వరగా ఆరు మాసాల్లో పూర్తి చేయమని పాడేరులోని స్థానిక కోర్టును సుప్రీమ్‌కోర్టు ఆదేశించింది. పాడేరు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేశారు. అదే ఏడాది సెప్టెంబర్‌ 6‌వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం జరిపించిన దర్యాప్తులో వైద్యపరమైన సాక్ష్యాలు ఏవీ లేవని పోలీసులు తేల్చారు. హైకోర్టు సిఐడి దర్యాప్తునకు ఆదేశించింది.

Wakapalli Adivasi Womens 13 years of struggle for justiceసిఐడి నివేదిక ఆధారంగా ఈ కేసును కోర్టు కొట్టేసింది. 2012 ఏప్రిల్‌లో హైకోర్టులో అప్పీలుకు ప్రతిస్పందనగా 13 మంది గ్రేహౌండ్స్ ‌జవాన్లపై విచారణ జరిపించమని ఆదేశించింది. సుప్రీమ్‌కోర్టు వీలైనంత త్వరగా దర్యాప్తు పూర్తి చేయమని పాడేరు కోర్టును ఆదేశించింది. మేధావులు ఎంతో మంది ఉన్న మన సమాజం బాధితులకు మాట మాత్రంగానైనా మద్దతు ప్రకటించేందుకు ముందుకు రాలేదు. ఈరోజుకీ బాధితులకు న్యాయం జరగలేదు. బహుశా వారు నిర్బయ, దిశ వంటి బాధితులు కాకపోవడం వల్లనేమో. కోర్టు ఆర్డర్‌ ‌చచ్చిపోయింది.

Tags: Wakapalli, Adivasi Womens, 13 years, struggle for justice, high court,Greyhounds jawans

Leave a Reply