Take a fresh look at your lifestyle.

విద్యుత్‌ ‌బిల్లులు మాఫీ చేయాలి

*రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్‌ ఆం‌దోళన
*హైదరాబాద్‌లో ఉత్తమ్‌ ఆధ్వర్యంలో ధర్నా

పేదల విద్యత్తు ఛార్జీలను రద్దు చేయాలని, వాటిని ప్రభుత్వమే భరించాలని డిమాండ్‌ ‌చేస్తూ కాంగ్రెస్‌ ‌పిలుపు మేరకు పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఆయా ప్రాంతాలో కాంగ్రెస్‌ ‌నేతలు ధర్నాలకు దిగారు. హైదరాబాద్‌లో జరిగిన ఆందోళనలో పిసిసి చీఫ్‌ ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి, అంజన్‌ ‌కుమార్‌ ‌యాదవ్‌ ‌పాల్గొన్నారు. వారు విద్యుత్‌ ‌సౌధ వరకు వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్బంగా ఉత్తమ్‌ ‌మాట్లాడుతూ లాక్‌డౌన్‌ అమల్లో ఉన్న కాలానికి బిపిఎల్‌ ‌కుటుంబాలతో పాటు ఎంఎస్‌ఎంఇల విద్యుత్‌ ‌బిల్లులను మాఫీ చేయాలని డిఆండ్‌ ‌చేశారు. అధిక విద్యుత్తు బిల్లులను తక్షణమే మాఫీ చేయాలన్న డిమండ్‌తో సోమవారం రాష్ట్రవ్యాప్తంగా నల్లజెండాలు ప్రదర్శిస్తూ నిరసన చేపట్టాలని కాంగ్రెస్‌ ‌శ్రేణులకు ఉత్తమ్‌ ‌పిలుపునిచ్చారు. కాగా, సీఎం కేసీఆర్‌ ‌ఫాంహౌస్‌లో క్వారంటైన్‌లో ఉంటే రాష్ట్రంలో కొరోనా ప్రభావం తగ్గుతుందా? అని ఎంపీ రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ప్రైవేట్‌ హాస్పిటల్స్   దోపిడీ పెరిగిపోయిందని, సుల్తానా ఘటనే ఇందుకు నిదర్శనమని పేర్కొంటూ ఆ వీడియోను ట్విటర్‌లో పోస్టు చేశారు. వైరస్‌ ‌కట్టడిలో సీఎం కేసీఆర్‌ ‌ఘోరంగా విఫలమయ్యారని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. కొరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్‌ ‌చేశారు. ప్రజలను పాలించడానికి సీఎం అయ్యావా..? లేక చంపడానికి అయ్యావా..?! రాష్టాన్రికి ఇలాంటి ముఖ్యమంత్రి ఉండడం దురదృష్టకరం అని అన్నారు. పొరుగున ఏపీలో పది లక్షలకుపైగా టెస్ట్‌లు జరిగితే, రాష్ట్రంలో లక్ష దాటకపోవడం ప్రభుత్వ వైఫల్యం కాదా అని నిలదీశారు. ప్రగతి భవన్‌లో కేసులు వచ్చాయని కేసీఆర్‌ ‌ఫాం హౌస్‌కు వెళ్లారని, అక్కడ కూడా కొరోనా వస్తుందని శాపనార్థాలు పెట్టారు. రైతులకు పట్టాదార్‌పాస్‌ ‌పుస్తకాలను అందించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కిసాన్‌ ‌కాంగ్రెస్‌ ‌జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి డిమాండ్‌ ‌చేశారు. ఈ మేరకు కిసాన్‌ ‌కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో పోస్టుకార్డు ఉద్యమం ప్రారంభించినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో 12 లక్షల మంది పేద రైతులకు కొత్త పట్టాదార్‌ ‌పాసుపుస్తకాలు అందలేదని ఆరోపించారు. కరీంనగర్‌లో జిరగిన ఆందోళనలో పొన్నం ప్రభాకర్‌ ‌పాల్గొన్నారు. మహమ్మారి కారణంగా ప్రపంచం మొత్తం ఇబ్బందుల్లో ఉందని..తెలంగాణ దీనికి మినహాయింపు కాదని పేర్కొన్నారు. ఈ కష్టకాలంలో ప్రజలకు సహాయపడటానికి ప్రభుత్వాలు తమ విధానాలను మార్చుకుంటున్నప్పటికీ, తెలంగాణ ప్రభుత్వం ఏవి• చేయడంలేదని ఉత్తమ్‌ అన్నారు. డబ్ల్యూహెచ్‌ఓ ‌ట్రేస్‌, ‌టెస్ట్ అం‌డ్‌ ‌ట్రీట్‌ ‌విధానం రాష్ట్రం అమలు చేయలేదని ఎత్తిచూపారు. ప్రభుత్వం వైరస్‌ను నియంత్రించడంలో విఫలమవ్వడమే కాకుండా పౌరులపై ఆర్థిక భారం కూడా మోపిందని ఉత్తమ్‌ ఆరోపించారు. జూన్‌ ‌నెలలో విద్యుత్‌ ‌బిల్లులు అన్యాయంగా ఉన్నాయని అన్నారు. మరోవైపు కాంగ్రెస్‌ ‌పిలుపు మేరకు పెద్ద ఎత్తున విద్యుత్‌ ‌బిల్లుల రద్దు కోరుతూ ఆందోళన చేశారు. హైదరాబాద్‌లో విద్యుత్‌ ‌సౌధ వైపు వెళ్లడానికి యత్నించిన ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి, అంజన్‌ ‌కుమార్‌ ‌యాదవ్‌లను అరెస్ట్ ‌చేశారు. వివిధ ప్రాంతాల్లో కాంగ్రెస్‌ ‌శ్రేణులు విద్యుత్‌ ఆం‌దోళనలో పాల్గొన్నారు. రాష్ట్రంలో విద్యుత్‌ ‌శాఖ మంత్రిగా పనిచేస్తున్న వ్యక్తి అసమర్థుడని రాష్ట్ర కాంగ్రెస్‌ ‌శాసనసభాపక్ష నేత మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. కొరోనా కష్టకాలంలో పేదలకు అత్యధికంగా విద్యుత్‌ ‌బిల్లు రావటాన్ని నిరసిస్తూ కాంగ్రెస్‌ ‌పార్టీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టి విద్యుత్‌ అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో గత పది రోజులుగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌కనపడటం లేదన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ ‌నాయకులు వేమిరెడ్డి శ్రీనివాస్‌ ‌రెడ్డి, రంగా హనుమంతరావు, మల్లాది వాసు, సూరంశెట్టి కిషోర్‌, ‌చావా వేణు, మిరియాల రమణ గుప్తా, దారా బాలరాజు, పల్లపోతు ప్రసాదరావు, జహంగీర్‌ ‌పాల్గొన్నారు

Leave a Reply