Take a fresh look at your lifestyle.

పంచాయితీ కార్మికులకు వేతనాలు పెంచాలి

సిఐటియు జిల్లా కార్యదర్శి ఏజే రమేష్‌

‌భద్రాచలం,ఆగస్టు 05 (ప్రజాతంత్ర ప్రతినిధి) : భద్రాచలం గ్రామపంచాయతీ వర్కర్స్ ‌యూనియన్‌ ఆధ్వర్యంలో సిఐటియు నిర్వహించినటువంటి జనరల్‌ ‌బాడీ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన సిఐటియు జిల్లా కార్యదర్శి ఏజే రమేష్‌ ‌మాట్లాడుతూ 2021 పిఆర్సి వేతనాల పెంపు ప్రకారం గ్రామపంచాయతీ కార్మికుల కూడా 30 శాతం వేతనాలు పెంచాలని కనీస వేతనం 18000 ఇవ్వాలని అర్హులైన అందరినీ పర్మినెంట్‌ ‌చేయాలని తదితర డిమాండ్లతో ఈనెల 6వ తేదీన జరిగేటటువంటి జిల్లా కార్యాలయాలు ధర్నాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

అలాగే కనీస వేతనం 18000 అమలు చేయాలని ముఖ్యమంత్రి గారు ప్రకటించిన టువంటి దళిత సాధికారిత దళిత పథకాలను గ్రామపంచాయతీ కార్మికులకు అనువదించాలని గ్రామ పంచాయతీ లో పనిచేస్తున్న కార్మికులు ఎక్కువగా దళితులే ఉన్నందున వారికి కూడా ఈ పథకాన్ని అమలు చేయాలని అలాగే ఆగస్టు 20వ తేదీన జరిగే హుజూరాబాద్‌ ‌శంఖారావం సభను జయప్రదం చేయాలని కోరారు. అలాగే కరోనా కాలం లో ప్రాణాలు భయపడకుండా పని చేసినటువంటి కార్మికులందరికీ కూడా నెలకు ఐదు వేలు చొప్పున ప్రకటించాలని ఈ డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని లేనిపక్షంలో రాష్ట్రంలోని జిల్లా కార్యాలయాలు అన్నీ కూడా దిగ్బంధిస్తామని అలాగే హుజురాబాద్‌ ‌లో జరిగే అటువంటి శంఖారావం సభ సందర్భంగా తెలియజేసారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు ఎంపీ నర్సారెడ్డి  కూడా మాట్లాడారు.  ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ వర్కర్స్ ‌యూనియన్‌ ‌సిఐటియు బాధ్యులు బండారు రామకృష్ణ కృష్ణార్జున రావు, నాగేశ్వరరావు ,ప్రేమ్‌ ,ఆదినారాయణ ,కత్తి శ్రీను ,విజయ ,భాగ్యమ్మ, రెడ్డి, శ్రీనివాస్‌ ,‌కార్మికులు పాల్గొన్నారు.

Leave a Reply