Take a fresh look at your lifestyle.

పేరుకే సర్వసభ్య సమావేశాలు – సమస్యలు పరిష్కారం కావు

సర్వసభ్య సమావేశాన్ని బైకాట్‌ ‌చేసిన సర్పంచ్‌లు

ఆదిలో నే హంస పాదుగా దుమ్ముగూడెం ఎంపిడిఓ గా యం. సీతారావమ్మ భాద్యతలు స్వీకరించిన తర్వాత జరిగిన తొలి సర్వ సభ్య సమావేశం ఆదిలో నే హంస పాదుగా సాగిం ది.మద్యాహ్నం •ంటి గంటకు ప్రారంభం కావాల్సిన సర్వ సభ్య సమావేశం అరగంట ఆలస్యంగా ప్రారంభమైనప్పటికి అన్ని శాఖలకు చెందిన అధికారులు హాజరు కాక పోవడం పై సర్ఫంచ్‌లు నిలదీయగా అధికారులనుండి సరైన సమాదానం రాక పోవడంతో సర్పంచ్‌లు సమావేశాన్ని బై కాట్‌ ‌చేసి వెళ్లి పోయారు. దీంతో అధికారులు చేసేది లేక ఎం• •టిసీలతో సర్వ సభ్య సమావేశాన్ని మమ అనిపిం చారు. మండల పరిషత్‌ ‌సర్వ సభ్య సమా వేశం బుదవారం ఎంపిపి రేసు లక్ష్మీ అద్యక్షతన మండల పరిషత్‌ ‌సమావేశపు మంది రంలో జరి గింది. ముందుగా ఏఓ నవీన్‌ ‌కుమార్‌ ‌మాట్లాడుతూ ఈ ఏడాది మండలంలో 69 శాతం అత్యది కంగా వర్ష పాతం నమోదు అయి నట్లు ఆయన తెలిపారు. అధిక వరా్ష లు, గోదావరి వరదలతో దెబ్బ తిన్న చేలను పంట నష్టం సర్వే నిర్వ హించి ఉన్నతాధికారులకు నివేదికను అందజేసినట్లు ఆయన తెలిపారు.

సొసైటీ ద్వారా అంద జేస్తున్న ఎరు వులను మండలంలో లక్ష్మీ నగరం, గోవిందాపురం, లక్ష్మీ పురం గ్రామా లలో ఉన్న గోడౌన్‌లను తమకు అప్ప గిస్తే ఎరువులు రైతులకు అందు బాటులో ఉంటాయని ఆయన తెలి పారు. సిపిఐ(ఎం) ఎంపిటిసి సభ్యుడు యలమంచి వంశీ కృష్ణ మాట్లాడుతూ గోదావరి, వరదలు, అధిక వర్షాలతో ఎన్ని వేల ఎకరాల పంట నష్టం వాటిల్లిందని, పంట నష్ట పరిహారం ఎప్పుడు అంద జేస్తా రని నిదీయడంతో ఎఓ సమా దానం దాట వేశాడు. గౌరవరం సర్పంచ్‌ ‌సోడి జ్యోతి మాట్లాడుతూ సర్వ సభ్య సమావేశానికి ఎన్ని శాఖల అధికారులు రావాలి, ఎంత మంది వచ్చారు, రాని వారు గౌరవ ఎంపిపి పర్మిషన్‌ ‌తీసుకున్నారా అని నిలదీసింది. దీంతో ఎంపిడిఓ యం. సీతారావమ్మ మాట్లాడుతూ కరోనా నేపద్యంలో అసలు సభలు సమావేశాలు పెట్ట వద్దని ముఖ్యమైన సమస్యలు ఉంటే చర్చించుకుందాం అని ఆమె తెలుపుతున్న సమయంలో సర్వ సభ్య సమావేశానికి హజరైన సర్పంచ్‌లు మొత్తం అసహనానికి గురై సభ నుండి బయటకు వెళ్లి పోయారు. సభ నుండి బయటకు వచ్చిన సర్పంచ్‌లకు పార్టీలకు అతీతంగా ఎంపిటిసి సభ్యులు మద్దతు తెలిపారు. పేరుకే సర్వ సభ్య సమావేశాలు నిర్వహిస్తున్నారని ఏ •క్క సమస్య పరిష్కారం కావడం లేదని సర్పంచ్‌లు ఆరోపించారు. పకృతి వనాల పేరుతో తమక తెలియ కుండా పనికి రాని స్థలాలు కేటాయించారని వాటిని చదును చేయడం కోసం సుమారు 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని వారు నవతెలంగాణ ముందు వాపోయారు. పెద్ద కమలాపురం గ్రామ పంచాయితీలో కేటాయించిన స్థలంలో గిరిజన రైతులు పత్తి చేను వేసు కున్నప్పటికి అధికారుల •త్తిడితో పత్తి చేనును డోజర్‌తో )•లగించడం జరిగిందని సర్పంచ్‌ ‌బాలరాజు అన్నాడు. రెవిన్యూ అధికారులు తీరు వలన తాము గ్రామాల ప్రజలతో ఇబ్బందులు పడుతున్నామని తూరుబాక సర్పంచ్‌ ‌భూక్యా చందు ఆరోపించారు. అనంతరం ఎంపిటిసి సభ్యులతో జరిగిన సర్వ సభ్య సమావేశంలో విద్యుత్‌, ఇజిఎస్‌, ‌పంచాయితీ రాజ్‌, ‌వైద్యశాఖ లతో పాటు వివిద శాఖలకు చెందిన అధికారులు మాట్లాడారు. సమావేశంలో జెడ్పీటీసి తెల్లం సీతమ్మ, ఎంపిఓ ముత్యాలరావు, ఆర్‌డుబ్ల్యుఎస్‌ ఏఇ ‌హరి, వైద్యాధికారులు బాలాజీ నాయక్‌, ‌చైతన్య, ఇజిఎస్‌ ఏపిఓ సుకన్య, ఐసిడిఎస్‌ ‌సూపర్‌ ‌వైజర్లు సావిత్రి, మణి, పంచాయితీ రాజ్‌ ఏఇ ‌వశ్యానాయక్‌, ఐటిడిఏ ఎఇ వెంకటేశ్వరావు, పశువైద్యశాఖ నుండి ఫాతిమా  పాల్గొన్నారు.

Leave a Reply