Take a fresh look at your lifestyle.

ఇం‌డ్లు కట్టి ఇచ్చాకే వోట్లు అడగాలి

  • గ్రేటర్‌లో లక్ష ఇళ్ల పేరుతో డ్రామాలాడుతున్నారు
  • తప్పుల తడకగా డబుల్‌ ఇళ్ల లెక్కలు
  • మండిపడ్డ సిఎల్‌పి నేత భట్టి విక్రమార్క

గ్రేటర్‌ ‌హైదరాబాద్‌లో లక్ష డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇళ్ళ నిర్మాణంపై ప్రభుత్వం చెబుతున్నవి తప్పుడు లెక్కలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ …నాంపల్లి, జూబ్లహిల్స్ ‌నియోజకవర్గాల్లో ఇళ్ళు కట్టకుండా కట్టినట్టు ప్రభుత్వం ప్రజల్ని మోసం చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్‌ ‌నేతలు అంజన్‌ ‌కుమార్‌ ‌యాదవ్‌, ‌విక్రమ్‌ ‌గౌడ్‌, ‌ఫిరోజ్‌ ‌ఖాన్‌ ‌తదితర నేతలతో కలిసి సంబంధిత ప్రదేశాలను ఆయన సందర్శించారు. కేసీఆర్‌ ‌సర్కార్‌ ‌చెప్పేదానికి చేసేదానికి పొంతనలేదని ఆయన విమర్శించారు. డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇళ్లపై సీఎం కేసీఆర్‌ ఎన్నో హామీలు ఇచ్చారని..అధికారంలోకి వచ్చాక వాటిని తుంగలో తొక్కుతున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం భోగస్‌ ‌లిస్టు తయారు చేసి ఇచ్చిందని ఆరోపించారు. నాంపల్లి నియోజకవర్గంలోని ఒక ప్రాంతంలో 1824 ఇళ్లు కట్టినట్టు ఇచ్చిన లిస్టులో చూపించారని..అలాగే జూబ్లిహీల్స్ ‌లోని రెండు లోకేషన్స్ ‌లో 226 డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇళ్లు కట్టినట్టు లిస్టులో సర్కార్‌ ‌చూపించిందన్నారు. కానీ అక్కడ ఒక్క ఇల్ల్లు కూడా కట్టలేదన్నారు.. టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం ప్రజలను పదే పదే మోసం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఫ్రాడ్‌ ‌నుంచి ప్రజలను కాపాడాల్సిన బాధ్యత కాంగ్రెస్‌పై ఉందన్నారు.

మంత్రి కేటీ రామారవు కార్పొరేట్లతో, మల్టీనేషనల్‌ ‌కంపెనీల ప్రతినిధితులతో ఏసీ రూముల్లో కూర్చుని మాట్లాడ్డం కాదని..క్షేత్ర స్థాయిలో సందర్శించి ప్రజల బాధలు తెలుసుకొవాలని అన్నారు. వారు చెప్పిన ఇండ్లు అక్కడ ఉన్నాయో లేవో వచ్చి తెలుసుకోవాలని సూచించారు. వారు చెప్పిన 1824 ఇండ్లలో ఒక్కటైనా అక్కడ కనిపిస్తోందా అని ప్రశ్నించారు. వారు చెప్పిన ప్రాంతంలో దుర్భిణీ వేసి వెతికినా ఎక్కడా డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇం‌డ్లు కనిపించడం లేదని విమర్శించారు. ప్రభుత్వం చేస్తున్న మోసాలపై ప్రజలు తిరగబడాలని భట్టి ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్నికల వాగ్దానమైన 2.40 లక్షల డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇం‌డ్లు కట్టి..పేదలకు పంపిణీ చేశాక కేసీఆర్‌ ‌వోట్లు అడగాలన్నారు. డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇం‌డ్లు అప్పగించాకే టీఆర్‌ఎస్‌ ‌నాయకులను బస్తీల్లోకి అడుగుపెట్టనివ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్‌పై రాజ్యసభ మాజీ ఎంపీ వీహెచ్‌ ‌తనదైన శైలిలో విమర్శలు చేశారు. డబుల్‌ ‌బెడ్రూమ్‌ ఇళ్లపై పేదలను, బడుగులను టీఆర్‌ఎస్‌ ‌మోసం చేస్తోందని మండిపడ్డ ఆయన.. రానున్న ఎన్నికల్లో మళ్లీ మోసం చేస్తారని హెచ్చరించారు. ఎవడొచ్చినా.. ఏ టీఆర్‌ఎస్‌ ‌నాయకుడొచ్చినా.. బస్తీల్లోకి రానీయొద్దుని తెలిపారు. బడుగుల చేతుల్లోనే ఇప్పుడు ఉంది.

ఈసారి వోటెయ్యం అని చెప్పండి. వర్షాలొస్తే కూలిపోయే ఇండ్లు మళ్లీ కట్టిస్తామని ఆనాడు చెప్పారు. చూస్తే తెలుస్తుందని.. చివరికి పునాది రాళ్లు కూడా పీకేశారు. ప్రజలను పోలీసులు అడ్డుకోవద్దని… నేతలను నిలదీసే అవకాశం ఇవ్వాలని వీహెచ్‌ ‌వ్యాఖ్యానించారు. మరోవైపు డబుల్‌ ‌బెడ్‌ ‌రూం ఇళ్ల నిర్మాణం వ్యవహారంపై టీఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌ ‌నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ ‌నేత ఫిరోజ్‌ ‌ఖాన్‌ ‌మాట్లాడుతూ నాంపల్లిలో డబుల్‌ ‌బెడ్‌ ‌రూం ఇళ్లు కడతామని 2015 డిసెంబర్‌ 17‌న అప్పటి డిప్యూటీ సీఎం మహ్మాద్‌ ఆలీ, •ంమంత్రి నాయని నరసింహారెడ్డి ఫౌండేషన్‌ ‌వేశారని చెప్పారు. ఇప్పుడు 2020.. అంటే ఐదేళ్లు అయినా నిర్మాణం జరగలేదని ఆయన తెలిపారు. ఇక్కడ 518 కుటుంబాలు ఉన్నాయని, ఈ ప్రాంతంలో అన్ని ఇళ్లు కూలిపోయే స్థితిలో ఉన్నాయని, ఇటీవల కురిసిన వర్షాలకు గోడ కూలి ముగ్గురు ఆడిపిల్లలు చనిపోయారని అన్నారు. ఘటనపై కలెక్టర్‌ ‌వద్దకు వెళితే ఇళ్లు కట్టలేమని, బాధితులకు పరిహారం ఇస్తామని చెప్పారన్నారు. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి తన చేతిలో ఏ లేదని, ప్రభుత్వాన్నే అడగాలని చెప్పారని ఫిరోజ్‌ ‌ఖాన్‌ అన్నారు. సీఎం కేసీఆర్‌, ‌మంత్రి కేటీఆర్‌ ‌ప్రజలకు అబద్దాలు చెప్పి మోసం చేస్తున్నారని, నాంపల్లిలో ఎన్ని ఇళ్లులు కట్టారో చూపించాలని ఆయన ప్రభుత్వాన్ని సవాల్‌ ‌చేశారు. ఇళ్లు కట్టినట్లు చూపిస్తే తాను రాజకీయ సన్యాసం చేస్తానన్నారు. లక్ష ఇళ్లు ఎక్కడున్నాయో చూపించమంటే.. వేరే ఇళ్లు చూపిస్తున్నారని మండిపడ్డారు. వోట్లు వేయించుకుని ఐదేళ్ల నుంచి ప్రజలను మోసం చేస్తున్నారని ఫిరోజ్‌ ‌ఖాన్‌ ‌తీవ్రస్థాయిలో విమర్శించారు.

Leave a Reply