Take a fresh look at your lifestyle.

వోటు హక్కు వినియోగించున్న గవర్నర్‌ ‌దంపతులు

వోటేసిన నగరి ఎమ్మెల్యే రోజా.. విశాఖ ఎంపి సత్యనారాయణ
వోటు హక్కు వినియోగించుకోవడం చాలా ముఖ్యమని రాష్ట్ర గవర్నర్‌ ‌బిశ్వభూషణ్‌ ‌హరిచందన్‌ అన్నారు. మున్సిపల్‌ ‌కార్పోరేషన్‌ ఎన్నికల్లో భాగంగా విజయవాడలో గవర్నర్‌ ‌దంపతులు తమ వో టు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం గవర్నర్‌ ‌మాట్లాడుతూ ప్రతీ పౌరుడూ వోటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. సమాజంలో మార్పు రావాలంటే వోటుహక్కు వినియోగించు కోవడం తప్పనిసరి అని అన్నారు. ఈ రాష్ట్ర ప్రథమ పౌరుడిగా బాధ్యతతో నేను నా వోటు హక్కును వినియోగించుకున్న మీరు వినియోగించుకోండని గవర్నర్‌ ‌బిశ్వభూషణ్‌ ‌కోరారు.

ఆంధప్రదేశ్‌లో మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ ‌ప్రశాంతంగా కొనసాగింది… 12 కార్పొరేషన్లు, 71 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌… ‌సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుండగా.. ఉదయం 11 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్‌ ‌శాతం 32.23గా నమోదు అయినట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇక, జిల్లా వారీగా చూస్తే.. శ్రీకాకుళంలో 24.58 శాతం, విజయనగరంలో 31.97 శాతం, విశాఖపట్నంలో 28.50 శాతం, తూర్పు గోదావరిలో 36.31 శాతం, పశ్చిమ గోదావరిలో 34.14 శాతం, కృష్ణా జిల్లాలో 32.64 శాతం, గుంటూరులో 33.62 శాతం, ప్రకాశం జిల్లాలో 36.12 శాతం, నెల్లూరులో 32.62 శాతం, అనంతపురంలో 31.36 శాతం, కర్నూలులో 34.12 శాతం, కడపలో 32.82 శాతం, చిత్తూరు జిల్లాలో 30.21 శాతంగా పోలింగ్‌ ‌నమోదైనట్టు ఎస్‌ఈసీ ప్రకటించింది.

- Advertisement -

మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ ‌సందర్భంగా.. నగిరి శాసన సభ్యురాలు ఆర్‌.‌కె.రోజా తన వోటు హక్కును వినియోగించుకున్నారు. బుధవారం నగరి మున్సిపాలిటీ పరిధిలోని మూడో వార్డు లోని హిక్స్ ‌హైస్కూల్‌ ‌పోలింగ్‌ ‌కేంద్రంలో రోజా వోటు వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్‌.‌కె.రోజా మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ వోటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. వోటును వినియోగించుకోకుండా నేతలను విమర్శించే అర్హత లేదన్నారు. ప్రజాస్వామ్యం బలపడాలంటే ప్రతి ఒక్కరూ వోటేయాలన్నారు.

విశాఖ జివిఎంసి ఎన్నికల నేపథ్యంలో.. విశాఖ పార్లమెంట్‌ ‌సభ్యులు ఎంవివి సత్యనారాయణ 19 వ వార్డు లో శాంతి ఆశ్రమం దరి పోలింగ్‌ ‌స్టేషన్‌ ‌లో బుధవారం ఉదయం 9 గంటలకు వోటు వేశారు. ఈ సందర్భంగా ఎంపి మాట్లాడుతూ.. 18 సంవత్సరాలు దాటిన ప్రతీ పౌరుడికి వోటు హక్కు అనేది రాజ్యాంగం కల్పించిన వజ్రాయుధంలాంటిదని, ప్రతీ ఒక్కరూ వోటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.

Leave a Reply