Take a fresh look at your lifestyle.

వోటూ నీ రూటెటు?

వోటూ వోటూ ఏం జేస్తవంటే
తోటోని తొడ కోపిస్త
తోడబుట్టినోన్ని
మెడవట్టి గెంటిస్తానందట..

వోటూ వోటూ ఏమేమ్‌ ‌జేస్తావంటే
ఎన్నికలప్పుడు అన్నలని జూడ
తమ్ములని జూడ
ఆడెవడో లీడర్‌ ‌కోసం
అనుబంధాలమ్మిస్తానందట..

వోటూ ఇంకేం జేస్తావంటే
బీరూ బిర్యానీ కోసం
భారత భవితను తాకట్టు పెట్టిస్తా,
గులాబీ నోటు కోసం
గులాములనుజేస్తానందట..

వోటూ ఇంకేం జేస్తావంటే
దోస్తుల్ని దుష్మన్‌ ‌జేస్తా,
ఆప్తులపై అనుమానం కలిగిస్తా,
అబద్ధాలను అందంగా చెప్పిస్తా,
అమాయకులను బురిడీ కొట్టిస్తానందట..

వోటూ వోటూ నీతో అంతా చేటేనా అంటే
అమూల్యమైన నన్ను
అంగట్లో పెట్టింది ఎవరని అడిగింది
చీకటి బతుకులకు దివిటీలా వస్తే
నోటుకాశపడి గుడ్డివాడైందెవరని అడిగింది.
– లోక రవిశ్చంద్ర, సీనియర్‌ ‌జర్నలిస్టు, సిద్ధిపేట

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply