Take a fresh look at your lifestyle.

ప్రజాస్వామ్యంలో వోటు వజ్రాయుధం..!

‘‘ఎన్నికల్లో పోటీ చేసే ‘మనిషి విలువ కన్నా’ మని విలువే ఎక్కువ అయ్యింది. మానవ సంబందాలు మంట్లో కల్సినాయని దీనికి కారకులు ఎవరు? అని ప్రతి ఒక్క వోటర్‌ ‌ప్రశ్నించుకోవాలి? సంపాదించుకునే అవకాశం ఉంది కాబట్టి అభ్యర్థులు విచ్చల విడిగా ఖర్చు చేస్తున్నారు అని నీకు తెలియదా ఖర్చు పెట్టినది దోచుకునేందుకు ప్రజాప్రతినిధులను ఆ విధంగా తయారు చేసింది ఎవరు ?. ఇక్కడ ఎవరిది నీతి, ఏది అవినీతి అవసరం లేదు.’’

ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం జనాభా లో రెండవ స్థానంలో ఉందని గర్వంగా చెప్పుకుంటాం ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలం వోటర్లు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్‌ 326 ‌ద్వారా కల్పిస్తున్నది. 1950 జనవరి 25న ఎలక్షన్‌ ‌కమిషన్‌ ఆఫ్‌ ఇం‌డియా (భారత ఎన్నికల సంఘం) ఏర్పాటు చేసి 72 సంవత్సరాలు.25 జనవరి, 2011 తొలి వోటర్ల దినంగా ప్రకటించారు.దీన్ని ప్రచారంలోకి తెచ్చేలా వోటు విలువను చాటిచెప్పే విధంగా,వోటర్లను ఎన్నికల్లో పాల్గొనే విధంగా ప్రోత్సహించే దిశగా అర్హత ఉన్న వోటర్లను పెంచడం దీని ముఖ్య ఉద్దేశ్యం.కేంద్ర ఎన్నికల సంఘం ప్రతి సంవత్సరం జనవరి 25న జాతీయ వోటర్ల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నది. ఎన్నికల కమిషన్‌ ‌నియమావళి ప్రకారం ఎన్నికలు జరిగే సంవత్సరంలో ఆ ఏడాది జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు వోటరుగా నమోదు చేసుకోవచ్చు.ప్రజాస్వామ్య భారతదేశంలో ప్రతి పౌరుడికి ప్రాంతీయ భేదం లేకుండా వినియోగించుకునే హక్కు అందరికీ ఉంది. దీనినే సార్వజనీన వోటు హక్కు అంటారు. వోటర్ల అందరినీ కలిపి ఎలక్టోరేట్‌ అం‌టారు. ప్రారంభంలో రాజ్యాంగంలో వోటింగ్‌ ‌వయస్సు 21 సంవత్సరాలు ఉండేది కానీ,1988లో 61వ రాజ్యాంగ సవరణ ద్వారా వోటు హాక్కు పోందే వయస్సు తగ్గించారు.ఎన్నికల సంఘం ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరిగే సందర్భంలో వోటరు జాబితాను సవరించుకుంటుంది. సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకోవడం పై దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.ప్రతి సంవత్సరం జనవరి 25న జాతీయ వోటర్ల దినోత్సవంగా జరుపుకుంటారు.

‘గరుడ’ యాప్‌ను అందుబాటులోకి
ప్రజాస్వామ్యంలో వోటే వజ్రాయుధం. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. వోటు హక్కుకు యువత దూరమైతే ప్రజాస్వామ్యానికి సరైన న్యాయం జరగదు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ వోటు హక్కు కల్పించాలన్న లక్ష్యంతో ఈ నెల 1 నుంచి వోటర్ల నమోదు ప్రక్రియ ప్రారభమైంది. ఈ మేరకు భారత ఎన్నికల కమిషన్‌ ‌వోటు నమోదులో మార్పులు, చేర్పులతో పాట సవరణలకు అవకాశం కల్పిస్తూ తాజాగా నోటిఫికేషన్‌ ‌విడుదల చేసింది. కొత్త వోటర్ల నమోదుకు వీలు కల్పిస్తూ వోటర్ల జాబితా స్పెషల్‌ ‌డ్రైవ్‌ ‌ప్రారంభించింది. 2022 జనవరి 1 వతేదీ నాటికి 18 ఏళ్ళు నిండిన యువత తమ వోటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.రాష్ట్రంలో 2021 జనవరి వరకు నమోదు అయిన వోట్లు 3,01,65,569 ఉండగా వివిద మాధ్యమాల ద్వారా వోటు విలువను ప్రచారం చేయడం, వయస్సు రావడం వల్ల 3,03,56,894 కోట్లు నమోదు చేసుకున్నట్లు గణాంకాలు చెప్పుచున్నాయి.ఒక సంవత్సరంలో 1,91,325 మంది వోటర్లు నమోదు చేసుకోవడం ఇందులో 1,52,56,474 పురుషులు, 1,50,98,685 మహిళలు ,ట్రాన్స్ ‌జెండర్స్ 1,735, ‌ప్రవాస భారతీయులు 2,739, సర్వీసు వోటర్లుగా 14,566 మంది నమోదు చేసుకోవడం చైతన్యానికి నిదర్శనం. వోటరు జాబితాలో మార్పులు, చేర్పులు, పోలింగ్‌ ‌స్టేషన్ల వివరాలతో కేంద్ర ఎన్నికల సంఘం ‘గరుడ’ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. నూతన వోటర్లు మీ-సేవ, ఇంటర్నెట్‌, ఎన్‌వీఎస్‌వీ వెబ్‌సైట్‌తో పాటు స్మార్ట్‌ఫోన్‌ ‌ద్వారా నమోదు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. వోటర్లు తమ నివాస గృహాలు మారడం, అదనంగా పోలింగ్‌ ‌కేంద్రాలు ఏర్పాటు, మరో చోటుకు మార్పు అవసరమైన సమయంలో స్థానిక ప్రజాప్రతినిధులతో సమావేశమై వారి ఆమోదంతో మార్పులకు సిఫారసు చేసేలా ఎన్నికల కమిషనర్‌ అవకాశం కల్పించారు.

‘ఎలక్షన్‌ ‌వాచ్‌ ‌డాగ్‌ ‌లా’ టి ఎన్‌. ‌శేషన్‌..
10 ‌వ ముఖ్య ఎన్నికల కమిషనరుగా బాధ్యతలు తీసుకోని 12, డిసెంబర్‌ 1990 ‌నుండి 11,డిసెంబర్‌ 1996 ‌వరకు విజయవంతంగా పని చేసిన టి ఏన్‌. ‌శేషన్‌ ‌పేరు పారదర్శకత, సమర్థతకు పర్యాయపదంగా మారింది. స్వచ్ఛమైన ఎన్నికలను నిర్వహించడం ద్వారా అతను దేశ ఎన్నికల వ్యవస్థపై తన మార్క్ ‌ముద్రించగలిగాడు.’’చట్టాన్ని ఉల్లంఘించడానికి ఎవరూ సాహసించరు ‘‘ అతడు ప్రవేశపెట్టిన ఎన్నికల్లో మార్పులు, చేర్పులను రాజకీయ వర్గాలు, వారి మీడియా మధ్య నిత్యం వ్యతిరేకించాయి,అతనిని కూడా వ్యతిరేకించారు, ‘‘ఎలక్షన్‌ ‌వాచ్‌ ‌డాగ్‌’’ ‌గా పేరుపెట్టాయి. తరువాత Al-Seshan (Alsatian) అభివర్ణించాయి. ఎంతగా అంటే, ఎన్నికల ‘పోరాటాలు’ గా ‘‘శేషన్‌ ‌వెర్సస్‌ ‌నేషన్‌’’ ‌గా పిలవబడేటంతగా పేరు పొందాడు. వోటర్లకు లంచం లేదా భయపెట్టడం నేరంగా పరిగణించిన మహావ్యక్తి. ప్రవర్తన నియమావళిని తొలిసారిగా తుచ తప్పకుండా అమలు చేయించిన ఘనత శేషన్‌ ‌దే. అప్పట్లో గవర్నర్‌ ఒకరు.. కుమారుడి తరఫున ప్రచారం చేయడంతో మధ్యప్రదేశ్లోని ఓ నియోజకవర్గంలో ఎన్నికలను వాయిదా వేశారు.ఆ పరిణామం చివరకు గవర్నర్‌ ‌రాజీనామాకు దారితీసింది. నియమావళిని తుంగలో తొక్కాలని చూసే రాజకీయ పార్టీల అభ్యర్థుల పాలిట చండ శాసనుడుగా టి ఏన్‌. ‌శేషన్‌ ‌గా నిలిచినారు.

బేర సారాలకు అత్యధికులు విద్యావంతులే
ఎన్నికల్లో పోటీ చేసే ‘మనిషి విలువ కన్నా’ మని విలువే ఎక్కువ అయ్యింది. మానవ సంబందాలు మంట్లో కల్సినాయని దీనికి కారకులు ఎవరు? అని ప్రతి ఒక్క వోటర్‌ ‌ప్రశ్నించుకోవాలి ? సంపాదించుకునే అవకాశం ఉంది కాబట్టి అభ్యర్థులు విచ్చల విడిగా ఖర్చు చేస్తున్నారు అని నీకు తెలియదా ఖర్చు పెట్టినది దోచుకునేందుకు ప్రజాప్రతినిధులను ఆ విధంగా తయారు చేసింది ఎవరు ?. ఇక్కడ ఎవరిది నీతి ,ఏది అవినీతి అవసరం లేదు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ ‌బిఆర్‌ అం‌బేద్కర్‌ ‌నా దేశ ప్రజలకు కత్తిని చేతికి ఇవ్వలేదు, వోటు హక్కును ఆయుధంగా ఇచ్చాను. దాన్ని సద్వినియోగం చేసుకొని రాజులౌతారో, వోటును అమ్ముకోని బానిసలగా ఉంటారో అంత వారి చేతుల్లోనే ఉంది అన్నాడు అనాడు మహాత్ముడు.దానికి బిన్నంగా విజ్ఞానవంతులు కులం, మతం, డబ్బు , మద్యం వంటి ప్రలోభాలకు లొంగి వోటేస్తున్నరు. నిరక్ష్యరాస్యుల కంటే అక్షరాస్యులలోనే ఈ ప్రలోభాల ప్రభావాలు ఎక్కువగా ఉంటున్నాయి .అధికారమే ఏకైక లక్ష్యంగా రాజకీయ నాయకులు నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చి మంచి, చెడు విచక్షణలను మరిచి పోతున్నారు.వీటికి అడ్డుకట్ట వేయ కలిగింది.

ఒక వోటరు మాత్రమే.వోటర్లు విజ్ఞులయితే అయితే ఎవ్వరి ఆటలు సాగవు అయితే వోటర్లలో చైతన్యం కోరవడింది.అదే నేటి ఈ దౌర్భాగ్య పరిపాలన వ్యవస్థకు కారణమవుతుంది.ఇదిలా ఉంటే ప్రత్యర్థిని కొనుక్కొని ఎన్నికల్లో పోటీ నుంచి విరమింప చేయడం…ఈ కష్టాలన్నీ పడే బదులు డబ్బు తీసుకొని పోటీ నుంచి విరమించడం.పోటీ లేకుండా గెలవడం లేదా పోటీలో వోట్లు కొనివేయడం సరైన పద్ధతి అని నాయకులు అనుకుంటున్నారు. దానినే చాణక్యమని మీడియా ప్రచారం చేస్తుంది. ఎన్నికల సమయంలో అభ్యర్థులు వోటు కోసం వచ్చినప్పుడు ఉన్నత విద్య చదువుకున్నప్పటికి, మీకు వోటేస్తే మాకేం ఇస్తారు ? మా అపార్ట్మెంట్‌ ‌లో ఇన్ని వోట్లు ఉన్నాయి ఏమి ఇస్తారు ? బేర సారాలకు దిగుతుంటారు. ప్రభుత్వ ఉద్యోగులై ఉండి పోస్టల్‌ ‌బ్యాలెట్‌ ‌వోట్లకు వేలం వేసే సంస్కృతి దాపరించింది. విద్యావంతులు సిగ్గు విడిచి వోటుకు నోటు అడుగుతుంటే.. అభ్యర్థులు పోయిన డబ్బులు సంపాదించుకునేందుకు, భవిష్యత్త్ ‌తరాలకు సరిపోనూ నాయకులు అక్రమాలు చేయక తప్పడం లేదనేది రాజకీయ నిపుణుల అభిప్రాయం.

(25 జనవరి ,జాతీయ వోటరు దినోత్సవం సందర్భంగా)
– డా. సంగని మల్లేశ్వర్‌, ‌జర్నలిజం విభాగాధిపతి,
కాకతీయ విశ్వవిద్యాలయం,వరంగల్‌,9866255355.

Leave a Reply