Take a fresh look at your lifestyle.

వ్యతిరేకంగా వోటేసి టీఆరెస్‌కు బుద్ధి చెప్పాలి

  • లక్ష డబుల్‌ ఇళ్లు చూపిస్తానని ప్రభుత్వం మధ్యలోనే పారిపోయింది: సిఎల్‌పి నేత భట్టి విక్రమార్క
  • ఇండ్లు చూయిస్తానని మధ్యలోనే పారిపోయిన మంత్రి: పార్టీ అధికార ప్రతినిధి అయోధ్యరెడ్డి
  • కాంగ్రెస్‌ ‌కిసాన్‌ ‌సెల్‌ ఆధ్వర్యంలో ప్రగతి భవన్‌ ‌ముట్టడికి యత్నం..

రెండో రోజు మంత్రి తలసాని శ్రీనివాస్‌ ‌యాదవ్‌, ‌సిఎల్పీ నేత భట్టి విక్రమార్క గ్రేటర్‌ ‌హైదరాబాద్‌లో డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇం‌డ్లను పరిశీలించేందుకు వెళ్ళారు. గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌లక్ష ఇండ్లు చూపిస్తానని సవాల్‌ ‌చేసిన మంత్రి తలసాని శ్రీనివాస్‌ ‌యాదవ్‌..‌వాటిని చూపించలేక మేడ్చల్‌ ‌జిల్లా నాగారం మునిసిపాలిటీ నుంచి అర్థాంతరంగా వెళ్లిపోయారని భట్టి విక్రమర్క తీవ్రస్థాయిలో ఆరోపించారు. లక్ష ఇండ్లు చూపిస్తానన్న మంత్రి తలసాని గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌పరిధిలో మొదటి రోజు కేవలం 3,248 ఇండ్లు మాత్రమే చూపించారని భట్టి అన్న్డారు. ఇక శుక్రవారం రెండోరోజూ మిగిలిన ఇండ్లను చూపిస్తానన్న మంత్రి.. గ్రేటర్‌ ‌బయట రంగారెడ్డి జిల్లా, మేడ్చల్‌ ‌జిల్లాల్లోని మునిసిపాలిటిల్లో కట్టిన డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇం‌డ్లను చూపించారని ఆరోపించారు. తుక్కుగూడ, నాగారం మునిసిపాలిటీలు గ్రేటర్‌ ‌పరిధిలోనివి కాదన్న ప్రశ్నకు వారి దగ్గర సమాధానం లేకుండా పోయిందన్నారు. చివరగా.. మేడ్చల్‌ ‌జిల్లా నాగారం మునిసిపాలిటీలో ఇండ్లను చూపించి..ఇంక మావల్ల కాదు, మీకు లిస్ట్ ఇస్తాం.. మీరే చూసుకోండని మంత్రి అనడం ప్రభుత్వ డొల్ల• •నాన్ని బయట పెడుతోందని అన్నారు. లక్ష ఇండ్లను చూపించ లేక మంత్రి అర్థాంతరంగా మాకు పనులున్నాయి..అని నాగారం నుంచి వెళ్లిపోవడం.. లక్ష ఇండ్లను కట్టలేదన్న వాస్తవాన్ని అర్థం చేసిందని అన్నారు. గ్రేటర్‌లో లక్ష డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇం‌డ్లు కట్టామని రాష్ట్ర శాసనసభలో ప్రగల్భాలు పలికే కేసీఆర్‌, ‌కేటీఆర్‌లు..అంతిమంగా క్షేత్రస్థాయిలో ఇండ్లు చూపిస్తానన్న మంత్రి మాటలు నిజం కాదన్న విషయం ఇప్పుడు ప్రజలకు అర్థమయిందని అన్నారు. గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌నగరంలో కట్టిన డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇం‌డ్లు కేవలం 3,248 మాత్రమేనని భట్టి స్పష్టం చేశారు. ప్రతి ఎన్నికల సమయంలో నగరంలోని పేదలకు లక్ష ఇండ్లు పంపిణీ చేస్తామని అబద్ధం చెప్పడం ప్రభుత్వానికి ఆనవాయితీగా మరిందని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండ్లు లేని పేదలను మోసం చేసి వారి వోట్లతో అధికారాన్ని చెలాయించాలన్న కాంక్ష తప్ప వారికి నిజంగా మేలు చేసే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదని ఆయన చెప్పారు. రాబోయో గ్రేటర్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు తగిన రీతిలో బుద్ధి చెప్పి.. కాంగ్రెస్‌ను గెలిపించుకుందాని చెప్పారు. ప్రభుత్వ డబ్బుతో మన ఇండ్లను మనమే నిర్మించుకుందామన్న నినాదాన్ని ప్రజలకు భట్టి ఇచ్చారు.

ఇండ్లు చూయిస్తానని మధ్యలోనే పారిపోయిన మంత్రి : పార్టీ అధికార ప్రతినిధి అయోధ్యరెడ్డి
రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌పై కాంగ్రెస్‌ ‌పార్టీ అధికార ప్రతినిధి బోరెడ్డి అయోధ్యరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గ్రేటర్‌ ‌హైదరాబాద్‌లో లక్ష ఇండ్లు చూపిస్తానని సవాల్‌ ‌చేసిన మంత్రి తలసాని శ్రీనివాస్‌ ‌యాదవ్‌.. ‌వాటిని చూపించలేక మేడ్చల్‌ ‌జిల్లా నాగారం మునిసిపాలిటీ నుంచి అర్థాంతరంగా వెళ్లిపోయారని అయోధ్య ఆరోపించారు. లక్ష ఇండ్లు చూపిస్తానన్న మంత్రి తలసాని మొదటి రోజు గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌పరిధిలో కేవలం 3,248 ఇండ్లు మాత్రమే చూపించారన్నారు. రెండోరోజూ మిగిలిన ఇండ్లను చూపిస్తానన్న మంత్రి.. గ్రేటర్‌ ‌బయట రంగారెడ్డి జిల్లా మేడ్చల్‌ ‌జిల్లాల్లోని మునిసిపాలిటిలో కట్టిన డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇం‌డ్లను చూపించారని ఆరోపించారు. తుక్కుగూడ, నాగారం మునిసిపాలిటీలు గ్రేటర్‌ ‌పరిధిలోనివి కాదన్న ప్రశ్నకు వారి దగ్గర సమాధానం లేకుండా పోయిందన్నారు. చివరగా.. మేడ్చల్‌ ‌జిల్లా నాగారం మునిసిపాలిటీలో ఇండ్లను చూపించి.. ఇంక మావల్ల కాదు, మీకు లిస్ట్ ఇస్తాం.. మీరే చూసుకోండని మంత్రి అనడం ప్రభుత్వ డొల్లతనాన్ని బయట పెడుతోందన్నారు. లక్ష ఇండ్లను చూపించ లేక మంత్రి అర్థాంతరంగా మాకు పనులున్నాయి.. అని నాగారం నుంచి వెల్లిపోవడం.. లక్ష ఇండ్లను కట్టలేదన్న వాస్తవాన్ని అర్థం చేసిందన్నారు. గ్రేటర్‌లో లక్ష డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇం‌డ్లు కట్టామని రాష్ట్ర శాసనసభలో ప్రగల్భాలు పలికే కేసీఆర్‌, ‌కేటీఆర్‌ .. అం‌తిమంగా క్షేత్రస్థాయిలో ఇండ్లు చూపిస్తానన్న మంత్రి మాటలు నిజం కాదన్న విషయం ఇప్పుడు ప్రజలకు అర్థమయిందని అయోధ్యరెడ్డి అన్నారు. గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌నగరంలో కట్టిన డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇం‌డ్లు కేవలం 3,248 మాత్రమేనన్నారు. టీఆరెస్‌ అబద్దాల మాటల కోటలు, మాయమాటలు ఒక్కటొక్కటి బయట పెడతామన్నారు. అలాగే కేసీఆర్‌ ‌చేసిన మోసాలకు వచ్చే గ్రేటర్‌ ఎన్నికల్లో ప్రజలు వోటుతో బుద్ధి చెప్పాలని ప్రజలకు అయోధ్యరెడ్డి పిలుపునిచ్చారు.

కాంగ్రెస్‌ ‌కిసాన్‌ ‌సెల్‌ ఆధ్వర్యంలో ప్రగతి భవన్‌ ‌ముట్టడికి యత్నం..
నిరసన వ్యక్తం చేసేందుకు అవకాశం ఇవ్వడం లేదని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్క మండిపడ్డారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చ జరగలేదని విమర్శించారు. రైతుల డిమాండ్లపై ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం కాంగ్రెస్‌ ‌కిసాన్‌ ‌సెల్‌ ఆధ్వర్యంలో ప్రగతి భవన్‌ ‌ముట్టడికి యత్నంచారు. ఈ కార్యక్రమంలో ములుగు ఎమ్మెల్యే సితక్క కిసాన్‌ ‌కాంగ్రెస్‌ ‌నేతలు అన్వేష్‌ ‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు, భారీ వర్షాలకు నష్టపోయిన పంటలకు పరిహారం చెల్లించాలని డిమాండ్‌ ‌చేస్తూ ప్రగతి భవన్‌ ‌ముట్టడికి ప్రయత్నించారు. పోలీసులకు సితక్కకి మధ్య తోపులాట జరిగింది. అయితే ముట్టడికి యత్నించిన వారిని పోలీసులు అడ్డుకొని పోలీస్‌ ‌స్టేషన్‌ ‌కి తరలించారు. పంటల బీమా కింద రైతులకు చెల్లించాల్సిన పరిహారం 500 కోట్లు చెల్లింపు, ఏకకాలంలో రుణమాఫీ చేయాలని కిసాన్‌ ‌సెల్‌ ‌డిమాండ్‌ ‌చేసింది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply