Take a fresh look at your lifestyle.

వోటమి భయంతో గూండాలను ప్రేపిస్తున్నారు

  • మమత రెచ్చగొట్టే రాజకీయాలు మానాలి
  • కూచ్‌బెహార్‌ ‌ఘటనపై ప్రధాని మోడీ..విచరాణకు ఇసికి వినతి

పశ్చిమ బెంగాల్‌ ‌ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ ప్రజలను రెచ్చగొడుతున్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు. కూచ్‌ ‌బిహార్‌లో సీఐఎస్‌ఎఫ్‌ ‌కాల్పుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోవడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సిలిగురిలో శనివారం జరిగిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో మోదీ మాట్లాడుతూ, కూచ్‌ ‌బిహార్‌లో చాలా విషాదకరమైన సంఘటన జరిగిందన్నారు. ఈ సంఘటనలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి మృతిపట్ల ప్రగాఢ సంతాపం తెలిపారు. బీజేపీకి ప్రజలు మద్దతిస్తుండటాన్ని మమత బెనర్జీ, ఆమె గూండాలు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. తన కుర్చీ చేజారుతోందని ఆమెకు తెలుసునని, అందుకే ఇంత నీచ స్థాయికి దిగజారిపోయారని దుయ్యబట్టారు. మమత బెనర్జీ, టీఎంసీ, వారి గూండాలకు ఓ విషయాన్ని స్పష్టంగా చెప్పాలనుకుంటున్నానని మోదీ అన్నారు. పశ్చిమ బెంగాల్‌లో వారి విధానాలను అమలు చేయడానికి అనుమతించబోమని చెప్పారు. కూచ్‌ ‌బిహార్‌ ‌ఘటనలో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌ను కోరారు. ‘దీదీ..ఈ హింసాకాండ, భద్రతా దళాలపై దాడికి ప్రజలను రెచ్చగొట్టే చిట్కాలు, పోలింగ్‌ ‌పక్రియకు ఆటంకం కలిగించే చిట్కాలు మిమ్మల్ని కాపాడవు. పదేళ్ళ వి• తప్పుడు పాలన నుంచి ఈ హింసాకాండ మిమ్మల్ని రక్షించదు’ అని మోదీ అన్నారు. బెంగాల్‌లో అనేక దశాబ్దాల నుంచి కొనసాగుతున్న రాజకీయ వాతావరణంలో మార్పునకు సమయం ఆసన్నమైందన్నారు. బలవంతపు వసూళ్ళ నుంచి విముక్తి పొందిన బెంగాల్‌ ‌రాబోతోందన్నారు. సిండికేట్‌, ‌కట్‌ ‌మనీల నుంచి విముక్తి పొందిన బెంగాల్‌ ఏర్పడబోతోందని చెప్పారు.

Leave a Reply