Take a fresh look at your lifestyle.

గుండెపోటుతో వాలంటీర్‌ ‌మృతి

అమరావతి,మే 2 : విశాఖ ఏజెన్సీ పాడేరు మండలం తుంపాడ గ్రామ సచివాలయం కుజ్జెలి పంచాయతీలో పెన్షన్లు పంపిణీ చేస్తూ మరణించిన వాలంటీర్‌ ‌గబ్బాడ అనురాధ (26)కు ప్రభుత్వం అండగా నిలిచింది. ఆమె కుటుంబానికి సిఎం  వైఎస్‌ ‌జగన్‌ 5 ‌లక్షల ఆర్థికసాయం ప్రకటించారు. ఆమె విధులు నిర్వహిస్తూ  గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. ఈ సంఘటన తెలియగానే సీఎం జగన్‌ ‌శనివారం అనురాధ కుటుంబానికి రూ. 5లక్షల పరిహారాన్ని ప్రకటించారని అధికారులు తెలిపారు.
వాలంటీర్‌ ‌మృతిపై సీఎంఓ అధికారులతో సీఎం జగన్‌ ‌ఫోన్లో మాట్లాడి, ఘటన వివరాలను అడిగి తెలుసుకు న్నారన్నారు. విపత్తు సమయంలో పని చేస్తున్న వాలంటీర్లకు ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే అనూరాధ కుటుంబానికి రూ.5 లక్షల పరిహారాన్ని ప్రకటిస్తూ, ఈ సహాయం వెంటనే కుటుంబ సభ్యులకు అందేలా చూడాలని విశాఖ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించినట్లు అధికారులు తెలిపారు.

Leave a Reply