Take a fresh look at your lifestyle.

తల్లిదండ్రుల మందలింపుతో వలంటీర్‌ ఆత్మహత్య

గుంటూరు,అగస్టు 24: క్షణికావేశంలో ఓ వలంటీర్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. గుంటూరు జిల్లా, సీతానగరం రైల్వే ట్రాక్‌పై విజయవాడకు చెందిన వలంటీర్‌ ‌శవమై కనిపించాడు. సెల్‌ ‌ఫోన్‌ ‌పోగొట్టు కున్నాడని కుటుంబ సభ్యులు మందలించడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. విజయవాడ కృష్ణలంకలో నివాసముండే షేక్‌ ‌లాల్‌ ‌భాషా(26) రాణిగారి తోటలో వలంటీర్‌గా పనిచేస్తున్నాడు.

తన సెల్‌ ‌ఫోన్‌ ‌పోగొట్టుకోవడంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్థాపానికి గురైన యువకుడు గుంటూరు, సీతానగరం రైల్వే బ్రిడ్జి సపంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply